X
ఏంజెల్

ఏంజెల్

Fantasy | 03 Nov 2017 | U/A | 132 Mins
Telugu

2.6 /5 Users

1 /5 Filmibeat

ఏంజెల్ స్టోరీ

ఏంజెల్ సినిమా సోషియోఫాంటసీ అండ్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ అన్వేష్, హెబ్బాపటేల్, సప్తగిరి, కబీర్ సింగ్, ప్రదీప్ రావత్, షియాజీ షిండే తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజమౌళి శిష్యుడు పలాని నిర్వహించారు మరియు శ్రీ సరస్వతి ఫిల్మ్ పతాకంఅపై నిర్మాత భువన్ సాగర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సెస్సరోలియో స్వరాలు సమకుర్చరు.  కథ నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం జరుపుతున్న తవ్వకాల్లో ఓ అరుదైన పురాతన విగ్రహం దొరుకుతుంది. ఇంటర్నేషనల్ మాఫియాతో కుమ్మక్కైన స్థానిక కాంట్రాక్టర్లు భారీ రేటుకు అమ్ముతారు. దానిని తరలించే బాధ్యతను నానీ (నాగ అన్వేష్), గిరి (సప్తగిరి)కి అప్పగిస్తారు. హైదరాబాద్‌కు తరలిస్తున్న సమయంలో ఆ విగ్రహం కాస్త దేవకన్య నక్షత్ర (హెబ్బా పటేల్)గా మారుతుంది. గంధర్వలోకం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చాననే విషయం నానీకి నక్షత్ర వివరిస్తుంది. కానీ నానీకి నమ్మకం కుదురదు. కానీ అలా వారి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలో విగ్రహాల అక్రమ రవాణా ముఠా విగ్రహం కోసం నానీ, గిరిలను నానా రకాలుగా హింస పెడుతుంటుంది. అయితే గోదావరి జిల్లాలో అచ్చు నందు అనే అమ్మాయి నక్షత్రను పోలీ ఉండటం కథలో ట్విస్ట్‌గా మారుతుంది. ఈ క్రమంలో విగ్రహాల అక్రమ రవాణా ముఠా విగ్రహం కోసం నానీ, గిరిలను నానా రకాలుగా హింస పెడుతుంటుంది. నందు, నక్షత్ర ఒకటేనా? దేవలోకం నుంచి మానవలోకానికి నక్షత్ర ఎందుకు వచ్చింది. నక్షత్ర ప్రేమను నానీ పెళ్లి పీటల వరకు తీసుకెళ్లాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఏంజెల్.
Read More

ఏంజెల్ కాస్ట్ & క్రూ

ఏంజెల్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం పలాని
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం భీమ్స్ సిసిరోలియో
నిర్మాత భువన్ సాగర్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఏంజెల్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
అమరావతిలో దొరికిన విగ్రహాన్ని హైదరాబాద్‌కు తరలిస్తుండగా అది దేవకన్యగా మారడంతో అసలు కథ మొదలవుతుంది. అయితే గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ కథ సామాన్య ప్రేక్షకుడిని కూడా కన్విన్స్ చేసే విధంగా ఆరంభం కాకపోవడం ప్రధానమైన లోపంగా మారింది. తొలి భాగంలోనే అనేక ట్విస్టులతో కథ చాలా చికాకుగా ఉంటుంది. నక్షత్రను పోలిన నందు ఉండటం అనే పాయింట్ వద్ద ఇంటర్వెల్ టైటిల్ పడుతుంది. ఇక రెండో భాగంలో నందు ఫ్యాష్‌బాక్ కథకు రైతుల అంశం జోడించినా ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా లేకపోవడం మరో మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక చివర్లో దెయ్యం, గొలుసు ఎపిసోడ్‌లు నాసిరకంగా ఉండటమే కాకుండా ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ఈ చిత్ర కథనంలో 80, 90 దశకాలలో వచ్చిన సినిమాల్లో కూడా కనిపించదు. ఏ సన్నివేశంలోనూ ఎక్కడా సహజత్వమే కనిపించదు. అంతా ఆర్టిఫిషియల్‌గానే ఉండి చికాకు పెడుతుంటాయి. వెరసి ఈ చిత్రం కనీస సినిమా ప్రమాణాలకు దగ్గరగా లేదనే అభిప్రాయం కలుగడం చాలా సహజమైన పాయింట్.

ఏంజెల్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

ఏంజెల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+