»   » పవన్ కల్యాణ్ పేరులోనే పవర్ ఉంది.. పవర్‌స్టార్‌పై మనసుపడేసుకొన్న కుర్ర హీరోయిన్

పవన్ కల్యాణ్ పేరులోనే పవర్ ఉంది.. పవర్‌స్టార్‌పై మనసుపడేసుకొన్న కుర్ర హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ ప్రేక్షకులకే కాదు.. వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు వచ్చే కుర్ర హీరోయిన్లకు కూడా పవన్ కల్యాణ్ అంటే చెప్పలేనంత ఇష్టమనేది కాదనలేని వాస్తవం. పవర్ స్టార్‌తో నటిస్తే కెరీర్ అమాంతం లేచిపోతుందని యువ తారలు కలలు కంటారు. కెరీర్ పరంగా ఎదుగడానికి దోహదపడే అంశం గురించి ఆలోచించడంలో తప్పేమీ లేదు. అలాంటి ఆలోచననే యువ హీరోయిన్ నిక్కీ గల్రానీ చేస్తున్నది. మరకతమణి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సినీ నటి సంజన సోదరి పవన్‌తో నటించడానికి ఆశపడుతున్నది. మరకతమణి సినిమాను రిలీజ్‌ను పురస్కరించుకొని నిక్కీ ఇటీవల ఫేస్‌బుక్‌లో అభిమానులతో చాటింగ్ చేసింది. ఆమె ఏమన్నారో ఓసారి లుక్కేద్దాం..

ప్రభాస్, మహేశ్ అంటే ఇష్టం..

ప్రభాస్, మహేశ్ అంటే ఇష్టం..

టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రిన్స్ మహేశ్‌బాబు, ప్రభాస్, చిరంజీవి అంటే ఇష్టం. తమిళంలో అజిత్, విజయ్ అంటే పడిచస్తాను అని నిక్కీ పేర్కొన్నది. వారితో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అని ఆమె తెలిపింది. చాలా రోజులుగా అందరూ ఇదే అడుగుతున్నారు. నాక్కూడా నటించాలని ఉంది. త్వరలో నా ఆశ తీరుతుందని అనుకుంటున్నాఅని ఆమె వెల్లడించింది.

పవర్ స్టార్ పేరులోనే..

పవర్ స్టార్ పేరులోనే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయన పేరులో పవర్ ఉంది. ఇంతకంటే ఏమి చెప్తాను. ఆయనలో ఉండే ఎనర్జీ, కరిష్మా, ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే దిమ్మతిరుగుతుంది అని పలువురు అడిగిన ప్రశ్నలకు నిక్కీ సమాధానం చెప్పింది.

బాహుబలి తర్వాత..

బాహుబలి తర్వాత..

ప్రభాస్‌కు నేను ఫ్యాన్ అయిపోయాను. ఆయన నటించిన ‘బాహుబలి' సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ప్రభాస్‌, రాజమౌళి సర్‌తో కలిసి పనిచేయాలని ఎవ్వరైనా కోరుకుంటారు అని నిక్కీ అన్నారు. మహేష్‌బాబు సర్‌ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఆయన సినిమాలు ఎంచుకునే తీరు నచ్చుతుంది. ఆయన నటిస్తున్న ‘స్పైడర్‌' కచ్చితంగా చూస్తాను అని చెప్పింది.

ఎంజాయ్ చేశాను...

ఎంజాయ్ చేశాను...

మరకతమణి చిత్రాన్ని షూటింగ్ రోజులు కొత్త అనుభూతిని మిగిల్చాయి. ఆ షూటింగ్ డేస్‌ను చాలా ఎంజాయ్‌ చేశాను. కచ్చితంగా ప్రేక్షకులు మెచ్చే చిత్రమవుతుంది అని కథానాయిక నిక్కీ గల్రానీ అన్నారు. ఏఆర్‌కే శరవణన్‌ దర్శకత్వంలో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ జంటగా నటించిన చిత్రం మరకతమణి చిత్రం శుక్రవారం (జూన్ 16న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

బహుభాషా నటి..

బహుభాషా నటి..

నిక్కీ గల్రానీ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. నటిగా, మోడల్, ఫ్యాషన్ డిజైనర్‌ అయిన ఆమె తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించింది. నిక్కీ నటించిన మరకతమణి చిత్రం తెలుగులోకి అనువాదం అయింది. మలయాళంలో వెల్లిముంగా, తమిళంలో డార్లింగ్ చిత్రాలు ఆమెకు మంచిపేరు సంపాదించిపెట్టాయి. ఇప్పటివరకు దాదాపు 25 చిత్రాల్లో నటించింది.

English summary
Young Heroine Nikki Galrani become fan of Pawan Kalyan. She said that His name its self has great power. Her latest movie Marakatamani is released in Telugu on June 16th. She hopes her career has good start in Tollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu