For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తోలు బొమ్మలాట మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  రేటింగ్: 2.75/5

  టాలీవుడ్ ప్రేక్షకులు.. అచ్చ తెలుగు సినిమాలను ఎప్పుడూ ఆధరిస్తూనే ఉంటారు. మాస్ మసాలా కమర్షియల్ ఫార్మాట్ అంటూ మూసధోరణిలో పోతున్న ఈ కాలంలో గ్రామీణ వాతావరణాన్ని, అక్కడి అనుబంధాలను, ప్రేమలను ఆవిష్కరించడం మరిచిపోతున్నారు. ఆ మధ్య శతమానంభవతి సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి కాస్త ఉపశమనం కలిగించగా.. మళ్లీ అలాంటి ఫీలింగ్ కలిగించేందుకు తోలు బొమ్మలాట అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ చిత్రం అనుకున్న విజయాన్ని నమోదు చేసిందా లేదా అన్నది చూద్దాం.

  కథ

  కథ

  అచ్యుతాపురం అనే గ్రామంలో సోడాల రాజు అలియాస్ సోమరాజు (రాజేంద్ర ప్రసాద్) రైస్ మిల్లు ఓనర్. ప్రేమలో పడిన మనవడు రిషి (విశ్వంత్), మనవరాలు వర్ష (హర్షితా చౌదరి) పెళ్లి చేయడమే లక్ష్యంగా పెట్టుకొంటారు. వారిద్దరి పెళ్లి కోసం ఓ నాటకం ఆడి తన కొడుకు, కూతురిని ఇంటికి వచ్చేలా, పెళ్లి చేసేలా ఒప్పిస్తాడు. ఈ క్రమంలో సోమరాజు హఠాత్తుగా మరణిస్తాడు. దాంతో కథ అడ్డం తిరుగుతుంది. మనవడు, మనవరాళ్లు విడిపోతారు. పెళ్లి చేయడానికి కుటుంబ సభ్యులు అడ్డుపడుతారు.

  కథలో ట్విస్ట్‌లు

  కథలో ట్విస్ట్‌లు

  మొదట్లో పెళ్లి చేయమని తాత దగ్గరకు వచ్చిన మనవడు, మనవరాళ్లు ఎందుకు విడిపోయారు? ఎన్నో మనస్పర్థలు ఉన్న ఇరుకుటుంబాలు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారు? ఈ కథలో సోమరాజు రైస్ మిల్లు కథ ఏంటి? చనిపోయిన తర్వాత ఆత్మగా మారిన సోడాల రాజు కథను ఎలా నడిపించాడు. ఈ కథలో వెన్నెల కిషోర్ (సంతోష్) పాత్ర చేసిన రచ్చ ? భావన (పూజా రాంచంద్రన్) క్యారెక్టర్ ఏమిటి? చివరకు సోమరాజు కొడుకు, అల్లుడు తమ తప్పులను తెలుసుకున్నారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే తోలు బొమ్మలాట సినిమా కథ.

  ఫస్టాఫ్ అనాలిసిస్..

  ఫస్టాఫ్ అనాలిసిస్..

  సోమరాజు పరిచయం, అతని ఆత్మ కథ మొదలెట్టిన సన్నివేశాలు ప్రేక్షకులు కథలో లీనమయ్యేట్టు చేస్తాయి. రిషి, వర్ష ప్రేమ విషయం, తమకు పెళ్లి చేయమని తాత దగ్గరకు వచ్చి చెప్పడం లాంటి ఫీల్‌గుడ్ అంశాలతో కథ ముందుకు వెళ్తూ ఉంటుంది. వారిద్దరికి పెళ్లి చేయాలని ఆలోచనలతో ఓ నాటకమాడి తన కొడుకు, కూతుళ్లను పిలిపించడం, వారిని ఒప్పించడం.. ఆ తరువాత సోమరాజు మరణించడంతో కథ ఒక్కసారిగా ఆసక్తికరంగా మారినట్టు అనిపిస్తుంది. ఆత్మగా మారిన సోమరాజు అసలు నిజం తెలుసుకోవడం, తన పిల్లలు కలిసి ఉండటం లేదని, ఒకరంటే ఒకరికి పడదని తెలుసుకోవడం లాంటి సీన్స్‌తో ఎమోషనల్‌గా కథ ముందుకు సాగుతుంది. సంతోష్ (వెన్నెల కిషోర్) ఎంట్రీతో సినిమాలో జోష్ పెరుగుతుంది. సంతోష్‌కు ఆత్మలు కనబడటమనేది హాస్యాన్ని పండించింది. ఇక తన మనవడు, మనవరాలు పెళ్లి చేసుకునేందుకు సిద్దంగా లేరని తెలుసుకోవడంతో సోమరాజు షాక్‌కు గురవడం లాంటి అంశాలతో ప్రథమార్థం ముగుస్తుంది. మొత్తంగా సంతోష్, సోమరాజు చేసిన కామెడీతో ఫస్టాఫ్ ఫీల్‌గుడ్‌గా సాగుతుంది.

   సెకండాఫ్ అనాలిసిస్..

  సెకండాఫ్ అనాలిసిస్..

  రిషి, వర్ష విడిపోవడానికి సంతోష్‌కు ఉన్న సంబంధం చెప్పడం, రిషి-వర్షలు పెళ్లి చేసుకోవడాని తాను ఒప్పుకోకపోవడం, దాని వెనకున్న గతాన్ని సంతోషం చెప్పడం లాంటి అంశాలతో సెకండాఫ్ మొదలవుతుంది. అయితే ప్రథమార్థం తరువాత ద్వితీయార్థం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. గ్రామీణ వాతావరణం, ఊళ్లో మనుషులు, కుటుంబంలో ప్రేమలు, గొడవలు చూపించగా.. సెకండాఫ్‌లో రిషి, వర్షలకు సంబంధించిన కథను నడిపించడం, సిటీ లైఫ్, ఉద్యోగాలు అంటూ చూపించడంతో రొటీన్‌గా మారుతుంది. అయితే వర్ష బావగా సంతోష్ మళ్లీ ఎంటర్ అవ్వడంతో కాస్త నవ్వులు పూయించడం రిలీఫ్‌గా అనిపించవచ్చు ఇలా కొన్ని సీన్లతో బోర్ కొట్టించినా.. చివరకు వచ్చే సరికి మళ్లీ సీరియస్‌ అవ్వడం, క్లైమాక్స్ కంటతడి పెట్టించేలా ఉండటం ద్వితీయార్థానికి కలిసొచ్చే అంశం. రొటీన్ అనిపించే కొన్ని సన్నివేశాలతో బోర్ కొట్టించినట్టు అనిపించినా.. చివరకు ఎమోషనల్‌‌ అంశాలతో దర్శకుడు ఓ మ్యాజిక్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు.

  నటీనటులు

  నటీనటులు

  సోమరాజుగా, సోడాల రాజుగా నటించిన రాజేంద్ర ప్రసాద్ గురించే. ప్రతీ సీన్‌లో తన మార్క్ నటనను చూపించేశాడు. కన్నీటిని పెట్టించే సీన్స్‌లోనే కాకుండా ప్రతీ సన్నివేశంలో తన అనుభవాన్ని రంగరించి మరోసారి రుచి చూపించాడు. ఇక తరువాత చెప్పుకోవాల్సింది సంతోష్ పాత్రను పోషించిన వెన్నెల కిషోర్ గురించి. స్క్రీన్‌పై కనిపించిన మొదటి సీన్ నుంచి క్లైమాక్స్ వరకు నవ్విస్తూనే ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కాంబోలో వచ్చిన ప్రతీ సీన్ బాగానే వర్కౌట్ అయింది. ఇక రిషి, వర్ష పాత్రల్లో నటించిన విశ్వాంత్, హర్షిత పర్వాలేదనిపించారు. మిగతా పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు.

  దర్శకుడి పనితీరు

  దర్శకుడి పనితీరు

  దర్శకుడిగా మొదటి సినిమా అయినా.. బలమైన కథను తీసుకోవడంలో అతని గట్స్ కనిపిస్తాయి. అయితే ఎంచుకున్న ఈ కథను చెప్పడానికి రాసుకున్న కథనంపై మరింత దృష్టిపెట్టాల్సిందనే భావన కలుగుతుంది. సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులకు హత్తుకునేలా రాసుకోవడం అతని ప్రతిభకు అద్దం పట్టింది. అయితే సన్నివేశాలకు తగ్గట్టు రాసిన మాటల్లో అతని రచన శైలి మెప్పిస్తుంది. సపరేట్ కామెడీ ట్రాక్ నడిపించకుండా.. కథలో భాగంగానే రాసుకున్న కామెడీ, అందుకు కోసం రాసుకున్న డైలాగ్‌లు బాగానే వర్కౌట్ అయ్యాయి. ఎమోషన్స్‌ను ఇంకాస్త లోతుగా చూపిస్తే బాగుండేదేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ వచ్చే సరికి మరింత పదునైన మాటలతో ఆలోచించేలా చేసిన దర్శకుడు ఆ విషయంలో విజయవంతమైనట్టు కనిపిస్తుంది. ఎక్కడా కూడా తొలి చిత్ర దర్శకుడు అనే భావనను కలిగించకపోవడమే ఆయన సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

  సాంకేతిక నిపుణుల పనితీరు..

  సాంకేతిక నిపుణుల పనితీరు..

  ఇలాంటి ఫ్యామిలీ ఎమోషనల్ మూవీస్‌కు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా ముఖ్యం. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. విశ్వనాథ్ రాసిన మాటలు సినిమాకు మరింత బలాన్ని ఇచ్చాయి. సతీష్ కెమెరా పనితనం, కోటగిరి ఎడిటింగ్ ఇలా ప్రతీ విభాగం సినిమాను అందంగా మలిచేలా చేశాయి. నిర్మాతగా మొదటి చిత్రమైనా అభిరుచి ఉన్న ప్రొడ్యూసర్‌గా దుర్గా ప్రసాద్ నిరూపించుకున్నాడు. నిర్మాణ విలువలు, ఆర్ట్ విభాగాల పనితీరు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

   ఫైనల్‌గా..

  ఫైనల్‌గా..

  హీరోయిజం, మాస్ డైలాగ్‌లు, కొడితే పది మంది పడిపోయే లాంటి అంశాలను ఆశించే ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదేమో గానీ మంచి ఫీల్ గుడ్ మూవీస్‌ను ప్రేమించేవారికి నచ్చే చిత్రంగా మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంది. అశ్లీలత, అసభ్య చిత్రాల హోరెత్తుతున్న నేపథ్యంలో తోలు బోమ్మలాట చిత్రం క్లీన్ అండ్ గ్రీన్ చిత్రమని చెప్పవచ్చు.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్
  రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్
  మాటలు
  సంగీతం

  మైనస్ పాయింట్స్
  రొటీన్ కథనం
  సెకండాఫ్‌లో కొన్ని సీన్స్

  #CineBox : RRR Update : Olivia Morris Pairup With Jr. NTR In RRR Movie !
  తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, విశ్వాంత్, హర్షితా చౌదరి, వెన్నెల కిషోర్ తదితరులు
  కథ, దర్శకత్వం: విశ్వనాథ్ మాగంటి
  నిర్మాత: మాగంటి దుర్గా ప్రసాద్
  మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
  సినిమాటోగ్రఫి: సతీష్
  ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర్రావు
  బ్యానర్: సుమదుర్గా క్రియేషన్స్
  రిలీజ్ డేట్: 2019-11-22

  English summary
  Tholu Bommalata is an Telugu language Emotional Drama written and directed by Vishwanath Maganti. The film stars Rajendra Prasad, Vishwant Duddumpudi. This movie released on November 22, 2019.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X