X
ఖాకి

ఖాకి

Action | Romance | 17 Nov 2017 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

ఖాకి స్టోరీ

ఖాకి సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కార్తీక్ శివకుమార్, రకుల్ ప్రీత్ సింగ్, అభిమన్యు సింగ్, బోస్ వెంకట్, స్కార్లెట్ మెల్లిష్ విల్సన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వినోద్ హెచ్ వహించారు మరియు నిర్మాతలు ప్రభు ఎస్ ఆర్, ప్రకాష్ బాబు ఎస్ ఆర్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం జిబ్రాన్ అందించారు.  కథ ధీరజ్ (కార్తీ) నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. నిక్కచ్చిగా డ్యూటీ చేయడం మూలంగా ట్రాన్సఫర్లతో జీవితం ముందుకెళ్తుంటుంది. ఆ క్రమంలో తమిళనాడులో క్రూరమైన వరస దోపిడిలు పోలీస్ శాఖకు సవాల్‌గా నిలుస్తాయి. దోపిడిలకు పాల్పడుతున్నది అంతర్రాష్ట దొంగల ముఠా అని తన ఇన్వెస్టిగేషన్‌లో ధీరజ్ తెలుసుకొంటాడు. దోపిడి దొంగల దాడి కారణంగా తన భార్య (రకుల్)ను కోల్పోతాడు. అంతర్రాష్ట దొంగల ముఠా ఆటను ఎలా కట్టించాడు. ఆ క్రమంలో ఎలాంటి సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? రకుల్ ఏ కారణంగా ప్రాణాలు కోల్పోయింది? కీలకమైన కేసును ఛేదించిన ధీరజ్‌కు పై అధికారుల నుంచి ఎలాంటి పరిస్థితి ఎదురైంది అనే ప్రశ్నలకు సమాధానమే ఖాకి.
Read More

ఖాకి కాస్ట్ & క్రూ

ఖాకి సిబ్బంది సమాచారం

దర్శకత్వం వినోద్ హెచ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గిబ్రాన్
నిర్మాత ప్రభు ఎస్ ఆర్, ప్రకాష్ బాబు ఎస్ ఆర్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఖాకి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
దండుపాళ్యం లాంటి దోపిడి, నేర చరిత కథలు టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. అలాంటి కథకు ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథను జోడించి యాక్షన్ చిత్రంగా మలిచారు. దానికి తోడు కుటుంబం, భార్య లాంటి అంశాలతో సెంటిమెంట్‌ను దట్టించారు. మరుగునపడిన కీలకమైన కేసును బయటకు లాగి ఛేదించిన తీరు తెరపైన ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కార్తీ యాక్టింగ్, భావోద్వేగాలు కథను రక్తి కట్టించాయి. పక్కా కథ, స్క్రీన్ ప్లే దానికి తోడు కావడంతో రెండున్నర గంటలపాటు తెరపైన థ్రిల్లింగ్ సాగుతుంది. కథను ముందుకు నడిపించిన తీరు దర్శకుడి హెచ్ వినోద్ ప్రతిభకు అద్దం పట్టింది. క్రైమ్, థ్రిల్లర్, యాక్షన్, సెంటిమెంట్ అంశాలను ఆస్వాదించే ప్రేక్షకులకు ఈ సినిమా ఓ కేరాఫ్ అడ్రస్. కాకపోతే సినిమా నిడివి, వినోదం లేకపోవడం ప్రేక్షకుడిని కొంత ఇబ్బందిని గురిచేసే అంశం.

ఖాకి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఖాకి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+