For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ హీరోలు నన్ను నమ్మలేదు! (24 డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఇంటర్వ్యూ)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: సూర్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 24 మూవీ ఇటీవల విడుదలై తెలుగు, తమిళంలో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు విడుదలైన అన్ని కేంద్రాల్లో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈచిత్రం అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు విక్రమ్ కుమార్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి సినిమాకు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. ఈ సమావేశంలో విక్రమ్ తో పాటు నటుడు అజయ్, కో ప్రొడ్యూసర్ రాజశేఖర్, ఎడిటర్ ప్రవీణ్ పూడి పాల్గొన్నారు.

  మీడియా సమావేవంలో విక్రమ్ కుమార్ చెప్పిన వివరాలు.....

  సైన్స్‌ ఫిక్షన్‌ కథలంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటికైనా అలాంటి సినిమాని తెరకెక్కించాలని అనిపించేది. కొన్నేళ్ల కిందటే టైమ్‌ ఆధారంగా సాగే ఈ కథని రాసుకొన్నా. పుట్టుక మొదలు కాలంతోపాటే మన ప్రయాణం సాగుతుంటుంది. చాలా మంది ఒక పొరపాటు చేసి అపుడు అలా చేసి ఉండక పోతే బావుంటుందే అని తర్వాత బాధ పడుతుంటారు.

  వాళ్లు మళ్లీ వెనక్కి వెళ్లి ఆ తప్పుని సరిదిద్దుకొనే అవకాశమే వస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి పుట్టిందే '24'. ఈ కథని చాలామంది హీరోలకు చెప్పా. ప్రతి ఒక్కరూ బాగుందని మెచ్చుకొన్నవాళ్లే. సూర్య నమ్మారు కాబట్టే ఆయనకు ఈ విజయం దక్కిందన్నారు.(ఇతర హీరోలు తాను చెప్పిన కథను నమ్మలేదని విక్రమ్ కుమార్ మాటల్లో స్పష్టమవుతోంది)

  ఇది క్లిష్టమైన కథ ఇది. కానీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాం. అలా స్క్రిప్టుని తయారు చేసుకొనేందుకు చాలానే శ్రమించాల్సి వచ్చింది. ఇలాంటి కథల్ని నటీనటులకి చెప్పి ఒప్పించడం కూడా కష్టమే. కానీ సూర్య కథ వినగానే సినిమాని నిర్మించేందుకు కూడా ముందుకొచ్చారు. అది కథపై ఆయనకున్న నమ్మకానికి నిదర్శనం. నటుడిగా, నిర్మాతగా చాలా హ్యాపీగా ఉన్నారు అన్నారు.

  24 సినిమాకు ప్రీక్వెల్ ఉంటుందని విక్రమ్ కుమార్ తెలిపారు. స్లైడ్ షోలో ఆయన చెప్పిన మరిన్ని వివరాలు...

  విక్రమ్ పెర్పార్మెన్స్ సూపర్

  విక్రమ్ పెర్పార్మెన్స్ సూపర్

  సూర్య మూడు పాత్రలకీ ప్రాణం పోశాడాయన. ఆత్రేయ పాత్రలో సూర్యని తప్ప మరొకర్ని వూహించుకోలేం. సమంత, నిత్యమేనన్‌లు కూడా బాగా నటించారు అని విక్రమ్ కుమార్ తెలిపారు.

  24 ప్రీక్వెల్

  24 ప్రీక్వెల్

  ‘24'కి సంబంధించి చెప్పాల్సిన కథ ఇంకా చాలా ఉంది. ఆత్రేయ ఎందుకు విలన్‌గా మారాడు? అనేది ప్రేక్షకులకి తెలియాలి. అందుకే ప్రీక్వెల్‌ (ముందుభాగం)గా సినిమా తీయడం కోసం ప్రస్తుతం కథని సిద్ధం చేస్తున్నా అన్నారు.

  మహేష్, బన్నీతో

  మహేష్, బన్నీతో

  అల్లు అర్జున్‌, మహేష్‌బాబుతో వరుసగా సినిమాలు చేయబోతున్నా. ఈ ఏడాది చివర్లో అల్లు అర్జున్‌తో సినిమా మొదలవుతుంది. వచ్చే ఏడాదిలో మహేష్‌బాబుతో సినిమా వుంటుంది అన్నారు.

  బాలీవుడ్ నుండి పిలుపు

  బాలీవుడ్ నుండి పిలుపు

  ‘మనం' సినిమాని హిందీలో తీయమని సంజయ్‌లీలా భన్సాలీ నుంచి పిలుపొచ్చింది. మా ఇద్దరి మధ్య ఒక దఫా చర్చలు కూడా జరిగాయి. ఇంతలో ఆయన ‘బాజీరావ్‌ మస్తానీ'తో, నేను ‘24'తో బిజీ అయిపోయాం. ఈమధ్య మళ్లీ అక్కణ్నంచి కబురొచ్చింది. త్వరలోనే వెళ్లి కలవాలి. ఒకసారి చేసిన సినిమాని మళ్లీ చేయడం నాకు ఇష్టం లేదు. హిందీకి వెళ్లాలనే ఆశ అంతకన్నా లేదు. చూద్దాం ఏం జరుగుతుందో అన్నారు.

  English summary
  Check out 24 movie directoir Vikram Kumar interview.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X