»   » మెరుపులులేని మణి.. (‘మరకతమణి’ రివ్యూ)

మెరుపులులేని మణి.. (‘మరకతమణి’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

హైదరాబాద్: ఆది పినిశెట్టి, నిక్కి గల్‌రాణి హీరో హీరోయిన్లుగా ఏఆర్‌కె శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన 'మరగద నానయమ్' అనే తమిళ చిత్రాన్ని తెలుగులో 'మరకతమణి' పేరుతో విడుదల చేశారు. విక్రమాధిత్యుడి కాలంనాటి ఒక మణి బ్యాక్ డ్రాప్‌తో తయారు చేసుకున్న కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో రిషి మీడియా, శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్ సంయుక్తంగా విడుదల చేశాయి.

ఇప్పటి వరకు ఆది పినిశెట్టి మనకు సీరియస్ పాత్రల్లోనే కనిపించారు. తొలిసారి కామెడీ కన్సెప్టుతో ఈ చిత్రంలో నటించారు. ఇదో కామెడీ అడ్వంచరస్ థ్రిల్లర్ మూవీ అంటూ ప్రచార కార్యక్రమాలు హోరెత్తించారు. మరి ఈ సినిమాలో అడ్వంచర్స్, థ్రిల్లింగ్ అంశాలు ఏ రేంజిలో ఉన్నాయి? ఏ మాత్రం కామెడీ ఉంది, అసలు ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో రివ్యూలో చూద్దాం.


కథ విషయానికొస్తే....

కథ విషయానికొస్తే....

అనంతపురంకు చెందిన రఘు నందన్(ఆది) అప్పులు తీర్చడం కోసం హైదరాబాద్ వచ్చి స్మగ్లింగ్‌ను వృత్తిగా ఎంచుకుంటాడు. వజ్రాలు, విలువైన రాళ్లు స్మగ్లింగ్ చేస్తుంటాడు. అయితే తన అప్పులు తీరడానికి ఇలాంటి చిన్న చిన్న డీల్స్ సరిపోవని, ఏదైనా పెద్దడీల్ వస్తే దాంతో అప్పులు మొత్తం తీర్చేసి లైఫ్ లో సెటిలవ్వాలనే ఆలోచనలో ఉంటాడు.


మరకతమణి

మరకతమణి

చైనా నుండి చంగ్ అనే ఓ వ్యక్తి వచ్చి తనకు మరకతమణి కావాలని, అది తనకు అప్పగిస్తే రూ. 10 కోట్లు ఇస్తానని ఓ పెద్ద స్మగ్లర్‌ను ఆశ్రయిస్తాడు. అయితే పేరు మోసిన స్మగ్లర్లంతా ‘మరకతమణి' పేరు చెప్పగానే వణికి పోతారు. ఎన్ని కోట్లు ఇచ్చినా తాము ‘మరకతమణి' విషయంలో వేలు పెట్టబోమని తేల్చిచెతారు.


మణి వెనక ప్రమాదం...

మణి వెనక ప్రమాదం...

మరకతమణి పేరు చెప్పగానే అందరూ భయపడటానికి కారణం.... ఆ మణి ముట్టుకున్న వారంతా చనిపోవడమే. అయితే ఇవన్నీ నమ్మని రఘు నందన్ 10 కోట్ల కోసం డీల్ ఒప్పుకుంటాడు. ఆ మణిని కనిపెడతాడు. అయితే ఆ మణి తన వద్దకు వచ్చిన తర్వాత అది ఎంత ప్రమాదకరమైనదో తెలుసుకుంటాడు. ప్రాణభయంతో అల్లాడి పోతాడు. మరి ఆ మణి వెనక ఉన్న కథేమిటి? ఆది తన ప్రాణాలు ఎలా కాపాడుకున్నాడు? అనేది తెరపై చూడాల్సిందే.


హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్....

హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్....

