»   » 2015 టాలీవుడ్ హిట్స్, ప్లాప్ప్!

2015 టాలీవుడ్ హిట్స్, ప్లాప్ప్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ రోజు అంతా 2016వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక గడిచిన 2015వ సంవత్సరంలో టాలీవుడ్ చిత్రసీమకు సంబంధించిన విషయాలపై ఓ లుక్కేద్దాం!

2015 వ సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమ మంచి ఫలితాలను రుచి చూసిందని చెప్పొచ్చు. కొన్ని సినిమాలు నిరాశ పరిచినప్పటికీ ఈ ఏడాది పరిస్థితి ఫర్వాలేదనే చెప్పొచ్చు. మరో వైపు తెలుగు ఖ్యాతి ప్రపంచం నలువైపులా వ్యాపించిన సంవత్సరం 2015 సంవత్సరం అనే చెప్పాలి. మన సినిమా రేంజి ఏమిటో ఈ సంవత్సరం మనం కళ్లారా చూసాం. టాలీవుడ్ పరిశ్రమ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న 100 కోట్ల మార్కు కల ‘బాహుబలి' సినిమాతో నిజమైంది.


2015 వ సంవత్సరంలో నెం.1 సినిమా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి-దిబిగినింగ్'. ఈ సినిమా తెలుగులో 100 కోట్ల మార్కు దాటిని తొలి సినిమా. సినిమా నిర్మాతలతో పాటు బయ్యర్లకు ఈ సినిమా భారీ లాభాలు తెచ్చిపెట్టింది. గతంలో ఏ సినిమాకు ఊహించని విధంగా ఈ సినిమాకు లాభాలు వచ్చాయి. కలెక్షన్లతో పాటు, లాభాల్లో కూడా ఈ మూవీ ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది.


2015 Tollywood hits and flops

ఇక బాహుబలి తర్వాతి స్థానంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘శ్రీమంతుడు' మూవీ నిలిచింది. ఈ చిత్రం 2015 సంవత్సరంలో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది. సినిమా నిర్మాతలకు, బయ్యర్లకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది. ఈ సినిమా తర్వాతి స్థానంలో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచిన చిత్రం నాని హీరోగా వచ్చిన ‘భలే భలే మగాడివోయ్'. ఈ సినిమా కూడా నిర్మాతలకు, బయ్యర్లకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది.


ఇటీవల కుమార్ నిర్మాణంలో వచ్చిన మూవీ కుమారి 21ఎఫ్, ఓంకార్ తీసిన రాజుగారిగది, కళ్యాణ్ రామ్ పటాస్, సినిమా చూసిస్త మావ లాంటి చిత్రాలు కూడా సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టాయి.... ఈసినిమా వల్ల ఎవరికీ నష్టాలు రాలేదు.


ఇక బెంగాల్ టైగర టెంపర్, సన్నాఫ్ సతమ్యూర్తి, పండగ చేస్కో, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలకు హిట్ టాక్ వచ్చినా ఆశించదగ్గ లాభాలే రాలేదు. బయ్యర్లలో కొందరికి స్వల్ప లాభాగాలు రాగా, కొందరు మాత్రం కొంత మేర నష్టపోయారనేది ట్రేడ్ టాక్.


ఇక అఖిల్‌, బ్రూస్‌లీ, రేయ్‌, కిక్‌ 2, శివమ్‌, షేర్‌, సౌఖ్యం, హోరాహోరీ, శంకరాభరణం, డైనమైట్‌ లాంటి చిత్రాలు టాప్ ప్లాప్ సినిమాల లిస్టులో చేరిపోయాయి.

English summary
Check out 2015 Tollywood hit and flop movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu