»   » కంగ్రాట్స్...'3 ఇడియట్స్‌' కి 8 అవార్డులు

కంగ్రాట్స్...'3 ఇడియట్స్‌' కి 8 అవార్డులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఉత్తమ చిత్రం అవార్డుతో సహా మొత్తం ఎనిమిది ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అకాడమీ(ఇఫా) పురస్కారాలను సొంతం చేసుకుని '3 ఇడియట్స్‌' మరోసారి వార్తల్లో నిలిచింది. 11వ ఇఫా అవార్డుల ప్రదానోత్సవం శ్రీలంక రాజధాని కొలంబోలో కన్నులపండువగా జరిగింది. '3 ఇడియట్స్‌' చిత్రం 'ఇఫా' అవార్డుల్లో 13 ప్రధాన విభాగాలకుగాను 12 విభాగాల్లో నామినేటయ్యింది. మేలో ప్రకటించిన ఇఫా సాంకేతిక అవార్డుల్లోనూ ఈ చిత్రమే హవా చాటి 8 అవార్డులను పొందింది. ఉత్తమ సంభాషణలు, కూర్పు, నేపథ్య సంగీతం, బెస్టు సౌండ్‌ రికార్డింగ్‌, బెస్టు సాంగ్‌ రికార్డింగ్‌, బెస్టు రీ-రికార్డింగ్‌, బెస్టు సినిమాటోగ్రఫీ, బెస్టు స్క్రీన్‌ప్లే పురస్కారాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక 'పా' చిత్రంలో నటనకు గాను అమితాబ్ ‌బచ్చన్‌ ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకున్నారు.

'పా' చిత్రంలో నటించిన విద్యాబాలన్‌, 3 ఇడియట్స్‌ తో మురిపించిన కరీనా కపూర్‌ సంయుక్తంగా ఉత్తమనటి పురస్కారాన్ని పంచుకున్నారు. వెనుకటి తరం నిర్మాత, నటుడు హృతిక్‌ రోషన్‌ తాత జె.ఓంప్రకాశ్‌, ప్రముఖ తార జీనత్‌ అమన్‌ ను జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. 'ఇఫా' బ్రాండ్‌ అంబాసిడర్‌ అమితాబ్‌ బచ్చన్‌, బాద్‌ షా షారూక్‌ ఖాన్‌ వేడుకులకు హాజరుకాలేదు. 11 ఏళ్ల నుంచి ప్రతిఏటా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అమితాబ్‌ పాల్గొనకపోవడం ఇదే మొదటిసారి. శ్రీలంకలో మైనారిటీ తమిళుల ఆందోళనల వల్ల కమల్‌హాసన్‌, మణిరత్నం కూడా రాలేదు. తాము కూడా బహిష్కరిస్తున్నట్లు సౌతిండియా ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటించింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu