Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 1 hr ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 3 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- Sports
IPL 2021: రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి కుమార సంగక్కర!
- News
దేశంలో నిరాటంకంగా ఎన్నికలు- త్వరలో రాజస్ధాన్, గుజరాత్లో- ఏపీలోనే విచిత్ర పరిస్ధితి
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Automobiles
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాజుగాడు వింత వ్యాధితో భాధపడుతుంటాడు - రాజ్ తరుణ్

'ఉయ్యాలా జంపాలా','సినిమా చూపిస్త మావ','కుమారి 21ఎఫ్' వంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన రాజ్ తరుణ్ ఈ మధ్య రంగుల రాట్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా రాజుగాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నూతన దర్శకురాలు సంజన ఈ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రి ఎవ్వబోతోంది. రాజుగాడు సినిమా జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ తో ఇంటర్వ్యూ...

సంజనా రెడ్డి చాలా చక్కగా తెరకెక్కించింది.
నేను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చేస్తున్న నాలుగో చిత్రమిది. సంజనా రెడ్డి చాలా చక్కగా తెరకెక్కించింది. హీరో క్యారెక్టరైజేషన్, రాజేంద్రప్రసాద్ గారి కామెడీ ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. సంజనా రెడ్డి నూతన దర్శకురాలు అయినప్పటికీ చక్కగా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది.

క్లెప్టోమేనియా అనే వింత వ్యాధితో
రాజుగాడు సినిమాలో హీరో క్లెప్టోమేనియా అనే వింత వ్యాధితో భాధపడుతుంటాడు. ఈ వ్యాధి లక్షణం ఏంటంటే.. తనకు తెలియకుండానే తన చెయ్యి దొంగతనం చేయడం. ఇది ఒకరకంగా వింత జబ్బు అనాలి. ఈ జబ్బు బయట చాలా మందికి ఉంటుంది.

అందుచేత సినిమాకు రాజుగాడు టైటిల్
సినిమాలో హీరో పేరు రాజు కావడంతో అందరు రాజుగాడు అని పిలుస్తూ ఉంటారు. అందుచేత సినిమాకు రాజుగాడు టైటిల్ పెట్టడం జరిగింది. సినిమా మొత్తం ప్రేక్షకులను నవ్విస్తుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా హాయిగా నవ్వుకొని వెళ్ళే సినిమా రాజుగాడు.

నేను రాజేంద్రప్రసాద్ కలిసి నటించాం
గతంలో నేను రాజేంద్రప్రసాద్ కలిసి నటించాం. రాజుగాడు సినిమా విషయానికి వస్తే... ఈ సినిమాలో పూర్తి స్థాయిలో మా కాంబినేషన్ వర్క్ అవుట్ అయ్యింది. సినిమా మొత్తం ఆయన ఉంటాడు. మా మధ్య వచ్చే సన్నివేశాలు సరదాగా ఉంటాయి.

కలిసి నటించడం మొదటిసారి
రాజుగాడు సినిమాలో అమైరా దస్తూర్ హీరోయిన్ గా నటిస్తుంది. తనతో నేను కలిసి నటించడం మొదటిసారి. పరిచయం లేదుకావున సినిమా షూటింగ్ మొదలైన కొన్ని రోజులు మాట్లాడుకోలేదు. తరువాత బాగా కలిసిపోయాం. షూటింగ్ కి తను కరెక్ట్ టైం కి వచ్చేది.

మంచి సినిమాలు చెయ్యాలి
సినిమాలు సక్సెస్ లో ఉన్నప్పుడు పెద్దగా ఆలోచన చెయ్యము. సక్సెస్ రేట్ తగ్గే కొద్ది మంచి సినిమాలు చెయ్యాలి అనిపిస్తుంది. టైం తీసుకొని బెస్ట్ స్క్రిప్ట్ లాక్ చెయ్యాలని ఉంటుంది. నా కెరీర్ లో రాజుగాడు సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది.

కుమారి 21ఎఫ్ డైరెక్టర్
రాజుగాడు సినిమా తరువాత లవర్ విడుదల కానుంది. కుమారి 21ఎఫ్ డైరెక్టర్ సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాను. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆ సినిమా ఉండబోతోంది.