»   » ఆమె అన్నా..! అని పిలిచిందని, లారెన్స్ ఏం చేసాడంటే.... హోరెత్తిన సోషల్ మీడియా

ఆమె అన్నా..! అని పిలిచిందని, లారెన్స్ ఏం చేసాడంటే.... హోరెత్తిన సోషల్ మీడియా

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాఘవ లారెన్స్ ఒక నృత్య దర్శకుడు గా, నటుడుగా మాత్రమే కాదు తాను ఉన్న సమాజానికి తనవంతు గా చేయాల్సిన పనిని తన భాద్యతగా అనుకునే తక్కువ మంది వ్యక్తుల్లో తానూ ఒకడు, ఏ విపత్తైనా కావచ్చు తన అవసరం ఉందీ అనుకుంటే ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళిపోతాడు లారెన్స్. ఇప్పటికే వికలాంగులకూ, అనాదలకూ ఆసరాగా ఉంతూనే మరెందరికో సహాయాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తాజా గా మరో సారి తన పెద్ద మనసును చాటుకున్నాడు.

లారెన్స్ దత్తత తీసుకున్నాడు

లారెన్స్ దత్తత తీసుకున్నాడు

చెన్నై మందవెల్లికి చెందిన శ్రీనివాసన్ - గాయత్రి దంపతులకు మూడేళ్ల క్రితం లక్షణ్‌, లక్ష్య, లక్షిక, లక్షా అనే పిల్లలు ఒకే కాన్పులో పుట్టారు. ఈ నలుగురు పిల్లల్ని లారెన్స్ దత్తత తీసుకున్నాడు. బిడ్డలని పెంచటమే భారమైన ఆ దంపతులకు ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టటం మామూలు భారం కాదు.

దిక్కుతోచని స్థితిలో

దిక్కుతోచని స్థితిలో

కానీ కన్న ప్రేమ కదా నలుగురు పిల్లలలనీ పోషించుకుంటూ వస్తున్నారు.. అరకొర సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఓ ప్రమాదంలో శ్రీనివాసన్‌ కాలికి పెద్దగాయమవడంతో అప్పటినుంచి కుటుంబాన్ని పోషించలేకపోతున్నారు. స్థానిక విలేకరికి తన గోడును చెప్పుకున్నాడు. ఆ విలేకరి లారెన్స్ కు విషయాన్ని చేరవేశాడు.

60 మంది చిన్నారులున్నారు

60 మంది చిన్నారులున్నారు

లారెన్స్ ఆ కుటుంబాన్ని తన వద్దకు పిలిపించుకున్నారు. పిల్లలకు చదువు, పోషణ బాధ్యతలన్నీ తానే తీసుకుంటానని ప్రకటించాడు. ఇప్పటికే రాఘవ లారెన్స్‌ నిర్వహించే ఆశ్రమంలో 60 మంది చిన్నారులున్నారు. వారితో పాటు ఈ నలుగురూ ఉంటారని తెలిపారు.

నువ్వే దిక్కనుకొని వచ్చాం

నువ్వే దిక్కనుకొని వచ్చాం

కన్నీళ్ళతో "అన్నా..! నాపిల్లలకు నువ్వే దిక్కనుకొని వచ్చాం" అన్న గాయత్రి మాటలకి చలించి పోయాడట లారెన్స్ అన్నా అని పిలిచావ్‌గా చెల్లి ఈ రోజు నుంచి మేనమామగా వీళ్ల బాధ్యత నేను తీసుకుంటానని అన్నాడట లారెన్స్. మూడేళ్ల వయసున్న ఆ పిల్లల పోషణ, చదువు, ఇతర అవసరాలన్నింటినీ తానే చూసుకుంటానని లారెన్స్ చెప్పటం తో ఆ తల్లితండ్రుల ఆనందానికి అంతులేదు.

లారెన్స్ చారిటబుల్‌ ట్రస్ట్‌

లారెన్స్ చారిటబుల్‌ ట్రస్ట్‌

భవిష్యత్‌లో వాళ్లు ఏం చదవాలనుకుంటారో అదే చదివిస్తానని వారికి మాట ఇవ్వటమే కాదు తన ట్రస్ట్ లో ఉన్న హాస్టల్ లో చేర్చుకుంటున్నట్టు కూడా చెప్పాడు. ఇప్పటికే ఆయన లారెన్స్ చారిటబుల్‌ ట్రస్ట్‌ తరపున ఎంతోమంది పిల్లలను అక్కున చేర్చుకొని వారందరికి మంచి విద్యతో పాటు వసతి కల్పించి సంరక్షిస్తున్నారు.

ఈ నలుగురు కూడా

ఈ నలుగురు కూడా

ఇప్పుడు ఈ నలుగురు కూడా అక్కడే తమ చదువుని కొనసాగించనున్నారు. వారికి ఎప్పుడు పిల్లలని చూసుకోవాలనిపించినా వచ్చి చూసుకోవచ్చనీ, వారి భవిశ్యత్ భాద్యత అని చెప్పాడట లారెన్స్.... నిజమే లారెన్స్ సంపాదన సంవత్సరానికి 10 కోట్లకు కూడా మించదు ఒక్క సినిమాకి 20-30 కోట్లు తీసుకుంటున్న చాలామంది హీరోలకన్నా లారెన్స్ చాలా గొప్ప "హీరో" అనే అనుకోవాలి...

లారెన్స్ నువ్వు మా హీరోవి

లారెన్స్ నువ్వు మా హీరోవి

ఈ సంఘటన బయటికి రాగానే మొత్తం తమిళనాడంతా సోషల్ మీడియా లో లారెన్స్ ని మెచ్చుకుంటూ పోస్టులు వెల్లువెత్తాయ్. లారెన్స్ నువ్వు మా హీరోవి అంటూ తమిళ యువత అభినందనలు షేర్ చేస్తూనే ఉన్నారు. నిజమే కదా హీరోలు సినిమాల్లోనే ఉంటే ఎలా? లారెన్స్ లా బయటకూడా ఉన్నప్పుడే "హీరో" అన్న పదానికి ఒక అర్థం ఉండేది.

English summary
Director, Actor, Choreographer Raghava Lawrence Adopted Four Children's Who b ilongs To a poor family from chennai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu