For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రకుల్ షాకిచ్చింది.. అలా ఆరు నెలలంటే కష్టం.. కార్తి (ఇంటర్వ్యూ)

  By Rajababu
  |

  హీరో కార్తి అంటే అటు తమిళంలోనూ, తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ప్రేక్షకులను మెప్పించడానికి కార్తి చేసే ప్రయోగాలు చేస్తే తెర మీద అద్భుతంగా అనిపిస్తాయి. అందుకే రెండు భాషల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. తెలుగులో నేరుగా చేసిన ఊపిరి చిత్రం ద్వారా కార్తి మంచి పేరును సంపాదించాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం ఖాకి. ఈ చిత్రంలో కార్తి సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 17న రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. కార్తి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

  హాట్ హాట్‌గా రకుల్ రెచ్చిపోయిందిగా
  క్రైమ్ గురించి పట్టించుకోం..

  క్రైమ్ గురించి పట్టించుకోం..

  ఏదైనా నేరం జరిగితే దాని గురించి చదువుతాం గానీ, వాటి వెనుక ఉన్న కారణం గురించి గానీ, ఆ నేరం చేయడానికి చోటుచేసుకొన్న పరిస్థితులను గానీ బేరీజు వేయ్యం. అసలు పట్టించుకోం. ఓ క్రైమ్ వెనుక ఉన్న కథనే ఖాకి సినిమా. ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశాం

  పోలీసులు 20 గంటలు

  పోలీసులు 20 గంటలు

  సాధారణంగా ఏ ఉద్యోగి అయినా 8 గంటలు లేదా 10 గంటలు పనిచేస్తారు. కానీ పోలీసులు మాత్రం 22 గంటలు పనిచేస్తారు. వారికి వచ్చే జీతంలో కుటుంబాన్ని పోషించడం కూడా కష్టసాధ్యం. అవినీతి చేసే పోలీసుల గురించి చెప్పుకొంటాం కానీ.. రోడ్ల మీద దుమ్ము, ధూళిలో, జీపుల్లో కూర్చొని ఎక్కువ సేపు పనిచేసే వారి గురించి కనీసం ఆలోచించం. పోలీసుల పట్ల మన మైండ్ సెట్ మారాలి.

  బాధ్యాయుతమైన పోలీస్‌గా

  బాధ్యాయుతమైన పోలీస్‌గా

  ఖాకి చిత్రంలో ఓ సిన్సియర్ పోలీసు ఉద్యోగి కథను తెరకెక్కించాం. బాధ్యయుతా పోలీసుల ఎలా వ్యవహరిస్తాడు. అతని కుటుంబం అనుభవించే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఈ చిత్రంలో ఓ కోణం. రకుల్ ప్రీత్ సింగ్ నాకు భార్యగా నటించింది.

  ఖాకి కథ ఏమిటంటే..

  ఖాకి కథ ఏమిటంటే..

  విక్రమార్కుడు చిత్రాన్ని తమిళంలో చేసేటప్పుడు ఖాకి సినిమా కథ గురించి విన్నాను. 1995లో జరిగిన ఓ క్రైమ్‌లో నేరస్థులను పట్టుకోవడానికి 2005 వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఇది వాస్తవ కథ. నేరస్తులను పట్టుకోవడం అనే కథ కాబట్టి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలో షూట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత దర్శకుడు వినోద్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు నాకు స్టోరి తెలుసు అని చెప్పాను.

  ఖాకి సినిమాటిక్‌గానే

  ఖాకి సినిమాటిక్‌గానే

  ఖాకి సినిమా సినిమాటిక్ స్టయిల్లోనే ఉంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి డ్రామాను జోప్పించాం. కొంత లవ్ స్టోరి ఉంటుంది. పాటలను పాటల కోసం జొప్పించామనే ఫీలింగ్ ఉండదు. కథాపరంగా పాటలు వస్తుంటాయి.

  అది ట్రైలర్ షాట్ అని చెప్పాడు..

  అది ట్రైలర్ షాట్ అని చెప్పాడు..

  ఇసుకలో దూరిన సీన్ ఖాకి సినిమాలో ఓ ఇంట్రస్టింగ్ పాయింట్. రాజస్థాన్‌లో షూట్ చేయడానికి వెళ్లినప్పుడు తొలిరోజునే ఈ సీన్ షూట్ చేశారు. ఈ సీన్ షూట్ చేస్తున్నప్పుడే ఇది ట్రైలర్ షాట్ అని చెప్పారు. మిలిటరీ ఆఫీసర్స్ ఆరు నెలలు బంకుల్లోనే ఉంటారు అని రకుల్ చెప్పింది. ఈ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు రకుల్ నాకు చెప్పిన విషయాలు నాకు షాక్‌కు గురిచేశాయి.

  ఐదేళ్ల తర్వాత పోలీసు పాత్ర

  ఐదేళ్ల తర్వాత పోలీసు పాత్ర

  పోలీసు పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ అనే మాట సరికాదు. అన్నయ్య సింగం సిరీస్‌ చేశాడు. నేను ఐదేళ్ల తర్వాత నేను మళ్లీ పోలీస్ పాత్రను ధరిస్తున్నాను. పోలీస్ పాత్ర, పోలీసులు అంటే గర్వం. చిన్నప్పుడు మనం పొలీసులను చూస్తే వారే హీరోలుగా కనిపిస్తారు.

  దంగల్ అందుకు ఉదాహరణ

  దంగల్ అందుకు ఉదాహరణ

  మంచి సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది అని చెప్పడానికి దంగల్ ఓ ఉదాహరణ. అందుకే నేను విభిన్నమైన చిత్రాల్లో నటించడానికి ప్రయత్నిస్తుంటాను. తమిళ, తెలుగు సినిమాలను దృష్టిలో పెట్టుకొని నటిస్తాను అని అనడం సరికాదు.

  ఊపిరి తర్వాత ఓ సినిమాకు..

  ఊపిరి తర్వాత ఓ సినిమాకు..

  ఊపిరి చిత్రం తర్వాత నాకు తెలుగులో సోలో హీరోగా సినిమా చేయడానికి అవకాశం వచ్చింది. నేను ఒప్పుకొన్నాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. ప్రతీ ఒక్కరు ద్విభాషా చిత్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. మంచి రైటర్ దొరికితే అది సాధ్యమవుతుంది.

  English summary
  Tamil hero Karthi is versatile actor. He get a lot of applause from the audience doing a many good pictures. Now Karthi coming with Khakee movie. Rakul Preet Singh is the herione for the movie. This movie set to release on November 17th. In this occassion, Karthi speaks to Telugu Filmibeat exclusively.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X