X
టక్కర్

టక్కర్

Action | 09 Jun 2023 | U/A | 139 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

టక్కర్ స్టోరీ

టక్కర్ సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సిద్ధార్థ్, దివ్యంశ కౌశిక్, అభిమన్యు సింగ్, మోగి బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి కార్తిక్ జీ క్రిష్ దర్శకత్వం వహించారు. నిర్మాత టి జి విశ్వ ప్రసాద్ నిర్మించారు. నివాస్‌ కె.ప్రసన్న ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.  కథ పేద కుటుంబానికి చెందిన గుణశేఖర్ (సిద్దార్థ్) జీవితంలో అనునిత్యం ఫ్రస్టేషన్‌తో ఉంటాడు. బాగా డబ్బు సాధించాలనే ఏకైక కోరికతో ఊరు విడిచి వైజాగ్ వెళ్తాడు. రకరకాల ఉద్యోగాలు చేస్తూ అవమానాలకు గురి అవుతాడు. డ్రైవర్‌గా పనిచేసే గుణ అనుకోని పరిస్థితుల్లో కిడ్నాప్, మాఫియా ముఠాతో ఎదురు పడాల్సి వస్తుంది. అలాంటి క్రమంలో కిడ్నాప్ గురైన లక్కీ (దివ్యాంశ కౌశిక్)ను కలుసుకొంటాడు. ఆమెతో కలిసి గమ్యం లేని ప్రయాణం చేస్తుంటాడు. డబ్బు సంపాదించాలనే కోరికతో ఉన్న గుణశేఖర్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? రకరకాల ఉద్యోగాలు చేసిన ఆయనకు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. లక్కీ కలిసిన తర్వాత గుణశేఖర్ జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా? లక్కీతో గుణశేఖర్ ప్రయాణం ఎలా సాగింది. లక్కీతో ప్రయాణం తర్వాత డబ్బు సర్వస్వం అనే అభిప్రాయం మారిందా? కిడ్నాప్ గురైన లక్కీని కాపాడడా? లేదా డబ్బు కోసం కిడ్నాపర్లకు పట్టించాడా? లక్కీకి గుణ తన ప్రేమను చెబితే ఒప్పుకొన్నదా? అనే ప్రశ్నలకు సమాధానమే టక్కర్. రిలీజ్   ఈ సినిమా జూన్‌ 9న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైంది.  ట్రైలర్   ఇందులో సిద్ధార్థ్ డబ్బు అంటే వ్యామోహముండే యువకుడి పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆశే ఈ లోకాన్ని నడిపిస్తుంది. అదే ఆశ మన లైఫ్‌ను నిర్ణయిస్తుంది. ఆ ఆశను నెరవేర్చుకోవడానికి ధనమే ఇంధనం. దాన్ని సంపాదించుకోడానికి ఒక్కొక్కడిదీ ఒక్కో దారి.. ఆ దారి అందరికీ ఒకటే అయినప్పుడు.. అంటూ సిద్ధార్థ్ తనను తాను పరిచయం చేసుకునే సంభాషణ ఆసక్తికరంగా అనిపిస్తుంది.
Read More

టక్కర్ కాస్ట్ & క్రూ

టక్కర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం కార్తీక్ జి క్రిష్ణా
స్టోరీ కార్తీక్ జి క్రిష్ణా
సినిమాటోగ్రఫీ వంచింతం మురుగేశన్
సంపాదకుడు జి ఏ గౌతమ్
సంగీతం నివాస్ కె ప్రసన్న
నిర్మాత టి జి విశ్వ ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

టక్కర్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
లవ్, ఎమోషన్, యాక్షన్ తదితర అంశాలు కలబోసిన చిత్రం టక్కర్. తన ఇమేజ్‌కు భిన్నంగా సిద్దార్థ్ చేసిన అటెంప్ట్ బాగుంది. కానీ సరైన కథ, కథనాలతో ఇలాంటి ప్రయత్నం చేసి ఉంటే హీరోగా మంచి ఫలితం ఉండేదనిపిస్తుంది. యూత్ ఫుల్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం. దివ్యాంశ గ్లామర్ ఈ సినిమాలో జోష్ కలిగించే అంశం. అయితే ఎక్కువ ఆశించి వెళితే నిరాశ పడటానికి ఛాన్స్ ఉంది. సిద్దార్థ్‌ను అభిమానించే వారికి ఈ సినిమా నచ్చుతుంది. మీ టేస్ట్‌కు తగిన సినిమానా? కాదా? అనేది తెలుసుకోవడానికి ఈ సినిమాను థియేటర్లలో చూసే ప్రయత్నం చేయండి.

టక్కర్ ట్రైలర్

Video Thumbnail

టక్కర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

టక్కర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+