»   » రాజమౌళి కొడుకుపై చీటింగ్ ఆరోపణలు.... ఏం జరిగింది?

రాజమౌళి కొడుకుపై చీటింగ్ ఆరోపణలు.... ఏం జరిగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయ ప్రొడక్షన్ రంగంలో సెటిలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొన్ని సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కార్తికేయ భవిష్యత్తులో పూర్తి స్థాయి నిర్మాతగా మారనున్నాడు.

నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తించడం అంటే మామూలు విషయం కాదు. ప్రతి విషయం డబ్బుతో కూడుకున్న వ్యవహారం. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా నష్టం భారీగా ఉంటుంది. అదే సమయంలో డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో చిన్న చిన్న గొడవలు కూడా సర్వ సాధారణం. తాజాగా ఓ వివాదంలో రాజమౌళి కొడుకుపై చీటింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఓ పత్రికలో కథనం...

ఓ పత్రికలో కథనం...

ఓ ప్రముఖ పత్రిక వెబ్ సైట్లో కార్తికేయ గురించి ఓ సంచలన వార్త వచ్చింది. కార్తికేయపై డ్రోన్ సంస్థ యజమాని, ఆపరేటర్ చీటింగ్ ఆరోపణలు చేశారని ఆ కథనం సారాంశం.

Rajamouli Speech @ Ninnu Kori Movie Pre-Release Function
అతడి పేరు బయట పెట్టకుండా...

అతడి పేరు బయట పెట్టకుండా...

అయితే ఆరోపణలు చేసిన వ్యక్తి పేరు బయట పెట్టకుండా ఈ కథనం ఉండటం గమనార్హం. తన పేరును వెల్లడించేందుకు సదరు సంస్థ నిర్వాహకుడు అంగీకరించలేదని ఆ కథనంలో పేర్కొనబడి ఉంది.

ఏం జరిగింది?

ఏం జరిగింది?

సినిమాకు డ్రోన్ ఆపరేటర్లు కావాలంటూ వారాహి చలన చిత్రం నుంచి ఫోన్ వచ్చిందని, తమతో పనిచేయించుకుని, తన డ్రోన్లను వారి వద్దే పెట్టుకుని తనకిచ్చే డబ్బులను కూడా ఇవ్వలేదని సదరు వ్యక్తి ఆరోపించినట్లు ఆ కథనంలో ఉంది.

ముందే చెప్పాం...

ముందే చెప్పాం...

డ్రోన్లను తయారుచేసి, పరీక్షించడానికి టైం పడుతుందని ఈమెయిల్ ద్వారా కూడా వారికి స్పష్టంగా చెప్పాము. ఏమైందో ఏమో కానీ, తన డ్రోన్లను వారి వద్దే పెట్టుకుని అర్దాంతరంగా తమను తప్పించారని వాపోయినట్లు తెలుస్తోంది.

ఇంకా 2 లక్షలు రావాలి

ఇంకా 2 లక్షలు రావాలి

మా పనికి సగం డబ్బులు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంది. డబ్బులు చెల్లించకపోగా మా డ్రోన్లను వాళ్ల దగ్గరే ఉంచుకుని ఇవ్వడం లేదని....పేరు చెప్పడానికి ఇష్టపడని సదరు డ్రోన్ సరఫరాదారు వాపోయారట.

ఇది ఒక సైడ్ వెర్షన్ మాత్రమే...

ఇది ఒక సైడ్ వెర్షన్ మాత్రమే...

అయితే సదరు డ్రోన్ సంస్థ యజమాని పేరు చెప్పకుండా కథనం ప్రచురించిన ప్రముఖ పత్రిక వెబ్ సైట్.... కేవలం వన్ సైడ్ వెర్షన్ మాత్రమే చెప్పుకొచ్చారు. అసలు అతడి వాదనలో వాస్తవం ఏమిటి? కార్తికేయ వెర్షన్ ఏమిటి? అనేది తెలియపరుచలేదు.

యుద్ధం శరణం

యుద్ధం శరణం

నాగచైతన్య హీరోగా వస్తున్న యుద్ధం శరణం సినిమా ‘వారాహి చలన చిత్రం' బేనర్లో తెరకెక్కుతోంది. కార్తికేయ కూడా ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వ్యవహారంలోనే ఈ డ్రోన్ల గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

English summary
A drone manufacturer and operator, who does not wish to be named, is having a tough time procuring his drones and money back from Baahubali director S.S. Rajamouli’s son Karthikeya. He was hired to operate drones behind the cameras, while Naga Chaitanya acts to do it on camera, in his movie Yuddham Sharanam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu