»   » చైతూ, రాజమౌళి, రానా ఇంట్రెస్టింగ్ స్పీచ్..... (‘యుద్ధం శరణం’ ఆడియో వేడుక)

చైతూ, రాజమౌళి, రానా ఇంట్రెస్టింగ్ స్పీచ్..... (‘యుద్ధం శరణం’ ఆడియో వేడుక)

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగ‌చైత‌న్య హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై కృష్ణ ఆర్‌.వి.మారి ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌ని కొర్ర‌పాటి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం యుద్ధం శ‌ర‌ణం. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తుంది. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నారు.

సినిమాను సెప్టెంబర్ 8న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైదరాబాద్‌లో జ‌రిగింది. ఈ సందర్భం నాగ చైతన్య, రాజమౌళి, రానా తదితరులు మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

మా ఆవిడకు నచ్చిందంటే హిట్టే

రాజమౌళి మాట్లాడుతూ.... వారాహి చలన చిత్రం సినిమా అంటే నా సినిమా అన్నట్లే. ముందు సాయి గారు కృష్ణ అనే ఒక కొత్త అబ్బాయి కథ చెప్పాడని తెలిపారు. సాయిగారికి దూకుడు ఎక్కువ, అన్నీ దూకుడుగా వెళ్లిపోతుంటారు అని కొంచెం భయం ఉంది. మా ఆవిడకు ఏ సినిమా కథ కూడా ఒక పట్టాన నచ్చదు. నా సినిమా అయినా బాగోలేదని నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. తనుకు కథ నచ్చింది. నా సినిమాలకు తప్ప వేరే సినిమాలకు కాస్టూమ్ డిజైనింగ్ కూడా చేయదు. కృష్ణ వచ్చి తనకు కథ చెప్పాడు, అందులో క్యారెక్టర్లు చెప్పాడు. దానికి కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయాలని చెప్పగానే చాలా ఎగ్జైటింగ్‌గా వచ్చి నాకు చెప్పింది. మనం బాహుబలికి ఎంత ప్రీ వర్క్ చేశామో, ప్రతి క్యారెక్టర్ ఎంత అందంగా డిజైన్ చేశామో... కృష్ణ అంతే అందంగా ప్రతి క్యారెక్టర్ డిజైన్ చేశాడు, ఈ సినిమా చేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉందని చెప్పింది. ఫస్ట్ టైమ్ తన నోటి నుండి ఎవరి గురించి అయినా ఇంత పాజిటివ్ గా రావడం తొలిసారి. దీంతో సినిమాపై చాలా నమ్మకం ఏర్పడిందని రాజమౌళి తెలిపారు.

ఈ కాలం యూత్ ఉపయోగించే వెపన్సే...

హీరో నాగచైతన్య మాట్లాడుతూ ‘ ఈ సినిమాలో దాదాపు 70 శాతం మంది కొత్త‌వారే. కొత్త‌వాళ్ల‌ను ఎంక‌రేజ్ చేసే సాయిగారు మమ్మ‌ల్ని ముందుండి న‌డించారు. డైరెక్ట‌ర్ కృష్ణ‌ నాకు చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరి పుట్టినరోజు నవంబర్ 23. నాలుగో తరగతి నుండి కలిసి చదువుకున్నాం. 8వ తరగతిలో ఒకే అమ్మాయిని ప్రేమించాం. అక్కడ మా యుద్ధం స్టార్ట్ అయింది. ఆ యుద్ధంలో నేను గెలిచాను కానీ, సెప్టెంబర్ 8 సినిమా రిలీజ్ అయినపుడు ఈ డైరెక్టర్ గెలుస్తాడు. డిఓపి నికేత్ పనితీరు అద్భుతం. అతడి వల్లే సినిమాలో అంద‌రూ బాగా క‌న‌ప‌డుతున్నారు. వివేక్ సాగర్ మంచి సంగీతం అందించారు. లైన్ ప్రొడ్యూసర్ కార్తికేయ సెట్లో అందరి మొహంలో నవ్వు ఉండేలా చేసేవాడు. సినిమా కథ విన్నపుడు ఒకలా అనిపించింది. కానీ శ్రీకాంత్, రేవతి, మురళి శర్మ, రావు రమేష్ లాంటి వారంతా కలిసి దాన్ని మరో లెవల్ కి తీసుకెళ్లారు. సామాన్యుడు పవర్‌ఫుల్ విల‌న్‌పై ఎలా గెలిచాడు అన్నది కథ. ఇందులో హీరో ఎక్కడా వెపన్‌ ఉపయోగించడు. వయలెన్స్‌ ఉండదు. నేడు యూత్ ఉపయోగించే గ్రెటెస్ట్ వెపన్ సోషల్‌ మీడియా, టెక్నాలజీ, ఇంటెలిజెన్స్‌ను మాత్రమే తన ఆయుధాలుగా వాడతాడు. సాధార‌ణంగా నా సినిమాల‌కు అభిమానులు వ‌చ్చి మ‌మ్మ‌ల్ని కలుస్తుంటారు. కానీ నేనే ఈసారి అభిమానుల‌ను వ‌చ్చి క‌లుస్తాను. ఎప్పుడు వ‌స్తాన‌నేది త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాను`` అన్నారు.

చైతన్యతో ఎప్పుడూ టార్చరే

రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ - ``ఈ సినిమా లైన్ ప్రొడ్యూసర్ కార్తికేయ ఫోన్ చేసి నువ్వు 8 గంటలకు రా భయ్యా అని చెప్పాడు. నాకు ఫస్ట్ నుండి చైతన్యతో టెన్షనే. వాడు టైం పర్టిక్యులర్ గా ఉంటాడు. టార్చర్ పెట్టేస్తాడు. అందుకే ఇపుడు చైతన్యకు చెబుతున్నాను. వాళ్లు పిలిచిన టైమ్ కే నేనే వచ్చాను. నేను చిన్న‌ప్ప‌ట్నుంచి ఇంట్లోవాళ్ల‌తో యుద్ధం చేస్తూనే ఉన్నాను. స్కూళ్లో పాస్ కావ‌డానికి ఓ యుద్ధం. ఇంట్లోవాళ్ల‌ని మేనేజ్ చేయ‌డానికి ఓ యుద్ధం. ఇలాంటి స‌మ‌యంలో చైత‌న్య చ‌క్క‌గా చ‌దివి పాస‌య్యేవాడు. వాడిని చూసి నేర్చుకోమ‌ని ఇంట్లోవాళ్లు అనేవాళ్లు. అందుకే చైత‌న్య అంటే చిన్న‌ప్ప‌ట్నుంచి నాకు టార్చ‌రే. ఇక సినిమా గురించి చెప్పాలంటే చైత‌న్య ఎప్ప‌టి నుండో తెలుసో ద‌ర్శ‌కుడు కృష్ణ కూడా అప్ప‌టి నుండే తెలుసు. చైత‌న్య‌కు మంచి ఫ్రెండ్‌. వీరి మ‌ధ్య ఫ్రెండ్‌ఫిప్ కార‌ణంగానే సినిమా బాగా వ‌చ్చింద‌ని అనుకున్నాం. నాకు నా సినిమాలంటే ఎంత ఇష్ట‌మో. చైత‌న్య సినిమాల‌న్నా, అంతక‌న్నా ఎక్కువ ఇష్టం. ఈ సినిమా ఏడాది విడుద‌లైన సినిమాలన్నింటికంటే పెద్ద హిట్ చిత్రంగా నిల‌వాల‌ని కోరుకుంటున్నాను. టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

నటీనలు, టెక్నీషియన్స్

నటీనలు, టెక్నీషియన్స్

నాగ చైతన్య, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా చేస్తున్న ఈచిత్రంలో రావు రమేష్, రేవతి, శ్రీకాంత్, మురళి శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాణి, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, కథ: డేవిడ్ ఆర్.నాథన్, మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్ ప్లే: డేవిడ్ ఆర్.నాథన్ - అబ్బూరి రవి, కళ: రామకృష్ణ, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: వారాహి చాలనచిత్రం, నిర్మాత: రజని కొర్రపాటి, దర్శకత్వం: కృష్ణ ఆర్.వి.మారిముత్తు.

English summary
Yuddham Sharanam Audio Release. Naga Chaitanya, Krishna Marimuthu, Vivek Sagar, Sai Korrapati, Rajani Korrapati, SS Rajamouli, Rama, MM Keeravani, Srivalli, Rana Daggubati, Abburi Ravi, Sridhar Lagadapati, Shobu Yarlagadda, Srinivas Avasarala, D Suresh Babu, Prasad V. Potluri, Mohan Krishna Indraganti, Karuna Sagar, Naveen Yerneni, Y Ravi Shankar at the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu