ఇంకొంచెం ఓపిక పట్టండి బ్రదర్.. అల్లు శిరీష్ ట్వీట్ వైరల్
మెగా ట్యాగ్ వేసుకుని వచ్చిన హీరోలందరిలో వెనుకబడిన హీరో అల్లు శిరీష్. సినీ కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచీ అదే డైలామా.. ఏ జానర్‌లో సినిమా తీయాలి.. ఎలాంటి ఫార్మాట్ కథలను ఎంచుకోవాలన్నదే ప్రశ్నార్థకంగా మారింది. రియలిస్టిక్‌గా ఉండాలని మొదటి ప్రయత్నంగా గౌరవం అనే సినిమాను చేస్తే అది బెడిసికొట్టింది. ఇక అప్పటి నుంచి సరైన హిట్టు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
శ్రీరస్తు శుభమస్తు, కొత్తజంట వంటి ఓ మోస్తరుగా పర్వాలేదనిపించిన చిత్రాలు అల్లు శిరీష్ కెరీర్‌లో ఉన్నాయి కానీ మెగా హీరో అనిపించుకునేట్టు ఒక్క హిట్టు పడలేదు. చివరగా వచ్చిన మలయాళ రీమేక్ ఏబీసీడీతో పలకరించాడు. అది కూడా నిరాశే మిగిల్చింది. ఇక మళ్లీ మరో అప్‌డేట్ ఇవ్వలేదు అల్లు వారబ్బాయి.

ఇదే విషయమై నెటిజన్లు అల్లు శిరీష్‌ను ప్రశ్నిస్తూ ఉన్నారు. మీ తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు చెప్పండని అడుగుతుండటంతో తాజాగా ఓ నెటిజన్‌కు రిప్లై ఇచ్చాడు. 'ఇంకొంచెం ఓపిక పట్టండి బ్రో.. అన్నీ సెట్ అయిపోయాయ్.. మార్చ్ నెలలో సెట్‌లోకి వెళ్లేందుకు నేనూ ఆత్రుతగా ఉన్నాను.. తర్వలోనే అన్ని విషయాలను వెల్లడిస్తాను.. మీ ఓపికకు ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











