For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జీవితం నాశనం అవుతున్నది.. అలాంటి వారి చేతులు నరకాలి.. రకుల్ ప్రీత్ సింగ్

  By Rajababu
  |

  దక్షిణాది చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. చైతూ, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి యువ హీరోలతోపాటు మహేశ్‌‌బాబు సూపరస్టార్లతో నటించి మెప్పిస్తున్నది. తాజాగా కార్తితో కలిసి రకుల్ ఖాకి చిత్రంలో నటించింది. ఈ చిత్రం విజయం వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో రకుల్ ప్రీత్ మీడియాతో మాట్లాడారు. రకుల్ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

  ఖాకికి సక్సెస్ టాక్

  ఖాకికి సక్సెస్ టాక్

  కార్తితో నటించిన ఖాకి చిత్రం రిలీజైంది. మంచి రెస్పాన్స్ వస్తున్నది. తెలుగు, తమిళంలో విశేష స్పందన లభిస్తున్నది. ప్రధానంగా చెన్నైలో మంచి కలెక్షన్లు కూడా ఉన్నాయని తెలిసింది. కమర్షియల్ అంశాలు, పాటలు లేకుండా ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించడం శుభపరిణామం. మంచి కంటెంట్ ఉంటే హిట్ అవుతుందని ఈ చిత్రం నిరూపించింది.

  చాలా సంతోషంగా ఉంది..

  చాలా సంతోషంగా ఉంది..

  1995 నుంచి 2005 వరకు జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన ఖాకీ చిత్రాన్ని రూపొందించారు. అలాంటి చిత్రాన్ని ఆదరించడం బట్టి చూస్తే ప్రేక్షకుల అభిరుచి మారుతున్నదని అనిపిస్తున్నది. ఓవరాల్‌గా ఖాకీ చిత్రం సక్సెస్ కావడం చాలా సంతోషం కలుగుతున్నది.

  ఆకట్టుకునేలా కార్తీతో సీన్స్

  ఆకట్టుకునేలా కార్తీతో సీన్స్

  ఇప్పటివరకు గ్లామర్ రోల్స్‌లో కనిపించిన నేను తొలిసారి గృహిణిగా నటించాను. భార్యభర్తల మధ్య ఉంటే చిన్న చిన్న ఫీలింగ్స్ ఉండే సన్నివేశాల్లో నటించేటప్పుడు సరదాగా అనిపించింది. మధ్య తరగతిలో దాంపత్యంలో జరిగే సంఘటనలు తెరమీద కార్తీతో కలిసి సీన్స్ ఆకట్టుకొనేలా ఉంటాయి.

  అనుభవం వల్లనే గృహిణిగా

  అనుభవం వల్లనే గృహిణిగా

  నటిగా పరిణితి చెందిన క్రమంలోనే నేను గృహిణిగా చక్కగా నటించాను. భాషపై పట్టు సాధించిన తర్వాత నటన ప్రదర్శించడానికి మరింత ఆస్కారం ఏర్పడుతున్నది. చాలా సన్నివేశాల్లో కార్తీతో కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. అందుకు ప్రేక్షకుల స్పందనే ప్రధాన కారణం.

  బంకర్లలో తలదాచుకొన్నాను

  బంకర్లలో తలదాచుకొన్నాను

  ఖాకీ చిత్రంలో నటించిన తర్వాత పోలీసులపై మరింత గౌరవం పెరిగింది. నేను స్వతహాగా ఆర్మీ కుటుంబం నుంచి వచ్చాను. సినిమాల్లో యాక్షన్, కట్ ఉంటుంది. కానీ ఆర్మీ, పోలీసుల జీవితాల్లో అది ఉండదు. నేను సరిహద్దులో సైన్యం సేవల్ని ప్రత్యక్షంగా చూశాను. సైన్యం స్థావరాల్లో ఉండే బంకర్లలో నాలుగైదు రోజులు ఉన్న అనుభవం ఉంది. నిజంగా టెర్రరిస్టులను చూశాను. నాకు ఎలాంటి భయం ఉండదు.

  ఆర్మీ సేవలు విలువైనవి

  ఆర్మీ సేవలు విలువైనవి

  థియేటర్లలో జాతీయ గీతాన్ని ఆలపించడానికే చాలా ఇబ్బంది పడుతారు. కానీ సైన్యంలో ఆర్మీ అందించే సేవలు చాలా విలువైనది. ఆర్మీ అందిస్తున్న సేవల గురించి నాకు బాగా తెలుసు.

  కార్తీతో మరో సినిమా

  కార్తీతో మరో సినిమా

  కార్తీతో ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నాను. వచ్చే ఏడాది ఆ సినిమా ప్రారంభమవుతుంది. మహేశ్ బాబు, సూర్య సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి. వాటిపై క్లారిటీ వచ్చిన తర్వాత మాట్లాడటం బాగుంటుంది.

  సౌదీలో మాదిరిగా శిక్షించాలి

  సౌదీలో మాదిరిగా శిక్షించాలి

  లైంగిక దాడులు, వేధింపులను ఎవరూ సమర్థించకూడదు. కొందరు దుష్టుల వల్ల కొందరి జీవితాలు నాశనం అవుతున్నాయి. అలాంటి వారిని సౌదీలో లాగా చేతులు తెగ నరకాలి. పబ్లిక్‌గా శిక్షించాలి. అప్పడే సెక్సువల్ అబ్యూస్ ఆగుతుంది.

   నాకు అలాంటి అనుభవం

  నాకు అలాంటి అనుభవం

  సినిమాలో వేషాల కోసం పడక గదిలోకి రమ్మంటారనేది నేను ఇండస్ట్రీలోకి రాకముందే విన్నాను. కానీ దేవుడి దయవల్ల నాకు అలాంటి అనుభవం ఎదురుకాలేదు. కొందరికి అలాంటి ఎదురుకావొచ్చేమో. ఇండస్ట్రీలో నిలబడాలంటే కష్టపడి పనిచేయాలి. అంకితభావంతో కష్టపడాలి. అప్పుడే ఎవరైనా సక్సెస్ అవుతారు.

  బ్రేక్ తీసుకొంటాను..

  బ్రేక్ తీసుకొంటాను..

  చాలా తక్కువ కాలంలో ఎక్కువ చిత్రాలు చేశాను. ఇప్పుడు చిత్రాల సంఖ్య కంటే మంచి చిత్రాల్లో నటించాలని అనుకొంటున్నాను. అందుకే కొంచెం బ్రేక్ తీసుకోవాలని అనుకొంటున్నాను. మంచి కథ వస్తే ఎప్పుడు నటించడానికి సిద్ధంగా ఉంటాను.

  నయనతార అనుభవం లేదు

  నయనతార అనుభవం లేదు

  నయనతార మంచి ప్రతిభ ఉన్న నటి. ఆమెకు ఒక సినిమాను సొంతంగా భుజాల మీద మోసే టాలెంట్ ఉంది. అది అనుభవం వల్లే సాధ్యమవుతుంది. నయనతార మాదిరిగా నటించాలంటే నాకు ఇంకా కొంత సమయం పడుతుంది. నేను సినిమాల్లోకి వచ్చి నాలుగేళ్లే అవుతున్నది. నయనతార వచ్చి 10 ఏళ్లు అవుతున్నది. ఆరమ్ చిత్రం చాలా బాగుందని తెలిసింది. హైదరాబాద్‌లో రిలీజ్ కాలేదు. అయితే చూడాలని ఎదురు చూస్తున్నాను.

  English summary
  Rakul Preet Singh one of the leading actress in Tollywood. Rakul's second movie in Tamil 'Theeran Adhigaaram Ondru' has received a positive talk. So she elated Rakul Preet shared her happiness with the media. During her media interaction, when Rakul was asked whether she wishes to be the next Nayantara, she said it's not fair her compare with Nayantara.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X