For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'భాయ్' దర్శకుడు నెక్స్ట్ ఖరారు

  By Srikanya
  |

  హైదరాబాద్ :'అహనా పెళ్లంట' చిత్రంతో దర్శకుడుగా కెరీర్ మొదలెట్టిన దర్శకుడు వీరభద్ర చౌదరి. ఆయన తర్వాత సునీల్ హీరోగా 'పూలరంగడు' వంటి సూపర్ హిట్ ని ఇచ్చారు. వెంటనే నాగార్జున తో 'భాయ్' తీసారు. అయితే దాని ఫలితం సరిగా రాలేదు. దాంతో గ్యాప్ తీసుకున్న వీరభధ్రం ఓ స్క్రిప్టు రాసుకుని యువ హీరో ఆదితో చేయటానికి ముందుకు వచ్చారు.

  కథ నచ్చిన అనీల్ సుంకర మరో సారి వీరభధ్రమ్ తో చిత్రం నిర్మించటానికి ముందుకు వచ్చారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం యాక్షన్ లవ్ స్టోరీ అని చెప్తున్నారు. ఎట్లాయినా హిట్ కొట్టి తిరిగి ఫామ్ లోకి రావాలని వీరభధ్రం ప్రయత్నిస్తున్నారు. అందుకు తగినట్లే స్క్రిప్టు బాగా వచ్చిందని, కథ విన్న వెంటనే ఆది ఓకే చెప్పాడని తెలుస్తోంది.

  హీరో ఆది సైతం ఈ చిత్రం కీలకంగా మారనుంది. వరస ఫ్లాఫుల్లో ఆది ఉండటంతో ఈ సినిమాపై హోప్స్ పెట్టుకున్నారు. తనకీ 'పూలరంగడు' తరహాలో హిట్ ఇస్తాడని భావిస్తున్నాడు. రీసెంట్ గా వివాహం చేసుకున్న ఆది...ఈ చిత్రం తో తను నిలబడాలని ఆశిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

  Veerabadram Chowdary Movie With Aadi

  హీరోగా తెరంగేట్రం చేసి, 'ప్రేమ కావాలి', 'లవ్‌లీ' విజయాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడు ఆది. ఇప్పుడు తన జీవితంలో మరో సరికొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతున్నాడు. ఇటీవల విడుదలైన గాలిపటం సినిమాతో సక్సెస్ కూడా చూశాడు. త్వరలోనే అతడు నటించిన రఫ్ సినిమా కూడా విడుదల అయ్యింది. మళ్లీ గరమ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఫైట్లు, డాన్సులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒరవడి సృష్టించుకున్నాడు ఆది.

  కొత్త చిత్రం గరమ్ గురించి... సినిమా గురించి ఆది తెలియజేస్తూ ''టైటిల్ చాలా హాట్‌గా ఉంది. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. సంభాషణలు కూడా చాలా బాగుంటాయి. శ్రీనివాస్ మంచి కథ ఇచ్చారు. ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అన్నారు.

  మదన్ మాట్లాడుతూ ...'నా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఈ కథ అందించారు. చాలా బాగుంది. నిర్మాతకు ఇది తొలి సినిమా అయినప్పటికీ ఫిలిం మేకింగ్ మీద చాలా క్లారిటీ ఉంది. సమస్యలను అలవోక గా అధిగమించి ముందుకు సాగే ఓ కుర్రాడి కథ ఇది. ప్రేమతో దేన్నయినా సాధించొచ్చన్నది ప్రధాన ఇతివృత్తం. వినోద ప్రధానంగా సాగే చిత్రం ఇది'' అని తెలిపారు.

  ఈ చిత్రానికి కథ, మాటలు - శ్రీనివాస్ గవిరెడ్డి, కెమెరా - సురేందర్ రెడ్డి.టి, సంగీతం - ఆగస్త్య, కళ - నాగేంద్ర, ఎడిటింగ్ - కార్తీక్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత - బి.నాగిరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: హరికృష్ణ జి., కో-డైరెక్టర్ - అనిల్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - మదన్.

  English summary
  Director Veerabadram Chowdary next will be with Hero Aadi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X