»   » ‘హ్యాపీడేస్’ ఫేం రాహుల్‌కు ‘పవర్ పాండీ’ బ్యానర్ బంపర్ ఆఫర్..

‘హ్యాపీడేస్’ ఫేం రాహుల్‌కు ‘పవర్ పాండీ’ బ్యానర్ బంపర్ ఆఫర్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన హ్యాపీ డేస్ చిత్రంలో టైసన పాత్ర ద్వారా పరిచయమైన రాహుల్ ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించారు. ప్రేక్షకులకు గుర్తుండి పోయే పాత్రల్లో కనిపించారు. తాజాగా రాహుల్ నటిస్తున్న చిత్రం వెంకటాపురం. ఈ సినిమా మే 12వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో సిక్స్‌ప్యాక్‌తో సర్ప్రైజ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే వెంకటాపురం విడుదల కాకుండానే రాహుల్‌కు తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థ కే ప్రొడక్షన్ నుంచి బంపర్ ఆఫర్ రావడం విశేషం.

కే ప్రొడక్షన్‌లో రాహుల్..

కే ప్రొడక్షన్‌లో రాహుల్..

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ చూరగొంటున్న బాహుబలి2 సినిమాను తమిళనాడు వ్యాప్తంగా కే ప్రొడక్షన్ విడుదల చేసింది. తదుపరి తాము నిర్మించే సినిమా కోసం హీరోగా రాహుల్ సెలెక్ట్ చేసుకొన్నారు. దక్షిణ భారతంలోనే అతిపెద్ద ప్రొడక్షన్ హౌస్‌గా పేరున్న ఈ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నది. అంతేకాకుండా ఈ చిత్రంతో నేరుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నది. ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ ఎంపిక చేసుకోవడం విశేషం.

పవర్ పాండీ ఈ బ్యానర్‌లోనే..

పవర్ పాండీ ఈ బ్యానర్‌లోనే..

ఇటీవల తమిళనాడులో విడుదలై సంచలన విజయం సాధించిన పవర్ పాండీ చిత్రం ఈ బ్యానర్‌‌లోనే రూపొందింది. ఈ చిత్రానికి తమిళ నటుడు ధనుష్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధనుష్ హీరోగా స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎనై నాకోయ్ పాయుంతోటి' చిత్రాన్ని ఈ సంస్థే రూపొందిస్తున్నది. అంతేకాకుండా రానా, రెజీనా జంటగా ఓ 1945 బ్యాక్ డ్రాప్‌లో ఓ పిరియాడికల్ మూవీని ఈ సంస్థ నిర్మిస్తున్నది.

వెంకటాపురం సినిమాతో

వెంకటాపురం సినిమాతో

టాలీవుడ్ మార్కెట్‌లోకి ఎంట్రీ కావాలనుకున్న కె ప్రొడక్షన్స్ టీమ్ రాహుల్ నటించిన తాజా చిత్రం ‘వెంకటాపురం'ను చూశారు. తర్వాత వెంటనే అతనే తమ హీరో అని ఫిక్స్ అయినపోవడం గమనార్హం. రాహుల్ ఈ సినిమాలో పూర్తిగా డిఫరెంట్ మేకోవర్ తో కనిపిస్తాడు. అతని డైలాగ్ డెలివరీ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకూ అంతా వైవిధ్యంగా ఉండబోతున్నది.

రాహుల్ మళ్లీ స్టార్ హోదా..

రాహుల్ మళ్లీ స్టార్ హోదా..

గ్రాఫిక్స్‌కు అత్యంత ప్రాధాన్యం ఉండే ఈ భారీ బడ్జెట్ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ సినిమా ద్వారా రంగరాజన్ అనే కొత్త కుర్రాడు దర్శకుడు పరిచయం కాబోతున్నాడు.. జూలైలో
ప్రొడక్షన్ మొదలు కానున్న ఈ మూవీతో రాహుల్ మళ్లీ స్టార్ హీరోగా పేరు సంపాదించుకోవడం ఖాయమనే అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

English summary
Happy days fame, Actor Rahul got good opportunity from K Production of Tamil Nadu. Rahul is doing now is Venkatapuram movie. K production made power pondi movie recently. Now they are plannig to do a movie with Rahul to entry into tollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu