»   » నాగ చైతన్య మూవీ ‘యుద్ధం శరణం’ ట్రైలర్

నాగ చైతన్య మూవీ ‘యుద్ధం శరణం’ ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగ‌చైత‌న్య హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై కృష్ణ ఆర్‌.వి.మారి ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌ని కొర్ర‌పాటి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం యుద్ధం శ‌ర‌ణం. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తుంది. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైదరాబాద్‌లో జ‌రిగింది. ఈ సందర్భం చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. సినిమాను సెప్టెంబర్ 8న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ట్రైలర్ ఆకట్టుకునే విధంగా..... రివేంజ్ స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఎప్పుడుడూ సంతోషంగా ఉండే నాగ చైతన్య ఫ్యామిలీలోకి విలన్ శ్రీకాంత్ వల్ల కష్టాలు వచ్చిపడతాయి. అతడితో యుద్ధం చేసి తన కుటుంబాన్ని కాపాడుకుంటాడని.... ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాణి, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, కథ: డేవిడ్ ఆర్.నాథన్, మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్ ప్లే: డేవిడ్ ఆర్.నాథన్ - అబ్బూరి రవి, కళ: రామకృష్ణ, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: వారాహి చాలనచిత్రం, నిర్మాత: రజని కొర్రపాటి, దర్శకత్వం: కృష్ణ ఆర్.వి.మారిముత్తు.

English summary
Here is Chay Akkineni's Yuddham Sharanam Trailer. Starring: Chay Akkineni, Srikanth, Lavanya Tripathi, Rao Ramesh, Revathi, Priyadarshi, Murli Sharma.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu