'2011 సంక్రాంతి' రేసులో మిగిలిన సినిమాలు ఇవే..
సంక్రాంతి దగ్గర పడుతూంటే అంతకు ముందు వరకూ పోటీలో ఉన్న ఒక్కో సినిమా రకరకాల కారణాలతో తప్పుకుంటోంది. అలా పోగా పోటీలో మిగిలిన స్టార్స్ చిత్రాలు బాలకృష్ణ...పరమవీర చక్ర, రవితేజ...మిరపకాయ. ఇక సిద్దార్ధ ఫాంటసీ అనగనగా ఓ ధీరుడు, సుమంత్..గోల్కొండ హై స్కూల్. ఈ నాలుగు చిత్రాలే ప్రస్తుతం కనపడుతున్నాయి. ఇక రామ్ గోపాల్ వర్మ, సునీల్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు చిత్రం, పూరి జగన్నాధ్...నేనూ నా రాక్షసి, ప్రభాస్, దశరధ్ ల మిస్టర్ ఫెరఫెక్ట్, గోపీచంద్ వాంటెడ్ చిత్రాలు వెనక్కి వెళ్ళిపోయాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో లేటవటమే ఈ చిత్రాలు వాయిదాకి కారణం అని చెప్తున్నారు. మరో ప్రక్క టాలీవుడ్ లో చోటు చేసుకున్న స్ట్రైక్ కూడా ఈ వాయిదాలకు కారణమైంది. మరో ప్రక్క అల్లరి నరేష్ తాజా చిత్రం అహనా పెళ్ళంట కూడా సంక్రాంతి రిలీజ్ అని చెప్తున్నారు. అయితే అది ఎంతవరకూ జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











