For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మత్తెక్కిస్తున్న రకుల్ ప్రీత్.. పవర్ చూపిస్తున్న కార్తి..

  By Rajababu
  |

  యువ హీరో కార్తి, అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఖాకి సినిమా ఎలా ఉండ‌బోతోందా? అనే స‌ర్వ‌త్రా ఆస‌క్తి మొద‌లైంది. ఆ ఆస‌క్తిని ఖాకి ట్రైల‌ర్ ఉత్కంఠ‌గా మారుస్తోంది. ప్ర‌తి షాట్ నూ ప్రేక్ష‌కుడు ఊపిరి బిగ‌బ‌ట్టి చూసేలా తెర‌కెక్కించిన విష‌యం ట్రైల‌ర్‌ను చూస్తేనే అర్థ‌మ‌వుతోంది. స‌మాజానికి న్యాయం చేయాల‌నుకుంటున్న ఓ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ ఈ సినిమాలో ఉంటార‌ని అర్థ‌మ‌వుతోంది. త‌ను న‌మ్మిన దానికోసం ఎంత‌టివారినైనా ప్ర‌శ్నించే అత‌ని గుణం క‌నిపిస్తోంది.

  హాట్ హాట్‌గా రకుల్ రెచ్చిపోయిందిగా

  మిగిలిన అంద‌రు పోలీసుల్లాగే త‌న భ‌ర్త ఎందుకు ఉండ‌ట్లేద‌ని, ట్రాన్స్‌ఫ‌ర్ల‌తో విసిగిపోయిన నిజాయ‌తీగ‌ల పోలీస్ ఆఫీస‌ర్ భార్య స్వ‌రం వినిపిస్తోంది. అంద‌మైన జంట రొమాన్స్ క‌నిపిస్తోంది. అన్నిటికీ మించి ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ మిషన్ క‌నిపిస్తోంది.
  కార్తి, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టించిన చిత్రం ఖాకి. హెచ్‌. వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆదిత్యమ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తున్నారు. 17న విడుద‌ల కానున్న ఈ సినిమా ట్రైల‌ర్ జ‌న‌రంజ‌కంగా ఉంది.

  ఆకట్టుకుంటున్న కార్తీ, రకుల్

  ఆకట్టుకుంటున్న కార్తీ, రకుల్

  ఈ జనరేషన్లో తెలుగులో అభిమానుల సంఖ్యను గణనీయంగా ఏర్పరచుకున్న అతి కొద్ది మంది తమిళ హీరోల్లో కార్తి ఒకరు. మరోవైపు రకుల్ కి తెలుగులో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా `ఖాకి`. వీరిద్దరు కలిసి నటిస్తున్నారనే వార్త వెలువడినప్పటి నుంచి ఈ కాంబినేషన్ మీద ఆసక్తి మొదలైంది. ఆ మధ్య విడుదలైన టీజర్ను, ట్రైలర్ను చూసినప్పటి నుంచి సినిమా మీద కూడా అంఛనాలు మరింతగా పెరిగాయి. యంగ్ కపుల్ గా వీరిద్దరు తెరమీద చేయబోయే సందడిని చూడటానికి సినీ ప్రియులందరూ వేచి చూస్తున్నారు.

  కార్తి పోలీస్ పవర్

  కార్తి పోలీస్ పవర్

  తెలుగువారికి తొలిసారి కార్తి పోలీస్ యూనిఫార్మ్ లో కనిపించనున్నారు. వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిన సినిమా ఇది. భర్తే లోకంగా బతికే మధ్యతరగతి ఇల్లాలి పాత్రలో రకుల్ మెప్పించనున్నారు. ఇప్పటికే విడుదలైన స్టిల్స్ లో, అత్యుత్త‌మంగా తీర్చిదిద్దిన ట్రైల‌ర్‌లో వీరిద్దరి మధ్య పండిన కెమిస్ట్రీ కనిపిస్తూనే ఉంది. ‘చతురంగ వేట్టై` సినిమాకు దర్శకత్వం వహించిన హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది.

  పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో

  పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో

  ``ప‌వ‌ర్‌లో ఉన్నోడి ప్రాణానికి ఇచ్చే విలువ ప‌బ్లిక్ ప్రాణానికి ఎందుకు ఇవ్వ‌రు సార్‌?`, `మ‌నం చెడ్డ వాళ్ల నుండి మంచి వాళ్ల‌ని కాపాడే పోలీస్ ఉద్యోగం చేయ‌ట్లేదు సార్‌, మంచి వాళ్ల నుంచి చెడ్డ వాళ్ల‌ని కాపాడే చెంచా ఉద్యోగం చేస్తున్నాం` వంటి ప‌వ‌ర్‌ఫుల్ డైలాగులు వింటుంటే రోమాలు నిక్క‌బొడుచుకుంటున్నాయి. సినిమాను మార్నింగ్ షోలోనే చూసేయాల‌న్నంత ఊపు క‌లుగుతోంది. కార్తి, ర‌కుల్ మ‌ధ్య చూపించిన డైలాగులు, ఇంటిమ‌సీ షాట్‌లు ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని థియేట‌ర్ల వైపు క్యూ క‌ట్టిస్తాయ‌ని అన‌డంలో కించిత్తు అనుమానం కూడా లేదు.

  అలరిస్తున్న ఖాకి పాటలు

  అలరిస్తున్న ఖాకి పాటలు

  `ఖాకి` చిత్రంలో ఒక్కో పాటా ఒక్కో విధంగా అంద‌రినీ అల‌రిస్తోంది. సంగీత ప్రియులనే కాదు, పామ‌రుల‌ను సైతం మెప్పించే అన్ని ర‌కాల పాట‌లూ ఇందులో చేరాయి. `అడుగే పిడుగు అత‌డే గొడుగు..` అనే పాట విన‌గానే ఒక వ్య‌క్తి తాలూకు వ్య‌క్తిత్వాన్ని అత‌నిలోని క‌సిని, సామ‌ర్థ్యాన్ని చెప్ప‌క‌నే చెబుతుంది. దాని వెంట‌నే వినిపించే `క‌ల్ల‌బొల్లి పిల్ల‌నాతో క‌ళ్లు క‌లిపేనా..` పాట‌ను ఒక్క‌సార‌యినా పాడుకోని అబ్బాయి ఉండ‌డేమో. ప్రేమ‌తో ప‌రిచ‌యం ఉన్న ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సునూ త‌ట్టిలేపి పాడుకునేలా చేస్తుంది ఈ పాట‌. అందుకే ఇప్ప‌టికే చాలా మందికి ఫేవ‌రేట్ అయింది.

  కొత్త అనుభూతినిస్తున్న పాటలు

  కొత్త అనుభూతినిస్తున్న పాటలు

  `చిన్ని చిన్ని ఆశ‌లేవో రెక్క విప్పుకున్న‌వి` పాట‌ను వింటుంటే హాయిగా అనిపిస్తుంది. కొత్త అనుభూతికి లోనుచేసే పాట ఇది. మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపిస్తుంది. ఇక `తొలి వ‌య‌సే నీలో నాలో కౌగిళ్లై..` పాట విన్న వారందరూ ఫిదా అవుతున్నారు. స్త్రీ, పురుషుల అన్యోన్య‌త‌ను వ్య‌క్తం చేసే పాట ఇది.

  టింగ టింగ టింగ టింగ‌రా

  టింగ టింగ టింగ టింగ‌రా

  ఇక ఖాకీ ఆల్బ‌మ్‌లో కుర్ర‌కారుతో పాటు చిన్నా పెద్దా తేడా లేకుండా అంద‌రినీ చిందులేయించే పాట `టింగ టింగ టింగ టింగ‌రా...` వినేకొద్దీ వాల్యూమ్ మ‌రింత పెంచుకుని వినాల‌నిపిస్తుంది. ఇలా అన్ని ర‌కాల పాట‌ల‌తో స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబైంది `ఖాకి` ఆడియో జ్యూక్ బాక్స్. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌లైన `ఖాకి` పాట‌ల‌కు ఇప్ప‌టికే అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది.

  English summary
  Going by the theatrical trailer of 'Khakee', Karthi is playing a very powerful and sincere cop in the film. It is understandable when his loving wife (played by Rakul) asks him why he can’t be like every other cop, take bribes and lead a happy life, instead of being sincere and getting transferred often.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X