twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాలు వదిలేద్దామనే ఆలోచన.. వాటితో దూలతీరుతోంది.. మంచు లక్ష్మి

    By Bojja Kumar
    |

    మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'వైఫ్ ఆఫ్ రామ్'.విజయ్ యొలకంటి దర్శకుడు. ఇది ఒక సైకలాజికల్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్. ఊహించని మలుపులతో.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన సినిమా. ఓ ఎన్.జి.వో. లో పనిచేసే దీక్ష అనే యువతి చుట్టూ తిరిగే కథ ఇది. ఆమె భర్త హత్యకు గురవుతాడు. ఆ రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఆ యువతి ఎదుర్కొన్న వింత, భయానక పరిస్థితులేంటీ అనేది కథ. జులై 20న సినిమా విడుదవుతున్న నేపథ్యంలో మంచు లక్ష్మి మీడియాతో ముచ్చటించారు.

    Recommended Video

    Manchu Lakshmi Prasanna Makes Serious Comments To Media
    తెలుగులో ఇలాంటి సినిమాలు అరుదు

    తెలుగులో ఇలాంటి సినిమాలు అరుదు

    తెలుగులో చాలా అరుదుగా జోనర్ బేస్డ్ సినిమాలు వస్తుంటాయి. సాధారణంగా మనం యాక్షన్, మ్యూజిక్, డ్రామా అన్ని ఒకే సినిమాలో పాకించేద్దామనుకుంటాం. కానీ కాలం మారింది. వైఫ్ ఆఫ్ రామ్ అనేది సైకలాజికల్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్ అని మంచు లక్ష్మి తెలిపారు.

    సినిమాలో అలాంటివేమీ ఉండవు

    సినిమాలో అలాంటివేమీ ఉండవు

    విజయ్ నాకు స్టోరీ చెప్పిన వెంటనే చాలా నచ్చింది. టిపికల్ తెలుగు సినిమా కాదు. పాటలు డాన్సులు అస్సలు ఉండవు. మామూలుగా మన సినిమాల్లొ హీరోను ఇంట్రడ్యూస్ చేయడం, హీరోయిన్‌ను ఇంట్రడ్యూస్ చేయడం లాంటి తరహాలో కాకుండా నేరుగా కథలోకి ప్రేక్షకులు వెళతారు అని మంచు లక్మి తెలిపారు.

    ఒక సాధారణ గృహిణి జర్నీ

    ఒక సాధారణ గృహిణి జర్నీ

    ఫస్టాఫ్ గంట. సెకండాఫ్ 54 నిమిషాలు. అరిచేయడాలు, పొడిచేయడాలు...మళ్లీ వస్తాను, మీ సంగతి చూసుకుంటాను లాంటి శపథాలు లేకుండా... ఒక ఆర్డినరీ ఫ్యామిలీకి చెందిన వైఫ్ జర్నీ. ఒక ఇన్సిడెంట్ జరిగితే వారి లైఫ్ ఎలా మారిపోతుందో? ఆ పరిస్థితులు ఆమెను ఎలా మార్చాయి అనే కోణంలో కథ సాగుతుంది.

    కహానీ సినిమాతో పోల్చొద్దు

    కహానీ సినిమాతో పోల్చొద్దు

    ‘కహానీ' మూవీకి మా సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదు. అందులో, ఇందులో భార్య క్యారెక్టరే. అందుకే మీకు అలా అనిపించిందేమో? ఇది పూర్తిగా విభిన్నమైన సినిమా. నేను ఇందులో దీక్ష అనే పాత్రలో నటించాను. ఆమె ఒక ఎన్జీవోలో పని చేస్తుంటుంది. అమ్మా నాన్న చిన్నపుడే చనిపోవడంతో బాబాయ్ పిన్ని వాళ్ల ఇంట్లో పెరిగింది. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ తర్వాత కథ ఆసక్తికరంగా సాగుతుంది అని మంచు లక్ష్మి తెలిపారు.

    విజయ్ పాషన్ ఉన్న దర్శకుడు

    విజయ్ పాషన్ ఉన్న దర్శకుడు

    దర్శకుడు విజయ్ ఒక సినిమా తీసేసి పవన్ క ళ్యాణ్, మహేష్ బాబుతో చేయాలనుకునే రకం కాదు. ఒక పాషన్ ఉన్న దర్శకుడు. డిఫరెంటుగా ఆలోస్తాడు. అతడు కథ చెప్పే విధానం కూడా బాగా నచ్చింది అని మంచు లక్ష్మి తెలిపారు.

    చాలా టైటిల్స్ అనుకున్నాం

    చాలా టైటిల్స్ అనుకున్నాం

    ఈ సినిమాకు చాలా టైటిల్స్ అనుకున్నాం. దీక్ష, వేట టైటిల్స్ రిజిస్టర్ చేయించాం. చివరకు ‘వైఫ్ ఆఫ్ రామ్' అనుకున్నపుడు ఊరి సైడ్ ఈ టైటిల్ అర్థమవుతుందా? అనే సందేహం కూడా వచ్చింది. అయితే ప్రేక్షకులు నన్ను చూసి వస్తే చాలు అనుకుని దాన్నే ఫైనల్ చేశాం అని మంచు లక్ష్మి తెలిపారు.

     సినిమాలోని పాత్రల గురించి

    సినిమాలోని పాత్రల గురించి

    రామ్ పాత్రలో సామ్రాట్ చేశాడు. అతడి పాత్ర సినిమాలో ఎంతో కీలకం. ప్రియదర్శి క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని మంచు లక్ష్మి తెలిపారు.

    మా ఫ్యామిలీకి చూపించలేదు

    మా ఫ్యామిలీకి చూపించలేదు

    ఈ సినిమాను మా ఫ్యామిలీలో ఎవరికీ చూపించలేదు. మనోజ్ ఒక్కడికే చూపించాను. వాళ్లు తీసే సినిమాలతో పోలిస్తే నా ఆలోచన పూర్తి విభిన్నంగా ఉంటుంది. వారు చూసి బాగోలేదు అంటే మనం చాలా ఎఫెక్ట్ అవుతాం. అంతా అయిపోయిన తర్వాత చూపిస్తే మీరేమన్నా అనుకోండి అయిపోయిందనుకుని లైట్ తీసుకుంటాం... అని లక్ష్మి అభిప్రాయ పడ్డారు.

    డాడీ నేను కలిసి తీయాలంటే...

    డాడీ నేను కలిసి తీయాలంటే...

    నేను, డాడీ కలిసి చేయాలంటే ‘పికు' లాంటి సినిమాలు బావుంటాయి. కానీ అలాంటి సినిమాలు తెలుగులో తీస్తే చూస్తారా? నాన్న నేను కలిసి చేసే మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాం.

    బాబోయ్ మంచు లక్ష్మి సినిమా అని భయపడే పరిస్థితి లేదు

    బాబోయ్ మంచు లక్ష్మి సినిమా అని భయపడే పరిస్థితి లేదు

    మీరు మంచి సినిమాలు చేస్తున్నారు, నటిగా మంచి పేరొస్తుంది. కమర్షియల్‌గా సక్సెస్ అందుకోవడం లేదు. కారణాలు ఏమిటి? అనే ప్రశ్నకు మంచు లక్ష్మి స్పందిస్తూ..... నా పని నేను హానెస్ట్‌గా చేసుకుంటూ వెళుతున్నాను. బాబోయ్ లక్ష్మి నుండి సినిమా వస్తుంది, చెత్తగా ఉండబోతోంది అనే పేరు అయితే లేదు. ఆ రకంగా చూసుకుంటే ఒక ఫిల్మ్ మేకర్‌గా, యాక్టర్‌గా నేను సక్సెస్ అయినట్లే. సినిమా జయాపజయాలు అనేవి సర్వసాధారణం. కోటి రూపాయలు పెట్టి పది కోట్లు వచ్చే సినిమాలైతే ఇంకా చేయలేదు.... అని తెలిపారు.

    మంచి సినిమా ఆడకపోతే...

    మంచి సినిమా ఆడకపోతే...

    ఒక మంచి సినిమా చేసి ఆడకపోతే... సినిమాలు వదిలేద్దామనే ఆలోచన ప్రతి సారి ఉంటుంది. మా నాన్నమాట విని ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఎందుకొచ్చిన ఈ టెన్షన్ అనిపిస్తుంది. కానీ వారం తర్వాత మళ్లీ ఆలోచన మారిపోతుంది. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసి పెరుగుతుంది అని లక్ష్మి వ్యాఖ్యానించారు.

    టీవీ షోలతో దూల తీరిపోతుంది

    టీవీ షోలతో దూల తీరిపోతుంది

    టీవీ షోల కంటే సినిమాలే ఈజీ. టీవీ షోలు చేయడం వల్ల దూల తీరితోంది. సినిమా చేస్తున్నపుడు పది తప్పులు జరిగితే... మేము సైతం టీవీ షో చేస్తున్నపుడు 100 తప్పులు జరుగుతాయి. వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్లడం చాలా కష్టంగా ఉంటుంది అని మంచు లక్ష్మి వ్యాఖ్యానించారు.

    English summary
    Lakshmi Manchu’s upcoming film directed by Vijay Yelakanti is a psychological thriller that has been picturised with some interesting plot points.The film has completed the censor formalities and was awarded a UA certificate by the board that was all praise for the film. It is now set to release on July 20.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X