»   » లిప్‌లాక్ చేస్తే తప్పేంటి.. అలాంటి సందర్భంలో నో చెప్పను.. ప్రభాస్‌తో.. పాయల్ రాజ్‌పుత్

లిప్‌లాక్ చేస్తే తప్పేంటి.. అలాంటి సందర్భంలో నో చెప్పను.. ప్రభాస్‌తో.. పాయల్ రాజ్‌పుత్

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  RX 100 Movie Heroine Payal Interview

  మరాఠీ చిత్రం సైరత్ పంజాబీ రీమేక్‌తో సినీ ఇండ్రీస్టీలోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్ మంచి గ్లామర్ తారగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆర్జీవి శిష్యుడు అజయ్ భూపతి రూపొందిస్తున్న RX 100 చిత్రంలో కొత్త హీరో కార్తీకేయకు జంటగా ఆమె నటిస్తున్నారు. RX 100 చిత్రం టీజర్లు, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. రిలీజ్‌కు ముందే పాజిటివ్ బజ్‌ను సొంతం చేసుకొన్న ఈ చిత్రం జూలై 12న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో పాయల్ తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. పాయల్ రాజ్‌పుత్ వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..

  సైరత్ రీమేక్‌కు ఫిల్మ్‌ఫేర్

  సైరత్ రీమేక్‌కు ఫిల్మ్‌ఫేర్

  నా పేరు పాయల్ రాజ్‌పుత్. పంజాబీ సినిమాల్లో, టెలివిజన్ సీరియల్స్‌లో ఇప్పటి వరకు నటించాను. మరాఠీలో ఘనవిజయం సాధించిన సైరత్ చిత్రం పంజాబీ రీమేక్‌లో నటించాను. ఆ చిత్రంలో నా నటనకు ఫిలింఫేర్ అవార్డు లభించింది. RX 100 చిత్రంతో దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నాను. అందుకు చాలా సంతోషంగా ఉంది.

   కథ బలంగా ఉంటే

  కథ బలంగా ఉంటే

  నేను ఎలాంటి పాత్రలు పోషించాలన్నది ప్రధానం కాదు. స్క్రిప్టులో బలం ఉందనిపిస్తే ఆ చిత్రంలో నటించడానికి నిర్ణయం తీసుకొంటాను. కథ లేకుండా, ఎలాంటి పాత్ర చేసిన దాని వల్ల ఫలితం శూన్యమే. మంచి డైరెక్టర్ ఉంటే ఇక ఆలోచించను.

  మరోమారు ఆలోచించకుండా

  మరోమారు ఆలోచించకుండా

  దర్శకుడు అజయ్ భూపతి కథ చెప్పగానే మరోమారు ఆలోచించకుండా ఒకే చెప్పాను. కథ చాలా విభిన్నమైనది. ఇంతకు ముందు రానటువంటి స్క్రిప్ట్ ఇది. సినిమా రిలీజ్ తర్వాత సినిమా గురించి మీకే తెలుస్తుంది. ఇక నుంచి మంచి రోల్స్‌లో నటించడానికి ప్రయత్నిస్తుంటాను.

  లిప్‌లాక్ సీన్లు చేస్తే

  లిప్‌లాక్ సీన్లు చేస్తే

  లిప్‌లాక్ సీన్లు చేస్తే తప్పేంటి? కథ డిమాండ్ చేస్తే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. RX 100 కథలో భాగంగానే లిప్‌లాక్ సీన్లు, శృంగార సన్నివేశాల్లో ఉంటాయి. కానీ అనవసరంగా అలాంటి సీన్లు ఈ చిత్రంలో ఉండవు.

  కార్తీకేయ టాలెంటెడ్

  కార్తీకేయ టాలెంటెడ్

  కొత్తగా హీరోగా కార్తీకేయ పరిచయం అవుతున్నాడనే విషయాన్ని ఆలోచించలేదు. పట్టించుకోలేదు. కథ నచ్చడం వల్లనే ఈ సినిమా చేశాను. హీరో కార్తీకేయ టాలెంటెడ్. మంచి సహనటుడు. ఈ చిత్రం ద్వారా మంచి ఫ్రెండ్ లభించాడు. మళ్లీ అవకాశం లభిస్తే అతడితో నటించడానికి సిద్ధం.

   అజయ్ ఇంటెలిజెంట్

  అజయ్ ఇంటెలిజెంట్

  నేను ఇప్పటివరకు పనిచేసిన దర్శకుల్లో అజయ్ భూపతి బెస్ట్. ఇంటెలిజెంట్ డైరెక్టర్. అతడికి తాను చేసే పనిపై క్లియర్ విజన్ ఉంటుంది. స్వతహాగా నేను డైరెక్టర్ యాక్టర్ కావడంతో ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తూ పూర్తి చేశాను.

  ఆఫర్లు వస్తున్నాయి.. కానీ

  ఆఫర్లు వస్తున్నాయి.. కానీ

  ఆర్‌ఎక్స్ 100 తర్వాత పంజాబీ, కన్నడ చిత్రాల్లో నటిస్తున్నాను. తెలుగులో కొన్ని ఆఫర్లు వస్తున్నాయి. ఇంకా అంగీకరించలేదు. సెప్టెంబర్ తర్వాత తెలుగు సినిమాలను ఒప్పుకొంటున్నాను. ప్రస్తుతం తెలుగు నేర్చుకొంటున్నాను.

   ప్రభాస్‌తో నటించాలని ఉంది

  ప్రభాస్‌తో నటించాలని ఉంది

  తెలుగులో అవకాశం వస్తే ప్రభాస్‌, మహేష్‌బాబుతో నటించాలని ఉంది. ఇలియానా, అనుష్కశెట్టి అంటే ఇష్టం. పవన్ కల్యాణ్ చిత్రాలను ఎక్కువగా చూశాను. నాకు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించాలని ఉంది.

  రెమ్యునరేషన్ పట్టించుకోను

  రెమ్యునరేషన్ పట్టించుకోను

  సినిమాల ఎంపికలో రెమ్యునరేషన్‌ను పట్టించుకోను. కథ, డైరెక్టర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. మంచి పాత్రల్లో నటించి పేరు తెచ్చుకోవాలన్నదే నా ప్రస్తుత లక్ష్యం.

  English summary
  Ajay Bhupathi, a student of Ram Gopal Varma is making his directorial debut with RX 100 which is releasing on July 12th. Starring Karthikeya and Payal, the film is an intense love story. In occassion, Heroine Payal Rajput speaks to Telugu Filmibeat exclusively.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more