For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజమౌళి అంత డైరెక్టర్ అవ్వాలనే క్యారెక్టర్, కానీ అన్నీ అప్పులే... (హీరో ఆది ఇంటర్వ్యూ)

  By Bojja Kumar
  |

  ఆది హీరోగా వి4 మూవీస్ బ్యానర్‌లో పి.ప్రభాకర్‌(ఈటీవీ ప్రభాకర్)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం 'నెక్ట్స్ నువ్వే'. ఆది సరసన వైభవి, రష్మీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

  గీతాఆర్ట్స్, స్టూడియో గ్రీన్, యూవి క్రియేషన్స్ సంయుక్తంగా..... వి4 బేనర్ స్థాపించారు. ఈ బేనర్లో వస్తున్న తొలి చిత్రం 'నెక్ట్స్ నువ్వే'. నవంబర్ 3న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఆది మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

  ఈ కథ మీ వద్దకు ఎలా వచ్చింది?

  ఈ కథ మీ వద్దకు ఎలా వచ్చింది?

  గత డిసెంబర్లో నా బర్త్ డే సమయంలో ప్రభాకర్ ఈ సినిమా కథ చెప్పారు. బాగా నచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ వెనక గీతా ఆర్ట్స్ ఉందని చెప్పగానే చాలా ఎగ్జైటెడ్‌గా అనిపించింది. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేనర్లో చేయడం ఎవరికైనా ఒక డ్రీమ్. వీరితో పాటు స్టూడియోగ్రీన్ జ్ఞానవేల్ రాజా జాయిన్ అవ్వడం, యూవి క్రియేషన్స్ జాయిన్ అవ్వడం మరింత ఎగ్జైటింగ్ అనిపించింది. ‘నెక్ట్స్ నువ్వే' షూటింగ్ ఏప్రిల్ లో మొదలు పెట్టి 36 రోజుల్లో కంప్లీట్ చేశామని ఆది తెలిపారు.

  అదే నా డ్రీమ్

  అదే నా డ్రీమ్

  నేను ఈ జోనర్... ఆ జోనర్ అని ఫిక్స్ అవ్వలేదు. అన్ని జోనర్లు చేయాలి, ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్లు చేయాలి. మంచి వెర్సటైల్ యాక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్. ఏ జోనరైనా ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లే ఉండాలనేది నా అభిప్రాయం. ఈ కథ చెప్పిన వెంటనే హారర్ అని ఆలోచించలేదు. క్యారెక్టరైజేషన్ బావుంది, కథ బావుంది. మంచి ప్రొడ్యూసర్ దొరికాడు. దానికి నో చెప్పడానికి ఏ ముంటుంది... అని ఆది వ్యాఖ్యానించారు.

  రోటీన్ అని ఏమీ ఉండదు

  రోటీన్ అని ఏమీ ఉండదు

  ఏ సినిమా అయినా రోటీన్ అనేది ఉండదు. దాన్ని కొత్తగా ఎలా ప్రజంట్ చేస్తాం, స్క్రీప్లే ఎలా రన్ చేస్తాము అనేదే ముఖ్యం. ఇంట్రెస్టింగ్‌గా 2 గంటలు ఎంగేజ్ చేయగలిగితే ఏ జోనర్ అయినా ఆడుతుంది... అని ఆది తెలిపారు.

  రీమేక్ అయినా చాలా మార్పులు చేశారు

  రీమేక్ అయినా చాలా మార్పులు చేశారు

  ఇది తమిళ చిత్రం ‘యామిరిక్ భయమే' చిత్రానికి రీమేక్ అయినా 70 శాతం తెలుగు నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేశాం. ప్రభాకర్ చెప్పిన తర్వాతే ఈ సినిమా తమిళంలో చూశాను.... అని ఆది తెలిపారు.

  లక్కీగా ఆ ప్రాజెక్ట్ నా వద్దకే వచ్చింది

  లక్కీగా ఆ ప్రాజెక్ట్ నా వద్దకే వచ్చింది

  గతంలో తమిళ ఫ్రెండ్స్ ఇది నువ్వు రీమేక్ చేస్తే బావుండు అని చెప్పారు. రైట్స్ ఎక్కడ ఉన్నాయని అరా తీస్తే బన్నీ వాసుగారి దగ్గర ఉన్నాయని తెలిసింది. ఆలాంటి సినిమా నాకు వస్తే బావుండు అని అప్పట్లో అనుకున్నాను. లక్కీగా నేను అనుకున్నట్లు ఆ ప్రాజెక్టే నా వద్దకు వచ్చింది... అని ఆది తెలిపారు.

  రాజమౌళి అంత డైరెక్టర్ అవ్వాలనే క్యారెక్టర్, కానీ అప్పులే...

  రాజమౌళి అంత డైరెక్టర్ అవ్వాలనే క్యారెక్టర్, కానీ అప్పులే...

  సినిమా కథ విషయానికొస్తే... ఇది ఓ సీరియల్ డైరెక్టర్ కథ. ఇందులో నేను కిరణ్ అనే క్యారెక్టర్ చేస్తున్నాను. వాడికి రాజమౌళి అంత డైరెక్టర్ అవ్వాలని కోరిక. వీడు తీసేది మాత్రం ‘సంసారం సేమియా ఉప్మా' లాంటి సీరియల్స్. తనే ఓ సీరియల్ ప్రొడ్యూస్ చేసి, అప్పుల పాలై వారి నుండి ఎస్కేప్ అవ్వాలని ఓ రిసార్ట్ ఓపెన్ చేస్తాడు. అక్కడ జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్ మీదే కథ నడుస్తుంది. మొదటి నుండి చివరి వరకు ఎంటర్టెన్మెంట్ మీదే ఫోకస్ పెట్టాం. క్లీన్ కామెడీ ఉంటుంది. సినిమా మొత్తం ఒక ఫన్ లా సాగుతుంది... అని ఆది తెలిపారు.

  ఇది నా తొలి రీమేక్, అనుకరించలేదు

  ఇది నా తొలి రీమేక్, అనుకరించలేదు

  కెరీర్లో తొలిసారి రీమేక్ సినిమా చేస్తున్నాను. తమిళ మూవీతో సంబంధం లేకుండా నా స్టైల్ లో నేను చేశాను, ఎవరినీ అనుకరించలేదు అని ఆది తెలిపారు.

  చిరంజీవి అభిమానిని

  చిరంజీవి అభిమానిని

  నేను చిరంజీవి అభిమానిని, చాలా సార్లు చెప్పాను. అందరికీ తెలిసిందే. అలాంటిది అరవింద్ గార సపోర్టుగా ఉన్న ఈ బేనర్లో చేయడం ఆనందంగా ఉంది. బన్నీ వాసు గారికి ఈ బాధ్యతలు అప్పగించారు. ఆయన సక్సెస్ ఫుల్ నిర్మాత. 24 గంటలు సినిమా గురించే ఆలోచించే వ్యక్తి. ఆయన సక్సెస్ రేషియో చూసిన తర్వాత ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది అని ఆది తెలిపారు.

  మరో మూడు ఆఫర్లు కొట్టేశా

  మరో మూడు ఆఫర్లు కొట్టేశా

  ముందుగా బన్నీ వాసుగారికి థాంక్స్ చెప్పాలి. నన్ను జ్ఞానవేల్ రాజా గారికి పరిచయం చేశారు. స్టూడియోగ్రీన్ బేనర్లో మూడు సినిమాలో ఓకే అయ్యాయి. అందులో ‘యామరిక్ భయమే' డైరెక్టర్‌తో, విజయ్ అని కొత్త కుర్రాడితో ఒక సినిమా, దీంతో పాటు స్టూడియోగ్రీన్ వారు తెలుగులో స్ట్రైట్‌గా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. అందులో నేనే హీరో. దీనికి కూడా ప్రభాకరే డైరెక్టర్ అనుకుంటున్నాం. కానీ ఈ విషయం జ్ఞానవేల్ రాజాగారు ఫైనల్ చేయాల్సి ఉంది... అని ఆది తెలిపారు.

  రెగ్యులర్ కమర్షియల్స్ చేయను

  రెగ్యులర్ కమర్షియల్స్ చేయను

  ఇక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయను. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలే చేస్తాను. కొత్త కాన్సెప్టులతో వచ్చే యంగ్ డైరెక్టర్లతో చేద్దామనే ఆలోచనలో ఉన్నాను. ప్రస్తుతం కథలు వింటున్నాను. ఇంకా ఏది కమిట్ కాలేదు. గతేడాది కంటే ఈ ఏడాది చాలా బావుంది. వచ్చే ఏడాది మరింత బావుంటుందని అనుకుంటున్నాను... అని ఆది తెలిపారు.

  నెక్ట్స్ మూవీ

  నెక్ట్స్ మూవీ

  నెక్ట్స్ యూఎస్ ప్రొడక్షన్ వారితో చేస్తున్నాను. విశ్వనాథ్ అని కొత్త డైరెక్టర్. 80 శాతం షూటింగ్ అయిపోయింది. నేను, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటిస్తున్నాం. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టెన్మెంట్. దీంతో పాటు విజయ్‌తో స్టూడియో గ్రీన్ ప్రాజెర్ట్ 10 డేస్ షూటింగ్ అయిపోయింది. ‘నెక్ట్స్ నువ్వే' ప్రమోషన్స్ కోసం అని షూటింగ్ ఆపాము.

  ప్రభాకర్ మీద పూర్తి నమ్మకంతో చేశాను

  ప్రభాకర్ మీద పూర్తి నమ్మకంతో చేశాను

  ‘నెక్ట్స్ నువ్వే ' సినిమాకు ప్రభాకర్ అనగానే ఏమీ అలోచించలేదు. 100 శాతం న్యాయం చేస్తారు అనిపించింది. ఎందుకంటే ఆయనకు ఎక్స్ పీరియన్స్ ఉంది. గైడ్ చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. దాంతో పాటు ఆయన చాలా స్పీడ్ కూడా... కాన్సెప్ట్ బేస్డ్ సినిమాను 36 రోజుల్లో పూర్తి చేశారు... అని ఆది తెలిపారు.

  English summary
  Check out "Next Nuvve" movie Hero Aadi Interview. Next Nuvve is a comedy horror movie. The movie is being directed by TV star Prabhakar, who is making his directorial debut with 'Next Nuvve'. The movie will feature Vaibhavi Sandilya as the female lead whereas Jabardasth Rashmi Gautam will be seen essaying an important role.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X