»   » ‘సినిమా అంటే సిగ్గు, నీతి, మానం వదిలేయాలి’.. శ్రీరెడ్డి, హరితేజకు సంబంధం లేదు.. ఇంద్రగంటి

‘సినిమా అంటే సిగ్గు, నీతి, మానం వదిలేయాలి’.. శ్రీరెడ్డి, హరితేజకు సంబంధం లేదు.. ఇంద్రగంటి

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  తెలుగు సినిమా పరిశ్రమలో మంచి అభిరుచి కలిగిన దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. గ్రహణం, అష్టాచెమ్మా, అంతకు ముందు ఆ తర్వాత, జెంటిల్మన్ చిత్రాలు ఆయన ప్రతిభకు అద్దం పట్టాయి. తాజాగా సినిమా నేపథ్యంతో ఓ మంచి రొమాంటిక్ లవ్‌స్టోరి సమ్మోహనం చిత్రంతో ముందుకు వస్తున్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్ రూపొందించిన ఈ చిత్రంలో అదితిరావు, సుధీర్‌బాబు జంటగా నటించారు. ఈ చిత్రం జూన్ 15న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో ఇంద్రగంటి మోహనకృష్ణ తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంద్రగంటి వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

  బ్రహ్మండంగా సమ్మోహనం అవుట్‌పుట్

  బ్రహ్మండంగా సమ్మోహనం అవుట్‌పుట్

  సమ్మోహనం చిత్రం ఫైనల్ అవుట్‌పుట్ బ్రహ్మండంగా వచ్చింది. ఈ సినిమాకు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక చక్కగా కుదిరింది. ఈ సినిమాలో రకరకాల సమ్మోహనాలు ఉంటాయి. అదితిరావు చాలా అందంగా ఉంటుంది. సుధీర్‌బాబు నటనపరంగా, లుక్‌పరంగా చాలా కొత్తగా కనిపిస్తారు. ఆ పాత్ర నాకు చాలా ఇష్టపడ్డాను. సీనియర్ నటుడు నరేష్ ప్రధానమైన పాత్రలో కనిపించారు. గోల్కొండ హైస్కూల్ సినిమా షూట్ సందర్భంగా ఓ వ్యక్తి తారసపడ్డారు. ఆయన కథను పాయింట్ చేసుకొని ఈ స్టోరి రాసుకొన్నాను. దానిని ప్రేమకథగా మార్చాను.

  నరేష్ పాత్ర కీలకం

  నరేష్ పాత్ర కీలకం

  హీరో తండ్రి పాత్ర నరేష్ పోషించారు. ఆయనకు సినిమా అంటే విపరీతమైన పిచ్చి. సినిమాను గొప్ప కళగా భావిస్తుంటారు. కానీ కొడుకు సినిమా అంటే ఇష్టం ఉండదు. ఇలా సినిమా మీద అభిప్రాయ బేధాలు ఉన్నప్పుడు అదితిరావు హీరోయిన్‌గా కథలోకి ప్రవేశించారు అనేది సమ్మోహనంలోని ఓ పాయింట్. ముందుగా నరేష్ పాత్రకు తనికెళ్ల భరణి, రావు రమేష్ అనుకొన్నాను. కానీ వారి ఇమేజ్ ఎక్కువగా ఉండటంతో నరేష్‌ను ఎంపిక చేశాను.

  నానితో నాది లవ్ స్టోరీ కాదు... కామం స్టోరీ : శ్రీరెడ్డి మరో సంచలనం!
  పరిశ్రమను చెడుగా చూపించలేదు

  పరిశ్రమను చెడుగా చూపించలేదు

  సమ్మోహనం చిత్రంలో పరిశ్రమను చెడుగా చూపించలేదు. మంచి చెడులను చర్చించాం. ఈ చిత్రంలో సద్విమర్శ ఉంది. ప్రతీ రంగంలో మంచి చెడు ఉంటుంది. నాకు తిండి పెట్టే సినీ పరిశ్రమను చెడుగా ఎలా చూపిస్తాను!. సినిమా పరిశ్రమను కెరీర్‌గా ఎంచుకోవడంపై నా సన్నిహితులు ఒక్కోరకంగా మాట్లాడుతారు. ఉన్నత విద్యను అభ్యసించి చెండాలమైన సినీ పరిశ్రమలో ఎలా ఉంటున్నారు అని ప్రశ్నిస్తారు? సినిమా పరిశ్రమ అంటే చాలా మందికి చెడు అభిప్రాయం ఉంది. ఎవరైనా అమ్మాయి సినిమా హీరోయిన్ అవుతాననంటే చెడుగా చూస్తారు. అదే ఐటీ ఇంజినీర్ అవుతానంటే అలా చూడరు.

   మహిళలపై ఎక్కువ గాసిప్స్

  మహిళలపై ఎక్కువ గాసిప్స్

  సినిమా పరిశ్రమలో మహిళల గురించి చెడు అభిప్రాయం, గాసిప్స్ ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఒక రకమైన చులకనభావం ఏర్పడింది. నా దగ్గర పనిచేసే, నాకు తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు పిల్లను ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. సినిమా కోసం ఆఫీసులు ఇవ్వరు. సినిమా అంటే చాలా మంది అదోరకంగా చూస్తారు. సినిమా రంగంలో ఉన్నవారు కూడా సినిమా వాళ్లను చెడుగా చూస్తారు. అలాంటి అభిప్రాయాన్ని తొలగించే ప్రయత్నం చేశాం.

  శ్రీరెడ్డితో సంబంధం లేదు

  శ్రీరెడ్డితో సంబంధం లేదు

  సమ్మోహనం సినిమా షూట్ చేసేటప్పుడే శ్రీరెడ్డి వ్యవహారం మీడియాలో వెలుగు చూసింది. కానీ నేను అలాంటి సన్నివేశాలు ఏడాదికి ముందే సీన్లు రాసుకొన్నాం. ట్రైలర్లు కట్ చేసే ముందు శ్రీరెడ్డిని చూసే సీన్లు పెట్టామనుకొంటారు. వాటిని తొలగిద్దామా? అని కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. కానీ నేను వద్దు అని వారించాను. అలాంటివి సినిమాకు ప్లస్ అవుతాయి అని నేను వారికి చెప్పాను.

  హరితేజ సంఘటన

  హరితేజ సంఘటన

  సమ్మోహనం సినిమా డబ్బింగ్ జరుగుతున్న సమయంలోనే హరితేజకు ఓ చేదు సంఘటన ఎదురైంది. థియేటర్లలో జరిగిన సంఘటనలో సినిమా వాళ్లంతా చెడ్డవారు అనే విధంగా మాట్లాడటం హరితేజ ఎమోషనల్‌గా రగిలిపోయారు. తనకు ఎదురైన అనుభవాన్ని చెబుతూ హరితేజ వీడియో పెట్టారు. సరిగ్గా మా కథకు సంబంధం ఉన్న సన్నివేశాలే బయట జరగడం యాదృచ్చికం మాత్రమే.

  శ్రీరెడ్డి లేవనెత్తిన విషయంలో..

  శ్రీరెడ్డి లేవనెత్తిన విషయంలో..

  సినీ పరిశ్రమలో మహిళల పట్ల కొంత వివక్ష ఉంది. శ్రీరెడ్డి లేవనెత్తిన విషయాలు కొన్ని వాస్తవాలే. కానీ వాటిపై చర్చ పరిధి దాటింది. అలాంటి విషయాలను సంస్కారవంతంగా ఎలా చెప్పవచ్చో చూపించాను. కానీ సినిమా పరిశ్రమను తూలనాడలేదు. సినీ రంగంపై దురభిప్రాయం ఉంది. దానిని ప్రజల మైండ్ నుంచి పొగొట్టాలి. నా కూతురు భవిష్యత్‌లో సినిమా రంగానికి వస్తానంటే నేను కూడా ధైర్యంగా వెళ్లమనే పరిస్థితి రావాలి. సినీ పరిశ్రమలో వారసత్వం కొడుకులకే ఉంది. కూతుళ్లు వస్తానంటే పెద్ద చర్చ జరుగుతున్నది. సూపర్‌స్టార్ కృష్ణ కూతురు, నాగబాబు కూతురు నిహారిక సినీ పరిశ్రమలోకి వస్తుంటే భారీగా చర్చ జరిగింది. అలాంటి ప్రస్తావన నా సినిమాలో ఉంటుంది. అయితే నా సినిమాలో సినీ రంగం చులకన, చీప్‌గా చూపించే ప్రయత్నం చేయలేదు.

  సమ్మోహనం సినిమాతో మార్పు

  సమ్మోహనం సినిమాతో మార్పు

  సమ్మోహనం చిత్రం చూసిన తర్వాత సినిమా వాళ్లంటే మంచి అభిప్రాయం కలుగుతుందని అనుకొను. ఆహా ఓహో అనే పరిస్థితి ఉంటుదని అసలు అనుకోవడం లేదు. కానీ మంచి చర్చ జరుగాలని కోరుకొంటాను. సమ్మోహనం చూసిన తర్వాత సినిమా వాళ్లంటే గౌరవం పెరుగుతుందనే చెబుతారని అనుకొను. కానీ ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయంలో కొంత తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. సినీ పరిశ్రమపై మధ్య తరగతి వాళ్ల ఆలోచనా సరళి మారే అవకాశం ఉంటుంది. సినిమా వాళ్లు కనిపిస్తే సెల్పీలు తీసుకొంటారు. ఓపెనింగ్‌లకు సినిమా నటులు కావాలి. కానీ వాళ్లంటే జనంలో చులకన భావం ఉంది. అదే కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం.

  సినిమా అంటే సిగ్గు, నీతి, మానం వదిలేయాలి..

  సినిమా అంటే సిగ్గు, నీతి, మానం వదిలేయాలి..

  సినిమా రంగం అంటే నైతిక విలువలు ఉండవు. క్యారెక్టర్ లేను వ్యక్తులు ఉంటారు. సినిమా అంటే సిగ్గు, నీతి, మానం వదిలేయాలండి అని ఓ పెద్దాయన నాతో అన్నారు. ఇలాంటి జోకులు సినీ పరిశ్రమ మీద ఎలా వేస్తారు. ఇలాంటి వాటిపై సోషల్ మీడియా ప్రభావం కూడా ఉంది. సినిమా రంగంపై విమర్శల చాలా నిర్మాణాత్మకంగా ఉండాలి. సమ్మోహనం సినిమాలో అన్ని వర్గాలపై సద్విమర్శలు చేశాను. ఎవరినీ తూలనాడలేదు.

  ఆ సినిమాలకు పోలీకా?

  ఆ సినిమాలకు పోలీకా?

  సామాన్యుడిని ఓ సినిమా హీరోయిన్ ప్రేమించడం అనే సినిమాలు చాలానే వచ్చాయి. కానీ సమ్మోహనం సినిమాకు గతంలో వచ్చిన సినిమాలు పోలిక ఉండదు. అయితే హీరోయిన్, సామాన్యుడి (హీరో) కలుసుకోవడమనే ఎపిసోడ్ చాలా కొత్తగా ఉంటుంది. సినిమా పరిశ్రమలోనే డర్టీ ఉందా.. ఇతర రంగాల్లో ఉండదా అని హీరోయిన్‌తో చెప్పించాను. శివరంజని సినిమా చూడలేదు. రంగీలా చూశాను. కానీ వాటితో సంబంధం లేదు. సినిమా కథ చాలా తక్కువగా ఉంటుంది.

  అదితి కాకుండా కాజోల్, తమన్నా

  అదితి కాకుండా కాజోల్, తమన్నా

  సమ్మోహనం కథ రాసినప్పడు అదితిరావును అనుకోలేదు. కాజోల్, తమన్నా గురించి ఆలోచించాను. కానీ అప్పటికే వారికి మంచి ఇమేజ్ ఉంది. నా హీరోయిన్ పాత్రకు వారు సరిపోరు. అందుకే వారిని అప్రోచ్ కాలేదు. అప్పుడే మణిరత్నం తీసిన చెలియా సినిమాను వైజాగ్‌లో చూశాను. అదితికి కథ చెప్పాలి అని అప్పుడే అనుకొన్నాను. ఫోన్ చేసి మాట్లాడి 10 నిమిషాలు లైన్ చెబుతాను. ఇష్టం ఉంటే ముంబై వచ్చిన పూర్తి కథ చెబుతాను అని అన్నాను. కానీ పది నిమిషాల తర్వాత పూర్తి కథ చెప్పమని అదితి అడిగారు. ఫోన్ కథ చెప్పడం ఇష్టం లేకపోయినా కాదనలేకపోయాను. కథ మొత్తం విన్న వెంటనే ఎలాగైన సినిమా చేస్తాను. డేట్స్ అడ్జస్ట్ చేస్తాను అని చెప్పారు.

  సమ్మోహనంలో భావోద్వేగాలు

  సమ్మోహనంలో భావోద్వేగాలు

  సమ్మోహనం సినిమాలో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. మధ్య తరగతి కుటుంబాల్లో ఉంటే వాతావరణం సినిమాల్లో కనిపిస్తుంది. క్లైమాక్స్‌లో నరేష్ చేసే కామెడీ పార్ట్ అద్భుతంగా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేసే అన్ని అంశాలు ఉంటాయి. చక్కటి వినోదం కలిసి ఉంటుంది.

  English summary
  Director Indraganti Mohan Krishna's latest movie is Sammohanam. Sudheer Babu and Aditi Rao Hydari are lead pair. Sivalenka Krishna Prasad is the producer. This movie is going to release on june 15th. In this occassion, Director Indraganti Mohana Krishna speaks to Telugu Filmibeat.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more