India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  100 కోట్ల డైమండ్ 10 రూపాయలకే.. చోర్ బజార్‌‌లో ఊహించని విషయాలు.. జీవన్ రెడ్డి (ఇంటర్వ్యూ)

  |

  తెలుగు సినిమా పరిశ్రమలో దళం, జార్జ్ రెడ్డి లాంటి సంచలన విజయాలు అందుకొన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జీవన్ రెడ్డి ప్రస్తుతం ఆకాష్ పూరి హీరోగా చోర్ బజార్ సినిమాను తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ సంస్థ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ..

  నా గత చిత్రాలకు భిన్నంగా పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందించిన చిత్రమిది. హింస, రక్తపాతం లేకుండా వినోదాత్మక సినిమా చేయాలని ఈ చిత్రాన్ని తెరకెక్కించా. ఇది జార్జ్ రెడ్డి సినిమా కంటే ముందు సిద్ధమైన కథ. ప్రతి ఫ్రేమ్ కలర్‌ఫుల్ గా ఉంటుంది. దాదాపు 35 రోజులు రాత్రి పూట షూటింగ్ చేశాం. అయినా సన్నివేశాలన్నీ బ్రైట్‌గా, కలర్‌ఫుల్‌గా వచ్చాయంటే దానికి మా సినిమాటోగ్రాఫర్ జగదీశ్ టాలెంట్ కారణం అని జీవన్ రెడ్డి అన్నారు.

   George Reddy fame Jeevan Reddy interview about Chor Bazar

  చార్మినార్‌కు సమీపంలోని చోర్ బజార్‌కు చాలా సార్లు వెళ్లాను. అక్కడి మనుషుల స్వభావం ఆకట్టుకుంది. వాళ్లు వస్తువులు దొంగతనం చేయరు. మనం వద్దనుకుని పడేసిన వస్తువులను సేకరించి అక్కడ తక్కువ ధరలకు అమ్ముతుంటారు. మా సినిమా షూటింగ్ కోసం అక్కడి నుంచి చాలా వస్తువులు లోడ్‌లలో తెప్పించాం. ఆధార్ కార్డు లేకుండా ఏమాత్రం గుర్తింపు లేని మనుషులు వారు. వాళ్లను అడిగితే మాకు ఓటు హక్కు లాంటి కనీస గుర్తింపు లేదని బాధపడుతుంటారు. ఇలాంటి అంశాల్ని సినిమాలో ప్రస్తావించాం అని జీవన్ రెడ్డి చెప్పారు.

  చోర్ బజార్ మూవీలో నేను చూసిన మనుషులు రాత్రంతా బిజినెస్ చేసి, పగలు నిద్రపోతుంటారు. పగలో జీవితం, రాత్రి మరో జీవితం గడుపుతుటారు. ప్రతి ఒక్కరూ ఒక్కో హీరోను అభిమానిస్తారు. ఆ స్ఫూర్తితోనే మా చిత్రంలో హీరోకు బచ్చన్ సాబ్ అనే పేరు పెట్టాం. రికార్డుల కోసం తాను చేసే వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ సినిమాలో పాత్రలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటూ ఫుల్ కమర్షియల్ గా సాగుతుంటాయి.

  హీరోయిన్ గెహనా సిప్పీ మూగ పాత్ర పోషించింది. ఆమెకు మాట్లాడటం రాకున్నా ఇప్పుడున్న టెక్నాలజీ, సోషల్ మీడియా ద్వారా మాట్లాడించాం. తను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు సినిమాల డైలాగ్స్ వినిపిస్తూ చెబుతుంది. సినిమా ప్రధానంగా లవ్ స్టోరి అయినా..ఒక విలువైన డైమండ్ చుట్టూ తిరుగుతుంది. వంద కోట్ల రూపాయల విలువైన డైమండ్ పోయినా అది చోర్ బజార్ లో ప్రత్యక్షమవుతుంది. కానీ అక్కడి వాళ్లకు దాని విలువ తెలియదు. పది రూపాయలకే అమ్ముతుంటారు. ఈ డైమండ్ చుట్టూ డ్రామా, ఫన్ క్రియేట్ అవుతాయి.

  నాకు గురువు ఆర్జీవీ..అయితే ఇండస్ట్రీలో ప్రతి దర్శకుడితో స్నేహం ఉంది. ఫోన్ చేసి మాట్లాడుతుంటాను. త్వరలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాను. ఆ వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడిస్తా అని జీవన్ రెడ్డి చెప్పారు.

  English summary
  Aakash Puri's Chor Bazar is releasing on June 24th. Here is the George Reddy fame Jeevan Reddy shared inside emotions of the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X