రఘు నందన్ పాత్రలో ఆది తన పాత్రకు న్యాయం చేశాడు. అయితే సినిమాలో తనను తాను నిరూపించుకునేంత అడ్వంచర్స్, థ్రిల్లింగ్ సీన్లు ఏమీ లేవు. హీరోయిన్ నిక్కి గల్‌రాణి ఏదో హీరోయిన్ ఉండాలి కాబట్టి తీసుకున్నట్లే ఉంది తప్ప..... ఆమెకు రెండు మూడు మినహా పెద్దగా సీన్లు అయితే పడలేదు. ఆ మధ్య ఐదు పాటలతో కూడిన ఆడియో విడుదల చేశారు. అయితే థియేటర్లో మాత్రం డ్యూయెట్ సాంగులు లేవు. పాటలను కట్ చేసి విడుదల చేసినట్లు తెలుస్తోంది. అసలు హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా పెద్దగా లేదు. అయితే నిక్కి గాల్ రాణి పాత్రకు మగ గొంతుతో ఉత్తేజ్ చెప్పిన డబ్బింగ్ మాత్రం కాస్త నవ్వు తెప్పిస్తుంది.


ఇతర ముఖ్యపాత్రల్లో

ఇతర ముఖ్యపాత్రల్లో

సినిమాలో ఆది తర్వాత ఆకట్టుకునే పాత్ర రామదాస్ పాత్ర. రామదాస్ ఆత్మ పాత్రలో తన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. పెదరాయుడు లాంటి చిత్రాల్లో సీరియస్ విలన్‌గా తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆనంద్ రాజ్ ఈ చిత్రంలో కామెడీ విలన్‌గా ఫర్వాలేదనిపించాడు. తెలుగులో విడుదల చేస్తున్నారు కాబట్టి బ్రహ్మానందంపై క్లైమాక్స్‌లో రెండు సీన్లు వేసినా అవి పెద్దగా పండలేదు. కోటా శ్రీనివాసరావు, డానియల్, అరుణ్ రాజ్‌, కామ‌రాజ్‌ మిగతా నటీనటులందరూ తమ తమ పాత్రల్లో ఓకే.


టెక్నికల్ అంశా పరంగా....

టెక్నికల్ అంశా పరంగా....

సంగీత దర్శకుడు దిబు నైన‌న్ థామ‌స్‌ బ్యాగ్రౌండ్ స్కోర్ యావరేజ్ గా ఉంది. పి.వి.శంక‌ర్‌ సినిమాటోగ్రాఫీ బాగుంది. ప్ర‌స‌న్న.జి.కె ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ద పెట్టాల్సింది. ఫస్టాఫ్ తో పాటు సెకండాఫ్ లో కూడా చాలా బోరింగ్ సీన్లు ఉన్నాయి. సినిమా నిర్మాణ విలువలు ఓకే.


అసలు ఇంతకీ సినిమా ఎలా ఉంది?

అసలు ఇంతకీ సినిమా ఎలా ఉంది?

మణి కోసం వెతికే ఓ సింపుల్ స్టోరీ ఎంచుకున్నపుడు కామెడీ ట్రాక్, సస్పెన్స్, థ్రిల్లింగ్ లాంటి అంశాలతో స్క్రీన్ ప్లే పక్కగా రాసుకోవాలి. అప్పుడే సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ప్రతి సీనూ ఇంట్రస్టుగా ఉంటుంది. అయితే ‘మరకతమణి' స్క్రీన్ ప్లే చాలా స్లోగా.... నీరసంగా సాగినట్లు ఉంది. అక్కడక్కడా కాస్త కామెడీ సీన్లు పడ్డాయి కాబట్టి ఫర్వాలేదు కానీ, లేకుంటే సినిమాను భరించడం చాలా కష్టమే.


ఆకట్టుకోని క్లైమాక్స్

ఆకట్టుకోని క్లైమాక్స్

ఏ సినిమాకైనా క్లైమాక్స్ చాలా కీలకం. నిధి, మణి లాంటి కాన్సెప్పులు ఎంచుకున్నపుడు ప్రేక్షకలు ఉత్కంఠకు గురయ్యేలా క్లైమాక్స్ ఉంటే మరింత అదిరిపోయేది. అయితే ‘మరకతమణి' క్లైమాక్స్ ఏమంత పెద్దగా ఆకట్టుకోలేదు.


ఫైనల్ వర్డ్...

ఫైనల్ వర్డ్...

ఫైనల్‌గా చెప్పాలంటే.... ‘మరకతమణి' ఓ యావరేజ్ ఎంటర్టెనర్.
English summary
Adi Pinisetty's most awaited film 'Marakathamani' has finally hit screens on June 16. The film has Kota Srinivasa Rao, Anand Raj, Brahmanandam in pivotal roles. Nikki Galrani plays the female lead in the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu