Just In
- 36 min ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 1 hr ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 2 hrs ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 2 hrs ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
Don't Miss!
- News
అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ.. ఎందుకంటే..
- Finance
సెన్సెక్స్ 530 పాయింట్లు డౌన్, అందుకే రిలయన్స్ మహా పతనం
- Sports
ఆ వ్యూహంతోనే ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాం.. వికెట్లు ఇచ్చారు: సిరాజ్
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎవరితో డేట్ చేస్తావు? నేనా, యాంకర్ ప్రదీపా?... రష్మితో ఆడుకున్న సుడిగాలి సుధీర్!

యాంకర్ రష్మి ఓ వైపు టీవీ షోలు చేస్తూనే అడపా దడపా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. రష్మి నటించిన 'నెక్ట్స్ నువ్వే' మూవీ ఇటీవల విడుదలైంది. సినిమా ప్రమోషన్లో భాగంగా జబర్దస్త్ షో కో ఆర్టిస్ట్ సుడిగాలి సుధీర్‌తో కలిసి చిన్న ప్రమోషనల్ వీడియో విడుదల చేసింది రష్మి.
ఇందులో భాగంగా సుడిగాలి సుధీర్ కొన్ని రాఫిడ్ ఫైర్ క్వశ్చన్స్ రష్మికి సంధించాడు. వీటికి రష్మి పన్నీగా ఆన్సర్స్ ఇచ్చింది. అందులో కొన్ని ప్రశ్నలు రష్మిని ఇరకాటంలో పడేసే విధంగా ఉండటం విశేషం.

యాంకర్, యాక్టర్ కాకపోయి ఉంటే...?
నువ్వు యాంకర్ లేదా యాక్టర్ కాక పోయి ఉంటే ఏ ప్రొఫెషన్లోకి వెళ్లేదానివి? అనే ప్రశ్నకు రష్మి సమాధానం చెబుతూ.... గార్డెనర్ అయ్యేదాన్ని. నాకు మెక్కలు పెంచడం, ముఖ్యంగా వెజిటెబుల్స్ పెంచడం అంటే చాలా ఇష్టమని తెలిపారు.

ఎగ్జైటెడ్ రూమర్ ఏమిటి?
ఇప్పటి వరకు నువ్వు విన్నదాంట్లో ఎగ్జైటెడ్ రూమర్ ఏది? అనే ప్రశ్నకు రష్మి సమాధానం చెబుతూ.... మహేష్ బాబు సినిమాలో తాను నటిస్తున్నట్లు కొన్ని రూమర్స్ వచ్చాయని, అవి తనను ఎంతగానో ఎగ్జైట్ చేశాయని తెలిపారు.

ఎలాంటి రూమర్ అంటే ఇష్టం...?
ఎలాంటి రూమర్స్ వినాలనుకుంటున్నావు...? అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ ‘రష్మికి ఎవరితోనూ రిలేషన్ షిప్ లేదు' అనే రూమర్ వినాలని ఉందని అంటూ సమాధానం చెప్పారు.

నీలో బెస్ట్, వరస్ట్ థింగ్ ఏమిటి?
నా మనసులో ఏదుంటే అది మొహంమీదే చెప్పేస్తా... అది వరస్ట్ థింగ్. బెస్ట్ ఏంటో నువ్వే(సుడిగాలి సుధీర్) చేప్పాలి అంటూ రష్మి వ్యాఖ్యానించింది. నువ్వే ఒక బెస్ట్ థింగ్ అంటూ సుధీర్ ఆటపట్టించారు.

సుధీర్, ప్రదీప్ డేట్ అడిగితే ఎవరితో చేస్తావు..?
సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్ డేట్ అడిగితే ఎవరితో చేస్తావు...? అనే ప్రశ్నకు రష్మి సమాధానం చెబుతూ నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి ప్రదీప్‌ను పేరు చెబుతాను అంటూ తెలివిగా స్పందించింది.

సుడిగాలి సుధీర్‌ను కో యాంకర్‌గా చూస్తావా? లేదా ఫ్రెండుగా చూస్తావా?
సుడిగాలి సుధీర్‌ను కో యాంకర్‌గా చూస్తావా? లేదా ఫ్రెండుగా చూస్తావా? అనే ప్రశ్నకు రష్మి స్పందిస్తూ..... ఫ్రెండ్, జస్ట్ ఫ్రెండ్ అంటూ సమాధానం ఇచ్చింది.

వన్ నైట్ స్టాండ్, లాంగ్ లాస్ట్ రిలేషన్ షిప్.. వీటిలో దేన్ని నమ్ముతావు?
వన్ నైట్ స్టాండ్, లాంగ్ లాస్ట్ రిలేషన్ షిప్... వీటిలో దేన్ని నమ్ముతావు? అనే ప్రశ్నకు లాంగ్ లాస్ట్ రిలేషన్ షిప్ అని రష్మి సమాధానం చెప్పారు.

ఫస్ట్ క్రష్ ఎవరిపై?
ఫస్ట్ క్రష్ ఎవరిపై? అనే ప్రశ్నకు..... అమీర్ ఖాన్ అంటూ రష్మి సమాధానం చెప్పారు.

నీ జీవితాన్ని మార్చేసిన నిర్ణయం?
నీ జీవితాన్ని మార్చేసిన నిర్ణయం ఏమిటి? అనే ప్రశ్నకు ‘జబర్దస్త్' టీవీ షో ఒప్పుకోవడం నా జీవితాన్ని మార్చేసింది. దాని వల్లే నా కెరీర్ ఇక్కడి వరకు వచ్చింది అని రష్మి సమాధానం చెప్పారు.

ఎవరినైనా రిజెక్ట్ చేశావా?
ఎవరినైనా రిజెక్ట్ చేశావా? అనే ప్రశ్నకు రష్మి సమాధాన చెబుతూ..... నేను ఎవరినీ రిజక్ట్ చేయను అని వ్యాఖ్యానించింది. నువ్వు రిజక్ట్ చేయడానికి నీకు అసలు ప్రపోజల్స్ వస్తేకదా అంటూ సుధీర్ ఆటపట్టించాడు.