నా కెరీర్ అలా నాశనమైంది.. అందుకే ఇండస్ట్రీకి దూరం.. యువ హీరోయిన్ ఆవేదన
తెలుగు హీరోయిన్ మధు షాలినీ టాలీవుడ్ లో చాలా కాలంగా యాక్టివ్ గా ఉంటోంది. హీరోయిన్ గా అలరించడమే కాకుండా స్పెషల్ అప్పియరెన్స్ తోనూ ఆకట్టుకుంది. 2006 నుంచి ఈమె చిత్ర పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తోంది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ ప్రాజెక్ట్స్ లలోనూ నటిస్తూ ఆకట్టుకుంటూ వచ్చింది. ఇక తాజాగా మరో బ్యూటీఫుల్ ఫిల్మ్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కన్యా కుమారి అనే రొమాంటిక్ ఫిల్మ్స్ తో రాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో సందడి చేసింది.
కన్యా కుమారి చిత్రం ప్రమోషన్స్ లో నటి మధు షాలినీ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరోనా కంటే ముందు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించిన మధు షాలినీ ఆ తర్వాత జోరు తగ్గించింది. తెలుగులో కొన్ని గుర్తుండిపోయే చిత్రాల్లో నటించిన ఆమె అసలు ఎందుకు టాలీవుడ్ కు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చిందనేది సందేహంగా మారింది. ఇక ప్రశ్నలకు తాజాగా కన్యా కుమారి చిత్రం ప్రెస్ మీట్ లో సమాధానాలు అందించింది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో హీరోయిన్ మధు షాలినీ మాట్లాడుతూ..

'నన్ను చాలా మంది అడుగుతూ ఉన్నారు. అస్సలు ఎందుకు గ్యాప్ వచ్చింది అని. అయితే నేను కొన్ని విషయాల్లో చాలా కచ్చితంగా, స్పష్టంగా ఉంటాను. ఇక చిన్నప్పుడు ఏది పడితే అది చేసి చేతులు కాల్చున్న సందర్భాలున్నాయి. ఆ అనుభవంతో కెరీర్ లో ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడం మానుకొని సెలెక్ట్ గా సినిమాలు చేస్తూ వచ్చాను. ఇక తెలుగులో నా చివరి థియేట్రికల్ ఫిల్మ్ గూఢాచారి. ఈ చిత్రం తర్వాత ఇక వెబ్ సిరీస్ ల్లో ఎక్కువగా నటించాను. క్రిష్ దర్శకత్వం వహించిన 9 అవర్స్, ఆ తర్వాత హిందీలో ఎక్స్‌పైరీ డేట్ అనే సిరీస్ ల్లో నటించారు.
ఇక తమిళంలో దర్శకుడు బాల ప్రొడ్యూస్ చేసిన విచిత్రన్ అనే చిత్రం లోనూ నటించాను. ఇది మలయాళం మూవీకి రీమేక్ గా వచ్చింది. అలాగే రేంజర్ అనే చిత్రంలోనూ రీసెంట్ గానే నటించాను. ఇలా తెలుగు లో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తూనే ఉన్నాను. కానీ తెలుగులో గూఢచారి చివరి చిత్రం. అయితే తెలుగులోనూ మున్ముందు సినిమాలు వస్తాయి. త్వరలోనే నేను డైరెక్ట్ చేసి నిర్మిస్తున్న చిత్రం కూడా రాబోతుండటం విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మున్ముందు అప్డేట్స్ అందిస్తాను.' అని చెప్పుకొచ్చింది.
ఇక మధు షాలినీ తెలుగులో అందరివాడు, నా ప్రాణం కంటే ఎక్కువ, నాయకుడు, ఒక విచిత్రం, స్టేట్ రౌడీ, జగడం, కింగ్, అనుక్షణం, గోపాల గోపాల వంటి చిత్రాల్లో నటించి అలరించింది. ఇక 2018లో టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన గూఢచారితో బ్లాక్ బాస్టర్ అందుకుంది. ఆ తర్వాత వెండితెరపై కనిపించలేదు. నెక్ట్స్ ఎలాంటి ప్రాజెక్ట్ తో అలరించ బోతుందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











