టెర్రిఫిక్ థ్రిల్లర్: 'ఒక్క క్షణం' ట్విట్టర్ రివ్యూ.. చిరంజీవి మొదలెట్టాడు, శిరీష్ ముగించాడు..
ఒక్క క్షణం విడుదల వేళ.. అల్లు శిరీష్‌కు క్షణం.. క్షణం ఉత్కంఠ అనే చెప్పాలి. హీరోగా నాలుగేళ్ల కెరీర్ ఒక మోస్తరు హిట్‌కే పరిమితమవడంతో.. బ్లాక్ బస్టర్ కోసం అతను శాయశక్తులా కష్టపడుతూ వచ్చాడు. ఎట్టకేలకు ఇప్పుడా ఆ కష్టం ఫలించినట్లే కనిపిస్తోంది. డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక్క క్షణంకు ట్విట్టర్‌లో పాజిటివ్ టాక్ రావడం విశేషం. ఒక్క క్షణంపై నెటిజెన్స్ అభిప్రాయాలు ఇప్పుడు చూద్దాం..
Recommended Video

హిట్టు బొమ్మ:
ఇంటర్వెల్ సీన్.. సెకండాఫ్ సూపర్బ్ అనే టాక్ వినిపిస్తోంది. సినిమాలో ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయని.. ఇది పక్కా హిట్టు బొమ్మ చెబుతున్నారు.
ఫస్టాఫ్ సూపర్బ్:
సినిమాలో సెకండాఫ్ బాగుందని కొంతమంది అభిప్రాయపడుతుంటే.. మరికొంతమంది ఫస్టాఫ్ బాగుందని చెబుతున్నారు.
స్క్రీన్ ప్లే బాగుంది:
దర్శకుడు విఐ ఆనంద్ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుందనే టాక్ వినబడుతోంది. నిర్మాణ విలువలు బాగున్నాయని, నటీనటులంతా బాగా పెర్ఫామ్ చేశారని అంటున్నారు. మొత్తంగా ఇటీవలి కాలంలో మంచి థ్రిల్లింగ్ మూవీ అని చెబుతున్నారు.
ఇంటర్వెల్ అదిరింది..:
సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందనే టాక్ వినిపిస్తోంది.
మూవీ బాగుందప్పా:
ఫస్టాఫ్ అద్భుతం.. సెకండాఫ్ ఓకె అనే రీతిలో ఉందని.. మొత్తంగా సినిమా బాగుందప్పా అని తొలి ఆట చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.
ఒక్క క్షణం:
2017ముగింపును టాలీవుడ్ ఒక్క క్షణం బ్లాక్ బస్టర్ తో ముగించిందన్న టాక్ వినిపిస్తోంది.
ఫస్టాఫ్ సూపర్:
ముందే చెప్పుకున్నట్లు ఒక్క క్షణం సినిమాకు కథ బాగా హైలైట్ అయినట్లు తెలుస్తోంది. సినిమాలో ఫస్టాఫ్ హైలైట్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టెర్రిఫిక్ థ్రిల్లర్:
టెర్రిఫిక్ థ్రిల్లర్ అంటూ నివాస్ అనే నెటిజెన్ ఒక్క క్షణంపై తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. సినిమా అదరగొట్టిందని చెప్పుకొచ్చాడు.
2017 ఫస్ట్.. లాస్ట్:
2017ను మెగస్టార్ ఖైదీ నం.150 బ్లాక్ బస్టర్ తో ప్రారంభిస్తే.. చిరంజీవి అల్లుడు శిరీష్ ఒక్క క్షణం బ్లాక్ బస్టర్ ముగింపు పలికాడన్న టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











