X
తెలుగు » సినిమాలు » మరకతమణి
మరకతమణి

మరకతమణి

Action | Thriller | 16 Jun 2017 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

మరకతమణి స్టోరీ

మరకతమణి సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆదిపినిశెట్టి, నిక్కిగర్లాని, కోటశ్రీనివాసరావు, బ్రహ్మనందం, ఆనంద్ రాజ్, అరుణ్ రాజ్, కామరాజ్, రామ్ దాస్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ ఆర్ కె శర్వనణ్ వహించారు మరియు నిర్మాతలు రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దిబు నైనర్ థామస్ అందించారు.  కథ అనంతపురంకు చెందిన రఘు నందన్(ఆది) అప్పులు తీర్చడం కోసం హైదరాబాద్ వచ్చి స్మగ్లింగ్‌ను వృత్తిగా ఎంచుకుంటాడు. వజ్రాలు, విలువైన రాళ్లు స్మగ్లింగ్ చేస్తుంటాడు. అయితే తన అప్పులు తీరడానికి ఇలాంటి చిన్న చిన్న డీల్స్ సరిపోవని, ఏదైనా పెద్దడీల్ వస్తే దాంతో అప్పులు మొత్తం తీర్చేసి లైఫ్ లో సెటిలవ్వాలనే ఆలోచనలో ఉంటాడు. చైనా నుండి చంగ్ అనే ఓ వ్యక్తి వచ్చి తనకు మరకతమణి కావాలని, అది తనకు అప్పగిస్తే రూ. 10 కోట్లు ఇస్తానని ఓ పెద్ద స్మగ్లర్‌ను ఆశ్రయిస్తాడు. అయితే పేరు మోసిన స్మగ్లర్లంతా ‘మరకతమణి' పేరు చెప్పగానే వణికి పోతారు. ఎన్ని కోట్లు ఇచ్చినా తాము ‘మరకతమణి' విషయంలో వేలు పెట్టబోమని తేల్చిచెతారు. మరకతమణి పేరు చెప్పగానే అందరూ భయపడటానికి కారణం.... ఆ మణి ముట్టుకున్న వారంతా చనిపోవడమే. అయితే ఇవన్నీ నమ్మని రఘు నందన్ 10 కోట్ల కోసం డీల్ ఒప్పుకుంటాడు. ఆ మణిని కనిపెడతాడు. అయితే ఆ మణి తన వద్దకు వచ్చిన తర్వాత అది ఎంత ప్రమాదకరమైనదో తెలుసుకుంటాడు. ప్రాణభయంతో అల్లాడి పోతాడు. మరి ఆ మణి వెనక ఉన్న కథేమిటి? ఆది తన ప్రాణాలు ఎలా కాపాడుకున్నాడు? అనేది తెరపై చూడాల్సిందే.
Read More

మరకతమణి కాస్ట్ & క్రూ

మరకతమణి సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎ ఆర్ కె శర్వనణ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దిబు నైనర్ థామస్
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మరకతమణి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
రఘు నందన్ పాత్రలో ఆది తన పాత్రకు న్యాయం చేశాడు. అయితే సినిమాలో తనను తాను నిరూపించుకునేంత అడ్వంచర్స్, థ్రిల్లింగ్ సీన్లు ఏమీ లేవు. హీరోయిన్ నిక్కి గల్‌రాణి ఏదో హీరోయిన్ ఉండాలి కాబట్టి తీసుకున్నట్లే ఉంది తప్ప..... ఆమెకు రెండు మూడు మినహా పెద్దగా సీన్లు అయితే పడలేదు. ఆ మధ్య ఐదు పాటలతో కూడిన ఆడియో విడుదల చేశారు. అయితే థియేటర్లో మాత్రం డ్యూయెట్ సాంగులు లేవు. పాటలను కట్ చేసి విడుదల చేసినట్లు తెలుస్తోంది. అసలు హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా పెద్దగా లేదు. అయితే నిక్కి గాల్ రాణి పాత్రకు మగ గొంతుతో ఉత్తేజ్ చెప్పిన డబ్బింగ్ మాత్రం కాస్త నవ్వు తెప్పిస్తుంది. మణి కోసం వెతికే ఓ సింపుల్ స్టోరీ ఎంచుకున్నపుడు కామెడీ ట్రాక్, సస్పెన్స్, థ్రిల్లింగ్ లాంటి అంశాలతో స్క్రీన్ ప్లే పక్కగా రాసుకోవాలి. అప్పుడే సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ప్రతి సీనూ ఇంట్రస్టుగా ఉంటుంది. అయితే ‘మరకతమణి' స్క్రీన్ ప్లే చాలా స్లోగా.... నీరసంగా సాగినట్లు ఉంది. అక్కడక్కడా కాస్త కామెడీ సీన్లు పడ్డాయి కాబట్టి ఫర్వాలేదు కానీ, లేకుంటే సినిమాను భరించడం చాలా కష్టమే. ఏ సినిమాకైనా క్లైమాక్స్ చాలా కీలకం. నిధి, మణి లాంటి కాన్సెప్పులు ఎంచుకున్నపుడు ప్రేక్షకలు ఉత్కంఠకు గురయ్యేలా క్లైమాక్స్ ఉంటే మరింత అదిరిపోయేది. అయితే ‘మరకతమణి' క్లైమాక్స్ ఏమంత పెద్దగా ఆకట్టుకోలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే.... ‘మరకతమణి' ఓ యావరేజ్ ఎంటర్టెనర్.

మరకతమణి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మరకతమణి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+