Puneeth RajKumar నటించిన మరో సినిమా రెడీ.. వెండితెరపై దేవుడి పాత్రలో..

కేవలం ఒక సినిమా హీరో గానే కాకుండా మంచి మనసున్న మనిషిగా ఎంతగానో గుర్తింపు అందుకున్న పునీత్ రాజ్ కుమార్ ఈ లోకాన్ని విడిచిపెట్టి నెలలు గడుస్తున్నా కూడా ఆయన అభిమానులు ఏమాత్రం మర్చిపోలేకపోతున్నారు. ఒక విధంగా ఆయన ఎనలేని చిత్రాలతో అభిమానుల గుండెల్లో అలానే ఉన్నారని చెప్పవచ్చు. ఇంకా కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్ సమాధిని చూసేందుకు ఎంతో మంది అభిమానులు వస్తూనే ఉన్నారు.

అయితే పునీత్ రాజ్ కుమార్ కు సంబంధించిన ఆఖరి సినిమా జేమ్స్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే పునీత్ రాజ్ కుమార్ మరణించిన తర్వాత ఆయన నుండి నటించిన మరొక సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. హీరోగా డార్లింగ్‌ కృష్ణ, హీరోయిన్‌ గా రోషనీ ప్రకాశ్‌ నటించిన.. లక్కీ మ్యాన్ సినిమాలో పునీత్ ఒక దేవుడి పాత్రలో నటించాడు. ఎప్పటి నుంచో ఈ సినిమాని విడుదల చేయాలని చూస్తున్నారు.

Puneeth RajKumar upcoming movie lucky man ready to theatrical release

ఇక సినిమాని డైరెక్టర్‌ నాగేంద్ర ప్రసాద్‌ తెరకెక్కించాడు. పునీత్ రాజ్ కుమార్ ఈ సినిమాకు డబ్బింగ్ కూడా పూర్తిచేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన మరణించినప్పుడు అప్పటికే జేమ్స్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ ఆ సినిమా డబ్బింగ్ పనులు పూర్తి కాకపోవడంతో పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పారు. ఇక ఇప్పుడు లక్కీ మ్యాన్ సినిమాకు మాత్రం పునీత్ సొంతంగానే డబ్బింగ్ చెప్పారట.

ఈ డబ్బింగ్ పనులు పూర్తయినా కొన్ని రోజులకే ఆయన మరణించారని తెలుస్తోంది. ఇక మొత్తానికి పునీత్ రాజ్ కుమార్ ను మరొకసారి వెండితెరపై చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమాలో పునీత్ ప్రభుదేవా తో కూడా ప్రత్యేకంగా ఒక డ్యాన్స్ కూడా చేసినట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. ఇక లక్కీమన్ సినిమా అయితే ఆగస్టులో భారీ స్థాయిలోనే విడుదలవుతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X