For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గూగుల్‌ వెతికి షాక్ తిన్నా.. ఆ హీరోతో కాదు మరొకరితో.. రూమర్లతో విసుగు: శోభితా ధూళిపాళ

  |

  గూఢచారి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన శోభితా ధూళిపాళ బాలీవుడ్‌లో జెండా పాతేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వరుస ప్రాజెక్టులు, బడా హీరోలతో జతకడుతూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. తాను చేస్తున్న ప్రాజెక్టుల వివరాలు, తనపై వస్తున్న రూమర్లకు శోభిత క్లారిటీ ఇచ్చారు. శోభిత చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే...

  మేడ్ ఇన్ హెవెన్‌లో

  మేడ్ ఇన్ హెవెన్‌లో

  ఇటీవల నేను చేస్తున్న సినిమాలు, పోషించిన పాత్రలు ప్రేక్షకులకు చేరాయనే విషయం చాలా సంతోషంగా ఉంది. నిజాయితీగా చేసిన పాత్రలు, హార్డ్ వర్క్ నాకు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. ఇటీవల నేను నటించిన వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్‌కు మంచిగా ప్రజాదరణ పొందింది.

  ఆ పాత్ర దొరకడం అదృష్టం

  ఆ పాత్ర దొరకడం అదృష్టం

  మేడ్ ఇన్ హెవెన్‌ ఆఫర్ వచ్చినప్పుడు పూర్తిగా స్క్రిప్టు చదివాను. ఆ పాత్రలోని ఎమోషన్స్ నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. మానవ అవసరాలతో ముడిపడిన అంశాలు నన్ను బాగా ఆకట్టుకొన్నాయి. ప్రతీ ఒక్కరిలో నిరాశ, నిస్పృహ, జెలసీ, భావోద్వేగం లాంటివి ఉంటాయి. అలాంటి అంశాలు కలిసి ఉన్న పాత్ర నాకు రావడం ఆనందంగా ఉంది.

  తొలిసారి యాక్షన్ తరహా సిరీస్‌లో

  తొలిసారి యాక్షన్ తరహా సిరీస్‌లో

  ప్రస్తుతం బార్డ్ ఆఫ్ బ్లడ్ అనే వెబ్ సిరీస్‌లో నటించబోతున్నాను. దీని కోసం నా కెరీర్‌లో తొలిసారి నేను యాక్షన్ పార్ట్‌లో భాగమయ్యాను. ఫైట్స్, ఎమోషన్స్ ఉన్న పాత్రల మధ్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. మరిన్నీ మంచి చిత్రాల్లో నటించేందుకు వేచి చూస్తున్నాను.

  కాంచన రీమేక్‌లో నటిస్తున్నట్టుగా

  కాంచన రీమేక్‌లో నటిస్తున్నట్టుగా

  కాంచన రీమేక్ లక్ష్మీలో నటిస్తున్నట్టు వస్తున్న వార్తలో వాస్తవం లేదు. ఉన్నట్టుండి మీడియాలో ఈ వార్త ప్రముఖంగా కనిపించింది. ఎవరో చెబితే నమ్మలేక నేను గూగుల్‌లో వెతికితే చాలా రూమర్లు కనిపించాయి. అలాగే తానాజీ: ది అనసంగ్ వారియర్ అనే చిత్రంలో నటిస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవన్నీ రూమర్లే అని శోభిత వెల్లడించింది.

   అక్షయ్‌ కుమార్‌తో సినిమా చేస్తున్నట్టు

  అక్షయ్‌ కుమార్‌తో సినిమా చేస్తున్నట్టు

  కాంచన రీమేక్‌లో అక్షయ్ కుమార్ సరసన నటిస్తున్నందుకు కంగ్రాట్స్ అంటూ మెసేజ్‌లు వెల్లువెత్తాయి. దాంతో నేను కంగారుపడ్డాను. నాకు తెలియకుండా నేను కాంచనలో నటించడమేమిటీ అనుకొన్నాను అని శోభిత వెల్లడించారు. లారెన్స్ రాఘవ దర్శకత్వం వచ్చిన కాంచన ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ అవుతున్నది. ఈ చిత్రంలో అక్షయ్ సరసన కైరా అద్వానీ నటిస్తున్నది.

   ఇమ్రాన్ హష్మీ, రణ్‌బీర్ కపూర్‌తో జంటగా

  ఇమ్రాన్ హష్మీ, రణ్‌బీర్ కపూర్‌తో జంటగా

  ఇటీవల తెలుగులో వచ్చిన గూఢచారి చిత్రం హీరోయిన్‌గా, గ్లామర్ తారగా మంచి పేరు తెచ్చిపెట్టింది. బాలీవుడ్‌లో రామన్ రాఘవ, కాలాకండీ, చెఫ్ చిత్రాల్లో ఆమె నటించారు. ది బాడీ అనే చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్‌లో జరుగుతున్నది. టాలీవుడ్‌లో కొన్ని ఆఫర్లు చర్చలో దశలో ఉన్నట్టు శోభిత పంచుకొన్నారు.

  English summary
  Actress Sobhita Dhulipala given clarity on rumours which are coming in media. They wrote back saying it’s for the Kanchana remake that I was doing. So, I sent one more question mark back and googled myself. A similar thing had happened with Tanhaji: The Unsung Warrior as well. I’m not doing Kanchana, but I’m quite amused with these rumours.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X