X
తెలుగు » సినిమాలు » గూఢచారి
గూఢచారి

గూఢచారి

Action | 03 Aug 2018 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

గూఢచారి స్టోరీ

గూఢచారి సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు అ డివి శేష్, శోభిత, ప్రకాష్ రాజు, సుప్రియ యర్లగడ్డ, వెన్నెల కిశోర్, అనీశ్ కురువిల్ల, మధు శాలిని, రవి ప్రకాష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శశికిరణ్ వహించారు మరియు నిర్మాతలు అభిషేక్ నామా, టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీ చరణ్ పాకాల అందించారు.    కథ అర్జున్ అలియాస్ గోపి (అడివి శేషు) దేశ భద్రతకు పాటుపడే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ (రా)లో చేరాలని కలలు కంటాడు. దేశం కోసం పనిచేస్తూ చనిపోయిన తన తండ్రి ఆశయాలను కొనసాగించాలనుకొంటాడు. తన గాడ్ ఫాదర్ సత్య (ప్రకాష్ రాజ్) సంరక్షణలో పెరుగుతున్న అర్జున్ దేశ భద్రతకు సంబంధించిన త్రినేత్ర అనే మిషన్‌లో చేరుతారు. అక్కడ పనిచేసే బృందం (అనీష్ కురివిల్లా, యార్లగడ్డ సుప్రియ (నదియా), వెన్నెల కిషోర్, మధుశాలిని (లీనారాజన్))తో కలిసి పనిచేస్తాడు. ఆ సమయంలోనే సైక్రియాటిస్ట్ (శోభిత ధూళిపాల)తో ప్రేమలో పడుతాడు. కానీ తన ప్రేయసి చేసిన కారణంగా తన అధికారి (అనీష్), మరో మంత్రిని తీవ్రవాదుల కాల్పుల్లో పోగొట్టుకొంటాడు. ఈ క్రమంలో అర్జున్‌పై దేశద్రోహ నేరం మోపబడుతుంది. తన టీమ్‌లోనే ఒకరు తీవ్రవాదులకు సమాచారం అందిస్తున్నారని తెలుసుకొంటాడు. ఈ నేపథ్యంలో తన తండ్రి రానా (జగపతిబాబు) చనిపోలేదని తెలుసుకొంటాడు. దేశద్రోహం కేసులో ఇరుక్కొన్న అర్జున్ ఎలా బయటపడ్డాడు? చనిపోయాడనుకొన్న తన తండ్రి ఎలా బతికాడు? తన తండ్రిని కలుసుకొన్న తర్వాత ఎదురైన సంఘటనలు ఏంటీ? త్రినేత్రలో పనిచేస్తూ ఉగ్రవాదులకు సమాచారం అందించేది ఎవరు? అర్జున్ మిషన్‌లో ప్రకాశ్ రాజ్ పాత్ర ఏంటి? యార్లగడ్డ సుప్రియ, మధు శాలిని పాత్రలేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే గూఢచారి సినిమా కథ.  
Read More

గూఢచారి కాస్ట్ & క్రూ

గూఢచారి సిబ్బంది సమాచారం

దర్శకత్వం శశికిరణ్ టిక్క
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్రీచరణ్ పాకాల
నిర్మాత అభిషేక్ నామా
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గూఢచారి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
గూఢచారి సినిమా తెలుగు తెరపై కొత్త జోనర్ అని చెప్పవచ్చు. విభిన్నమైన చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు తప్పక నచ్చుతుంది. దేశభక్తి, యాక్షన్ కలిపి చేసిన చిత్రమిది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు చేరువైతే కమర్షియల్‌గా సినిమా నిలబడుతుంది.

గూఢచారి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

గూఢచారి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+