విశ్వక్ సేన్ చేతుల మీదుగా రామ రామ పాట.. అక్షర్ చిత్రం కోసం నందితా శ్వేత

యువ హీరోయిన్ నందిత శ్వేతా కీలక పాత్రలో నటించిన చిత్రం అక్షర. సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై బి చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్‌వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 26న రిలీజ్ కాబోతున్న అక్షర సినిమా లిరికల్ సాంగ్‌ను హీరో విశ్వక్ సేన్ విడుదల చేశారు. అక్షర. ఈ కార్యక్రమంలో నటుడు మధు నందన్ తదితరులు పాల్గొన్నారు.

 Vishwak Sen released Aksharas Rama Rama Song

ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. పాగల్ సినిమా సెట్‌లో నిర్మాత అహితేజ పరిచయం అయ్యారు. ఆయనతో మాట్లాడుతున్నపుడు సినిమా మీద ప్రేమ, మమకారం ఉన్న వ్యక్తి అనిపించింది. అందుకే అక్షర సినిమా సాంగ్ ఆవిస్కరించడానికి గెస్ట్‌గా పిలవగానే వచ్చాను. పాట చాలా చాలా బాగుంది. చిన్న సినిమాలు లాక్ డౌన్‌లో ఓటీటీకి వెళ్లాయి. మరికొన్ని థియేటర్ రిలీజ్‌కు వస్తున్నాయి. అలాంటి కోవలో వస్తున్న చిత్రమే అక్షర. ఈ సినిమాకు కూడా బాగా డబ్బులు రావాలి అని అన్నారు.

 Vishwak Sen released Aksharas Rama Rama Song

హీరోయిన్ నందిత శ్వేతా మాట్లాడుతూ.... అక్షర మంచి సినిమా. థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఫీల్‌తో వస్తారు. ఒక మంచి కథతో దర్శకుడు అక్షరను రూపొందించారు. మీరు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాము అని అన్నారు.

దర్శకుడు చిన్నికృష్ణ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థ లోపాలను చూపిస్తూ అక్షర సినిమా రూపొందించాం. ఈ సినిమాలో విశ్వక్ సేన్‌ను ఒక కారెక్టర్‌కు అనుకున్నాం. అయితే ఆయన అప్పటికే హీరోగా లాంచ్ అయ్యారు. కాబట్టి ఆయనను అడగడం ఇష్టలేక వద్దనుకొన్నాం. అక్షర ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇస్తుంది అని అన్నారు.

నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ... చిన్న సినిమాగా అక్షర‌ను స్టార్ట్ చేశాం. మీడియా సపోర్ట్‌తో పెద్ద సినిమాగా రిలీజ్ చేస్తున్నాం. ఒకే ఒక ఫోన్ చేయగానే విశ్వక్ సేన్ మా కార్యక్రమానికి వచ్చారు. వాస్తవానికి ఆయన వైజాగ్ వెళ్ళాలి కానీ మా పాటను రిలీజ్ చేయడానికి మా కోసం ఇక్కడికి వచ్చారు. అందుకు థాంక్స్ అని అన్నారు.

నటీనటులు: నందితా శ్వేత, సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్
కెమెరామాన్: నగేష్ బెనల్
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఎడిటర్: జి.సత్య
ఆర్ట్ డైరెక్టర్: నరేష్ బాబు తిమ్మిరి
కాస్టూమ్ డిజైనర్: గౌరీ నాయుడు
లైన్ ప్రొడ్యూసర్స్: గంగాధర్
రాజు ఓలేటి
పిఆర్వో: జియస్ కె మీడియా
కో- ప్రొడ్యూసర్స్: కే శ్రీనివాస రెడ్డి, సుమంత్ కొప్పు రావూరి,
నిర్మాణ సంస్థ : సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్,
నిర్మాతలు : సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ,
రచన, దర్శకత్వం: బి. చిన్నికృష్ణ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X