twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్పణం' మూవీ చూసి నేనే భయపడ్డా: హీరో తనిష్క్‌రెడ్డి (ఇంటర్వ్యూ)

    |

    యువ హీరో తనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్‌, శుభంగిపంత్‌ హీరోహీరోయిన్లుగా రామకృష్ణ వెంప దర్శకత్వంలో శ్రీనంద ఆర్ట్స్‌ పతాకంపై క్రాంతి కిరణ్‌ వెల్లంకి నిర్మిస్తున్న క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'దర్పణం'.. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్‌కి విశేష స్పందన లభిస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌6న గ్రాండ్‌గా విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో తనిష్క్‌ రెడ్డి ఇంటర్వ్యూ ..

    మీ గురించి?
    - మాది నల్గొండ జిల్లా. మా నాన్న గారు రిటైర్డ్‌ స్కూల్‌ టీచర్‌. నేను పుట్టింది పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే...ఇక యాక్టింగ్‌ విషయానికి వస్తే 'ఆ ఐదుగురు', 'దునియా', 'చక్కిలిగింత' లాంటి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్‌ చేశాను. అలాగే స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ గారితో 'ఐ యామ్‌ దట్‌ చేంజ్‌' అనే షార్ట్‌ ఫిలిం చేశాను. అది నా మూవీ కెరీర్‌కి ఎంతగానో ఉపయోగపడింది. 'సకలకళావల్లభుడు' సినిమాతో హీరోగా పరిచయమయ్యాను. 'దర్పణం' హీరోగా నా సెకండ్‌ మూవీ.

    Tanishq Reddy Interview: Darpanam would scared off audience

    ఇండస్ట్రీకి రావడానికి ఎవరినైనా ఇన్స్‌పిరేషన్‌గా తీసుకున్నారా?
    -ఇన్స్‌పిరేషన్‌ అంటూ ఏం లేదు కాని...'ఆర్య' సినిమా చూసి హీరో అవ్వాలని డిసైడ్‌ అయ్యి బరువుతగ్గాను. తర్వాత యాక్టింగ్‌, డాన్సులు, ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నాను. అలాగే సినిమాల్లోకి రాక ముందే మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నాను. దాంతో 'సకలకళా వల్లభుడు' సినిమా ఆడిషన్‌కి వెళ్ళాను. వారికి డాన్సులు, ఫైట్స్‌ చేసే హీరో కావాలని నన్ను సెలెక్ట్‌ చేయడం జరిగింది.

    ఈ ప్రాజెక్ట్‌ ఎలా ఓకే అయింది?
    - నాకు ఇక ఆఫర్లు రావేమో అనుకుంటున్న టైంలో ఆర్‌ కె గారు ఒక కాఫీ షాప్‌లో కలిసి నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను అని ముందు ఇంటర్వెల్‌సీన్‌ చెప్పారు. దాంతో మెత్తం కథ వినకుండానే ఓకే చెప్పాను.

    కాన్సెప్ట్‌ ఏంటి?
    - అల్లరిచిల్లరగా తిరిగే కుర్రాడు అనుకోకుండా ఒక మర్డర్‌ మిస్టరీలో లాక్‌ అయితే దాన్ని ఎలా ఛేదించాడు? ఎలా బయటపడ్డారు? అనేది కథాంశం. సినిమా మొత్తం ఒక మర్డర్‌ మిస్టరీ చుట్టే తిరుగుతుంది. సెకండ్‌ హాఫ్‌ కి వచ్చే సరికి ట్విస్ట్‌లు, టర్నులతో భయపెడుతుంది.

    Tanishq Reddy Interview: Darpanam would scared off audience

    ఈ సినిమాలో హైలెట్స్‌ ఏంటి?
    - ఈ సినిమాలో సెల్లార్‌లో ఒక యాక్షన్‌ ఎపిసోడ్‌ ఉంటుంది. అది ఆడియన్స్‌కి తప్పకుండా నచ్చుతుంది. అలాగే ప్రీ క్లైమాక్స్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సతీష్‌ ముత్యాల గారి కెమెరా సినిమాకు అదనపు ఆకర్షణ. అలాగే ఈ సినిమాలో ఇంట్రడక్షన్‌ సాంగ్‌ హైలెట్‌గా ఉంటుంది.

    దర్శకుడు రామకృష్ణ గురించి?
    - రామకృష్ణ చాలా యంగ్‌ డైరెక్టర్‌. తను ఇంజనీరింగ్‌ పూర్తి అవగానే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమా మెత్తం చాలా బాగా క్యారీ చేశాడు. అలాగే విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో కూడా రాజి పడకుండా బెస్ట్‌ అవుట్‌ ఫుట్‌ వచ్చే వరకు కష్టపడ్డాడు.

    టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి?
    - ఈ సినిమా మర్డర్‌ మిస్టరీకి సంభందించిన క్లూ అద్దంలోనే కనిపిస్తుంది. దాంతో సినిమాకు 'దర్పణం' అనే టైటిల్‌ ఫిక్స్‌ చేయడం జరిగింది. గతంలో నేను కూడా చాలా హారర్‌ మూవీస్‌ చూశాను. అయితే ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు కూడా చాలా భయం వేసింది. అక్కడక్కడా ఎంటర్టైన్మెంట్‌ ఉంటూనే ఒక పూర్తి స్థాయి హర్రర్‌ చిత్రం.

    షూటింగ్‌ ఎక్కడ చేశారు?
    - వైజాగ్‌ బీచ్‌, అరకు, రోడ్‌ నెంబర్‌ 45లో ఒక బంగ్లాలో ఎక్కువభాగం షూటింగ్‌ చేశాం. తక్కువ బడ్జెట్‌ లోనే మంచి టెక్నీషియన్స్‌ ఉంటే సినిమా ఎంత బాగా తీయొచ్చు అనడానికి మా సినిమా ఒక ఉదాహరణ.

    మిగతా క్యారెక్టర్స్‌ గురించి?
    - ఈ సినిమాలో 'అబి' అనే నెగటివ్‌ క్యారెక్టర్‌ చాలా బాగుంటుంది. అలాగే అలెక్సిస్‌, శుభంగి పంత్‌ హీరోయిన్లుగా బాగా నటించారు. వారి క్యారెక్టర్‌ కూడా అందర్నీ ఆకట్టుకుంటాయి.

    నెక్స్ట్‌ ప్రాజెక్స్ట్‌?
    - క్రైమ్‌ నేపథ్యంలో మరో మూవీ చేస్తున్నాను, అలాగే ఒక లవ్‌ స్టోరీ, ఒక సస్పెన్స్‌ థిల్లర్‌ చేస్తున్నాను. మూడు కూడా మంచి కంటెంట్‌ ఉన్న కథలే... డిసెంబర్‌ నుండి షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

    English summary
    Tanishq Reddy, Alexius is playing a pair in the upcoming Telugu movie titled as Darpanam. Ramakrishna Vempa is the director of the movie and the film is being produced under Srinanda Arts banner. Kranthi Kiran Vellanki is producing the film which is a crime thriller. The movie is set release on September 6th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X