twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్లకు నరకయాతన.. అనుభవించిన బాధలు బయటపెట్టాలి.. క్యాస్టింగ్ కౌచ్‌పై గౌతమి

    |

    Recommended Video

    Cancer Awareness : Actress gowtami kamalhasan About Oversharing Issues In Film Industry : Gautami

    బాలీవుడ్, ఇతర సినీ పరిశ్రమలను మీ టూ ఉద్యమం కుదిపేస్తున్నది. లైంగిక వేధింపులు, రకరకాల శారీరక హింసపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. తమకు జరిగిన పలు అన్యాయాలను సినీ తారలు బయటపెడుతున్నారు. ప్రస్తుతం లైంగిక వేధింపుల విషయం ప్రతీ పరిశ్రమలోనూ చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో నటి గౌతమి క్యాస్టింగ్ కౌచ్ అంశంపై స్పందించారు. నటి గౌతమి అభిప్రాయం ఆమె మాటల్లోనే..

    దారుణమైన పరిస్థితులను చూశా.. ధైర్యంగా ఎదురించా.. ఆ కష్టాలు మాటల్లో చెప్పలేను.. గౌతమిదారుణమైన పరిస్థితులను చూశా.. ధైర్యంగా ఎదురించా.. ఆ కష్టాలు మాటల్లో చెప్పలేను.. గౌతమి

    పాలిటిక్స్ గురించి మాట్లాడటానికి

    దాదాపుగా 20 ఏళ్ల నుంచి బీజేపీలో ఉన్నాను. ప్రస్తుతం రాజకీయపరంగా ఎలాంటి కార్యచరణ లేదు. మాట్లాడటానికి పెద్దగా విషయం లేదు. సమాజానికి మంచి జరిగే విషయాలపై స్పందిస్తున్నాను. నా కమిట్‌మెంట్ ఏంటో అనేది త్వరలోనే చెబుతాను.

    పరిశ్రమను వదిలి వెళ్లలేదని

    పరిశ్రమను వదిలి వెళ్లలేదని

    సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటే సెకండ్ ఇన్సింగ్ గురించి అని చెప్పేదానిని. కానీ నేను ఎప్పడూ వదిలి వెళ్లలేదు. నా దృష్టిలో ఫస్ట్ ఇన్నింగ్సే కంటిన్యూ అవుతున్నది. నేను తెరపైన కనిపించలేదు కానీ.. కెమెరా వెనుక చాలా రకాలుగా పనిచేశాను.

    నా జీవితం సినీ ఇండస్ట్రీతోనే

    జ్యోతిక, లిజి, నదియా మళ్లీ సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించడం మంచి పరిణామం. నేను కూడా త్వరలో తెరపైన కనిపించే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన విషయాలు ఓ కొలిక్కిరానున్నాయి. నా జీవితం ఇండస్ట్రీతోనే ముడిపడి ఉంది.

     నరకయాతన గురించి

    నరకయాతన గురించి

    క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. ఏ విషయమైనా.. బాధ కలిగించిన దేనినైనా అడ్రస్ చేయాలి. నాకు గతి లేదు, నా వెనుక ఎవరూ లేరు అనే విషయాన్ని పట్టించుకోకుడదు. అలా ఆలోచించుకొని చాలా మంది చాలా రకాలుగా నరకయాతన అనుభవిస్తున్నారు.

    బాధ కలిగించే ప్రతీ విషయాన్ని

    పరిశ్రమలో ఎలాంటి రూపంలో ఎలాంటి వేధింపులకు గురైనా వాటిని బయపెట్టాలి. అలాంటి వాటిని ఖండించాలి. ప్రతీ రంగంలో ఇలాంటి వేధింపులు ఉన్నాయి. శారీరకంగానే కాకుండా మానసికంగా, ఆర్థికంగా, రకరకాల రూపంలో ఉన్నాయి. అన్యాయాన్ని బయట పెట్టడానికి ధైర్యం చేస్తున్న ప్రతీ ఒక్కరిని చూస్తే సంతోషంగా ఉంది.

    English summary
    Gautami Tadimalla responded on Cancer disease. She revealed her experiences. Gautami given clarity and information on Cancer medication and diagnosis. She shared her cancer treatment experiences, given opinion on Casting couch to Telugu filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X