»   » యూఎస్‌లో మెంటల్ మదిలో హవా.. ఫీల్ గుడ్ మూవీకి భారీ కలెక్షన్లు

యూఎస్‌లో మెంటల్ మదిలో హవా.. ఫీల్ గుడ్ మూవీకి భారీ కలెక్షన్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu
US లో మెంటల్ మదిలో హవా.. మాములుగా లేదుగా !

పెళ్లిచూపులు లాంటి ఘన విజయాన్ని అందించిన నిర్మాత రాజ్ కందుకూరి రూపొందించిన మరో చిత్రం మెంటల్ మదిలో. హీరో శ్రీ విష్ణు నటించిన ఈ చిత్రం ద్వారా వివేక్ ఆత్రేయగా దర్శకుడిగా, నివేదా పేతురాజ్, అమృత శ్రీనివాసన్ లాంటి కొత్త తారలు పరిచయం అయ్యారు. చిన్న చిత్రంగా వచ్చిన మెంటల్ మదిలో విడుదలకు ముందే మంచి టాక్‌ను సంపాదించుకొన్నది. సినీ విమర్శకుల మెప్పు పొందుతున్నది. ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్లు భారీగా ఉండటం సినిమాకు ఉన్న ఆదరణను చెబుతున్నది.

 అమెరికాలో భారీ కలెక్షన్లు

అమెరికాలో భారీ కలెక్షన్లు

నవంబర్ 24న రిలీజైన మెంటల్ మదిలో లోకల్, ఓవర్సీస్ మార్కెట్‌లో మంచి కలెక్షన్లు సాధిస్తున్నది. తొలి వారంలోనే 2.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

 70 స్క్రీన్లలో రిలీజ్

70 స్క్రీన్లలో రిలీజ్

మెంటల్ మదిలో చిత్రం అమెరికాలో దాదాపు 70 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ప్రతీ స్క్రీన్‌లో కూడా మంచి కలెక్షన్లను సాధించాయి. మెంటల్ మదిలో చిత్రంతోపాటుగా రిలీజైన బాలకృష్ణుడు, నెపోలియన్, ఇతర చిత్రాల కంటే మంచి వసూళ్లను సాధించడం గమనార్హం.

 26వ స్థానంలో మెంటల్ మదిలో

26వ స్థానంలో మెంటల్ మదిలో

అమెరికా బాక్సాఫీస్‌ వద్ద మెంటల్ మదిలో చిత్రం 26వ స్థానంలో నిలిచింది. గురువారం ప్రివ్యూ ప్రదర్శన ద్వారా 25277 డాలర్లు వసూలయ్యాయి. శుక్రవారం 32,853 డాలర్లు, శనివారం 48207 డాలర్లు, ఆదివారం 27699 డాలర్లు వసూలు చేసింది అని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రం సుమారు 90 లక్షల రూపాయలను కలెక్ట్ చేసింది. అని పేర్కొన్నారు.

 రెండోవారం పుంజుకునే

రెండోవారం పుంజుకునే

పబ్లిక్ టాక్‌తో రెండోవారం కలెక్షన్లు పుంజుకునే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల విశ్లేషణ. ఒకవేళ అదే జరిగితే కలెక్షన్లు రెండింతలు అయ్యే అవకాశం లేకపోలేదనే మాట వినిపిస్తున్నది.

 శ్రీ విష్ణుకు ప్రశంసలు

శ్రీ విష్ణుకు ప్రశంసలు

అప్పట్లో ఒక్కడుండేవాడు, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలతో శ్రీ విష్ణు మంచి పేరు సంపాదించుకొన్నాడు. తాజాగా విడుదలైన మెంటల్ మదిలో చిత్రంతో శ్రీ విష్ణు రేంజ్ పెరిగిందనే మాట వినిపిస్తున్నది.

 నివేదా, అమృతా గుడ్

నివేదా, అమృతా గుడ్

మెంటల్ మదిలో చిత్రంతో అద్బుతమైన నటనను పలికించిన నివేదా పేతురాజ్ కి తెలుగులో విశేషమైన క్రేజ్ ఏర్పడింది. ఇక మరో హీరోయిన్‌గా నటించిన అమృత శ్రీనివాసన్‌ యాక్టింగ్, ఈజ్‌కు మంచి పేరు వచ్చింది.

English summary
Producer Raj Kandukuri's latest movie is Mental Madhilo. This movie gets good talk before its release.పెళ్లిచూపులు లాంటి ఘన విజయాన్ని అందించిన నిర్మాత రాజ్ కందుకూరి రూపొందించిన మరో చిత్రం మెంటల్ మదిలో.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu