తోలుబొమ్మలాట స్టోరీ
తోలుబొమ్మలాట సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజేంద్రప్రసాద్, విశ్వంత్, వెన్నెల కిషోర్, హర్షిత, దేవీ ప్రసాద్, నర్రా శ్రీనివాస్, నారాయణ రావు, సంగీత, కల్పన, శిరీష, చలపతి రావు, ప్రసాద్ బాబు, ధనరాజ్, పూజా రామచంద్రన్, తాగుబోతు రమేష్, జబర్దస్త్ రాజు, దొరబాబు, లక్ష్మణ్ మీసాల తదితరులు నటించారు. ఈ సినిమాకి రచన, దర్శకత్వం: విశ్వనాథ్ మాగంటి వహించారు మరియు నిర్మాత దుర్గా ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సురేష్ బొబ్బిలి అందించారు. ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు కథ అచ్యుతాపురం అనే గ్రామంలో సోడాల రాజు అలియాస్ సోమరాజు (రాజేంద్ర ప్రసాద్) రైస్ మిల్లు ఓనర్. ప్రేమలో పడిన మనవడు రిషి (విశ్వంత్), మనవరాలు వర్ష (హర్షితా చౌదరి) పెళ్లి చేయడమే లక్ష్యంగా పెట్టుకొంటారు. వారిద్దరి పెళ్లి కోసం ఓ నాటకం ఆడి తన కొడుకు, కూతురిని ఇంటికి వచ్చేలా, పెళ్లి చేసేలా ఒప్పిస్తాడు. ఈ క్రమంలో సోమరాజు హఠాత్తుగా మరణిస్తాడు. దాంతో కథ అడ్డం తిరుగుతుంది. మనవడు, మనవరాళ్లు విడిపోతారు. పెళ్లి చేయడానికి కుటుంబ సభ్యులు అడ్డుపడుతారు. మొదట్లో పెళ్లి చేయమని తాత దగ్గరకు వచ్చిన మనవడు, మనవరాళ్లు ఎందుకు విడిపోయారు? ఎన్నో మనస్పర్థలు ఉన్న ఇరుకుటుంబాలు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారు? ఈ కథలో సోమరాజు రైస్ మిల్లు కథ ఏంటి? చనిపోయిన తర్వాత ఆత్మగా మారిన సోడాల రాజు కథను ఎలా నడిపించాడు. ఈ కథలో వెన్నెల కిషోర్ (సంతోష్) పాత్ర చేసిన రచ్చ ? భావన (పూజా రాంచంద్రన్) క్యారెక్టర్ ఏమిటి? చివరకు సోమరాజు కొడుకు, అల్లుడు తమ తప్పులను తెలుసుకున్నారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే తోలు బొమ్మలాట సినిమా కథ.
Read More