యాంకర్ రష్మీకి అరుదైన వ్యాధి.. అందుకే అలా అవుతున్నానని వెల్లడి

Recommended Video

I Was Diagnosed With A Disorder Says Rashmi Gautam

బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైన అందం, అభినయంతో మ్యాజిక్ చేస్తున్న రష్మీ గౌతమ్ తాజాగా బొద్దుగా కనిపిస్తున్నారు. అదే విషయాన్ని తన అభిమాని సోషల్ మీడియాలో ఆరా తీయగా దానికి రష్మీ సమాధానం ఇచ్చారు. తన లావుకు కారణం ఓ అరుదైన వ్యాధి. అది తన బాల్యం నుంచే తనకు ఉందని అసలు విషయాన్ని బయటపెట్టారు. ఇంతకు రష్మీని అభిమాని ఏమన్నారు.. దానికి ఆమె బదులిచ్చిన తీరు ఏంటంటే..

రష్మి ఆరోగ్యంపై అభిమాని ఆందోళన

అభిమాని చేసిన ట్వీట్ ప్రకారం.. రష్మీగారు.. ఇటీవల మీరు ఓ ఈవెంట్‌లో చీరలో కనిపించారు. అందులో మీరు చాలా లావుగా ఉన్నారు. మీరు మూడు పదుల వయసులో ఉన్నారు. కాబట్టి శరీరాకృతి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అని అభిమాని హెచ్చరించారు.

కాజల్, సమంత లానే

కాజల్, సమంత లానే

మీ వయసులో ఉన్న సినీ తారలు కాజల్ అగర్వాల్, సోనాల్ చౌహాన్, ఇషా గుప్తా, సమంత చాలా స్లిమ్‌గా బాడీని మెయింటెన్ చేస్తున్నారు. మీరు కూడా మీ బాడీపై శ్రద్ధపెట్టండి. లేకపోతే కెరీర్‌కు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది.

మా సూచనలను అర్థం చేసుకోండి

మా సూచనలను అర్థం చేసుకోండి


రష్మీగారు త్వరగా మీ కెరీర్ ముగిస్తే భరించలేము. నేను చెప్పే పాయింట్‌ను పరిగణనలోకి తీసుకోండి. నేను చెప్పే మాటలు హర్ట్ చేయవచ్చు. అలా అయితే అందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను అని రష్మీ ఫ్యాన్ సోషల్ మీడియాలో ఓ పోస్టును పెట్టారు.

ఫ్యాన్ రిక్వెస్ట్‌పై రష్మీ

ఫ్యాన్ రిక్వెస్ట్‌పై రష్మీ

తన అభిమాని చేసిన రిక్వెస్ట్‌పై రష్మీ స్పందించారు. తన బరువు, లావుకు కారణమైన పరిస్థితులను రష్మీ వివరించారు. లావైతే నాకు ఆఫర్లు తగ్గిపోతాయి. మీరు సూచించిన ప్రకారం నా ఆహార అలవాట్లు, తీసుకొనే ఆహారం విషయంలో జాగ్రత్త వహిస్తాను అని చెప్పారు.

నా బరువు, లావుకు కారణం

అంతేకాకుండా తన లావుకు కారణం రుమాటిజం. ఈ వ్యాధికి గురయ్యానని 12వ ఏటనే తెలిసింది. అప్పటి నుంచి నేను ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాను అని రష్మీ వెల్లడించారు. ఈ వ్యాధి వల్ల బరువు, లావు విషయంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలను తీసుకొంటున్నాను. అభిమానులు ఆందోళన చెందవద్దు అని పేర్కొన్నారు.

ఒత్తిడి, డిప్రెషన్ పెంచుతాయని

ఒత్తిడి, డిప్రెషన్ పెంచుతాయని

ఇలాంటి విషయాలు మనపై ఓ రకమైన ఒత్తిడి పెంచుతాయి. డిప్రెషన్‌కు గురిచేస్తాయి. కొందరు దీని నుంచి బయటపడటానికి చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకొన్నారు. దాని వల్ల కొన్ని దుష్పరిమాణాలు కనిపించాయి. ఒకవేళ అలాంటి పరిస్థితులే ఎదురైతే నేను గౌరవంగా తప్పుకొంటాను అని రష్మీ తన అభిమానులకు చెప్పారు.

వెండితెర, బుల్లితెరపై కూడా

వెండితెర, బుల్లితెరపై కూడా

జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, ఢీ జోడి, ఢీ 10 లాంటి ప్రజాదరణ పొందిన టెలివిజన్ రియాలిటీ షోలకు రష్మీ గౌతమ్ యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా గుంటూరు టాకీస్, నెక్ట్స్ నువ్వే, అంతకు మించి చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X