X
తెలుగు » సినిమాలు » శివలింగ
శివలింగ

శివలింగ

Romance | Thriller | 14 Apr 2017 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

శివలింగ స్టోరీ

శివలింగ సినిమా కన్నడలో గతేడాది సూపర్ హిట్ అయిన చిత్రం "శివలింగ" ఇప్పుడు అదే "శివలింగ" పేరుతో తెలుగులో ఈ చిత్రం రీమేక్ అవుతొంది ఇది రోమ్యాంటిక్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో లారెన్స్, రితికాసింగ్, శక్తి వాసు, వడివేలు, ప్రదీప్ రవత్, ఊర్వసి, జయప్రకాష్ వి, రాధా రవి, విటివి గణేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పి వాసు నిర్వహించారు మరియు అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ స్వరాలు సమకుర్చరు.  కథ రహీమ్ అనే ఓ వంటవాడు ట్రైన్ లో హత్యకు గురవుతాడు. అయితే చూడటానికి అతడి మరణం ట్రైన్ నుండి దూకి ఆత్మహత్యకు గురైనట్లు ఉంటుంది. అతడు హత్యకు గురైనట్లు ఆధారాలు లేక పోవడంతో ఆత్మహత్యగానే కేసు క్లోజ్ చేస్తారు. అయితే రహీమ్ ప్రియురాలు.... రహీమ్ ఆత్మహత్య చేసుకునేంత పరికివాడు కాదు అంటూ.... పెద్ద పోలీస్ ఆఫీసర్ ను కలిసి కేసు రీ ఓపెన్ చేయిస్తుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సమర్థుడైన సీబి సీఐడి ఆఫీసర్ శివలింగ(రాఘవ లారెన్స్)కు అప్పజెబుతారు. రహీమ్ హత్య కేసు తన చేతికి రావడం, అదే సమయంలో శివలింగకు సత్యభామ(రితికా సింగ్)తో పెళ్లి దాదాపు ఒకేసారి జరుగుతుంది. తనను ఎవరు? ఎందుకు చంపారో? తెలుసుకోవడానికి రహీమ్ ఆత్మ పరితపిస్తుంది. శివలింగ భార్య సత్య శరీరంలోకి ప్రవేశించి త్వరగా కేసు సాల్వ్ చేయాలని, అప్పటి వరకు నీ భార్య శరీరంలోనే ఉంటానని బ్లాక్ మెయిల్ చేస్తుంది రహీమ్ ఆత్మ. తన భార్యను కాపాడుకోవడానికి శివలింగ ఏం చేసాడు? ఎలాంటి సాక్ష్యాలు లేని ఈ కేసును ఎలా సాల్వ్ చేసాడు? అనేది తర్వాతి కథ.
Read More

శివలింగ కాస్ట్ & క్రూ

శివలింగ సిబ్బంది సమాచారం

దర్శకత్వం పి వాసు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత రమేష్ పి. పిళ్లై
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

శివలింగ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కాంచన, చంద్రముఖి హీరో- డైరెక్టర్ కాంబినేషన్ కావడంతో అంతకు మించి ఊహించుకుని ప్రేక్షకులు థియేటర్ కు వెళతాడు. రోటీన్ హారర్-కామెడీకు భిన్నంగా ఇంకా ఏదైనా కొత్తగా ఆశిస్తాడు. అయితే ‘శివలింగ'లో అలాంటిదేమీ కనిపించదు. ఇంతకు ముందే వచ్చిన ఏదో పాత హారర్ కామెడీ సినిమా చూసిన ఫీలింగే కలుగుతుంది. కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా సినిమా సాగుతుంది. లారెన్స్ ఇంట్రడక్షన్ బావుంది. యాక్షన్ సీన్ తోపాటు.... చిన్న కబాలి అంటూ సాగే పాటతో లారెన్స్ ఎంట్రీ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. లారెన్స్ ఇంట్రడక్షన్ బావుంది. యాక్షన్ సీన్ తోపాటు.... చిన్న కబాలి అంటూ సాగే పాటతో లారెన్స్ ఎంట్రీ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాలో కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. కేవలం కామెడీ కోసమే ఊర్వశి, వడివేలు మీద ప్రత్యేకంగా సీన్లు చేసారు. హారర్ సీన్లకు కామెడీ మిక్స్ చేసినపుడే ప్రేక్షకుడు థ్రిల్ అవుతారు. కానీ సినిమాకు అది మైనస్సు అయింది.

శివలింగ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

శివలింగ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+