twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఒక్క క్షణం' ఆనంద్ అబద్దం చెప్పాడా?: 'సీక్రెట్ డీల్'తో వివాదాన్ని సైడ్ చేశారా!..

    |

    Recommended Video

    'ఒక్క క్షణం' పై ఇవే హైప్ పెంచాయి..

    నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే హాలీవుడ్ సినిమాలు మనకన్నా వందేళ్లు ముందున్నట్లే లెక్క. విభిన్న కథలను తెరకెక్కించడంలోనూ.. సినిమా టెక్నిక్స్ విషయంలోనూ వాళ్లు మనకు అందనంత దూరంలోనే ఉన్నారు. కాబట్టే.. మన దర్శకులు, రచయితలు అక్కడివాళ్లను కాపీ కొట్టే ప్రయత్నం చేస్తారన్న విమర్శలున్నాయి.

    ఒక్క క్షణం దర్శకుడు విఐ ఆనంద్ కూడా ఇప్పుడివే విమర్శలను ఎదుర్కొంటున్నారు. 'ప్యారలల్ లైఫ్' అనే కాన్సెప్టుతో కొరియన్ లాంగ్వేజ్ లో ఎప్పుడో సినిమా వచ్చేసింది. అదే సినిమా కాన్సెప్టుతో సినిమా తీసిన ఆనంద్.. కాన్సెప్టు ఒకటైనంత మాత్రానా కాపీ అంటారా? అని ప్రశ్నించారు. కానీ తెరపై బొమ్మ చూశాక.. చాలామందికి ఆ సినిమా ఛాయలే గుర్తొచ్చాయట.

     అనిల్ సుంకరతో వివాదం:

    అనిల్ సుంకరతో వివాదం:

    నిజానికి కొరియన్ ప్యారలల్ లైఫ్ సినిమాను తెలుగులో తీయాలన్న ఉద్దేశంతో నిర్మాత అనిల్ సుంకర రైట్స్ కూడా కొనుగోలు చేశారు. కానీ ఒక్క క్ష‌ణం ట్రైల‌ర్ చూశాక అనిల్ సుంకర మైండ్ బ్లాంక్ అయింది. తాము చేయాలనుకున్న సినిమానే ఆనంద్ దించేశాడని అర్థం చేసుకున్నారు.

     అల్లు శిరీష్ బ్యాక్ గ్రౌండ్ రీత్యా..:

    అల్లు శిరీష్ బ్యాక్ గ్రౌండ్ రీత్యా..:

    తాము రైట్స్ తీసుకున్న సినిమాను ఆనంద్ కాపీ కొట్టాడని అనిల్ సుంకర కాస్త హడావుడి చేశారు. దీంతో సినిమాకు ఆయన అడ్డుపడుతారా? అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. అయితే అల్లు శిరీష్ బ్యాక్ గ్రౌండ్ రీత్యా.. అనిల్ సుంకర అలాంటిదేమి చేయలేదని తెలుస్తోంది.

     చేసేదేమి లేక.. 'డీల్':

    చేసేదేమి లేక.. 'డీల్':

    సినిమాకు అడ్డుపడి అనవసరంగా బ్లేమ్ అయిపోవడమే తప్పితే మరొకటి లేదు కాబట్టి.. సైలెంట్ గా డీల్ సెట్ చేసుకున్నాడట అనిల్ సుంకర. దాదాపు రూ.50లక్షలతో ఈ వివాదం సద్దుమణిగిపోయినట్లు టాక్.

    ఆనంద్.. అబద్దం చెప్పాడా?:

    ఆనంద్.. అబద్దం చెప్పాడా?:

    ప్యారలల్ లైఫ్ కాన్సెప్టు ఒకటే అయినంత మాత్రాన.. కాపీ అంటారా? అని ప్రశ్నించిన దర్శకుడు విఐ ఆనంద్ విమర్శలు ఎదుర్కోక తప్పడం లేదు. తెరపై బొమ్మ చూశాక.. ఒక్క క్షణంలో ఆ ఛాయలు బోలెడు కనిపిస్తున్నాయట. దీంతో ఆనంద్ అబద్దం చెప్పాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

     ఒక్క క్షణం.. పాజిటివ్ టాక్:

    ఒక్క క్షణం.. పాజిటివ్ టాక్:

    వివాదాల సంగతెలా ఉన్నా.. వీటివల్ల సినిమాకు మంచి పబ్లిసిటీ దొరకడమే గాక.. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. మొత్తంగా అల్లు శిరీష్ కెరీర్ లో మంచి హిట్ పడిందనే చెప్పాలి. నేడు సునీల్ నటించిన 2కంట్రీస్ టాక్‌ను బట్టి లాంగ్ రన్‌లో ఈ సినిమా కలెక్షన్స్ ఆధారపడనున్నాయి.

    English summary
    After the release of Okka Kshanam movie, 'copy' speculations widely spreaded over film. Before that Producer Anil Sunkara also argued with this movie unit on this issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X