For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్ బాస్ ఇంట్లో గొడవలు నిజమే, ఓటమిపై అసంతృప్తి: ఆదర్శ్

  By Bojja Kumar
  |

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 టైటిల్ గెలిచే అవకాశం కొద్ది పాటి ఓట్ల తేడాతో కోల్పోయిన ఆదర్శ్..... రెండో స్థానంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన తర్వాత హైదరాబాద్ వచ్చేసిన అతడు సోమవారం రోజంతా తన పేరెంట్స్, సిస్టర్, వైఫ్, కొడుకుతో గడిపారు. మంగళవారం మీడియా ఇంటర్వ్యూలో బిజీ అయిపోయారు.

  ప్రిన్స్ నాకు ముందు నుండే తెలుసు. మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ జర్నీలో అతడితో కలిసి ఇంత టైమ్ స్పెండ్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అని ఆదర్శ్ తెలిపారు. బిగ్ బాస్ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా కొన్ని సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్నట్లు తెలిపారు.

  ఆ రూమర్ మీద...

  ఆ రూమర్ మీద...

  ఆదర్శ్ చేసిన మిస్టేక్ వల్లే ప్రిన్స్ ఎలిమినేట్ అయ్యాడు. ఆ సమయంలో ప్రిన్స్ కాదు... ఆదర్శ్ ఎలిమినేట్ కావాలి అనే రూమర్ ఉంది. దీనిపై ఆదర్శ్ స్పందిస్తూ ఆ సమయంలో ఇద్దరం నామినేట్ అయ్యాం. ఇద్దరం ఎలిమినేట్ అవుతామని భావించాం. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండగా కొంచెం వీక్ ప్లేయర్స్ ను ఆ నామినేషన్ జోన్లోకి తీసుకుని వచ్చి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేదనే ఫీలింగుతో తను అలా చెప్పాడే తప్ప వేరే ఏ ఉద్దేశ్యం లేదని ఈ సందర్భంగా ఆదర్శ్ క్లారిటీ ఇచ్చారు.

  Bigg Boss Telugu : NTR announces Funny Awards for Ex contestants మధు ప్రియ కేక
  కొంత కాలం ఫీలింగ్ ఉంది

  కొంత కాలం ఫీలింగ్ ఉంది

  ప్రిన్స్ నా గురించి అలా చెప్పిన తర్వాత ఎందుకలా అన్నాడన్న ఫీలింగ్ కలిగింది. దాని తర్వాత నేను అనలైజ్ చేసుకున్న తర్వాత నాకు తెలుసు నేను మిస్టేక్ ఏమీ చేయలేదని, ఎందుకన్నారన్న చిన్న ఫీలింగ్ మాత్రం అలా ఉండిపోయింది. కొంత బాధ ఉంది. చివరి వారంలో ప్రిన్స్ మళ్లీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మా మధ్య ఉన్న మిస్ అండర్ స్టాండింగ్ సాల్వ్ అయిందని ఆదర్శ్ తెలిపారు.

  గెలవక పోవడంపై కొంత అసంతృప్తి ఉంది

  గెలవక పోవడంపై కొంత అసంతృప్తి ఉంది

  బిగ్ బాస్ ఇంట్లో ఐదారు వారాలు ఉంటాననే ఫీలింగుతో అడుగు పెట్టాను. అయితే తర్వాత చివరకు ఉంటామనే నమ్మకం కలిగింది. చివరి వారంలో అది మరింత స్ట్రాంగ్ అయింది. అయితే గెలవకపోవడంపై కొంత అసంతృప్తి ఉన్న మాట నిజమే అని ఆదర్శ్ అన్నారు.

  శివ బాలాజీతో గొడవ

  శివ బాలాజీతో గొడవ

  శివ బాలాజీతో ఓసారి ఇంట్లో చిన్న గొడవ జరిగింది. తర్వాత అతడు నాకు అపాలజీ చెప్పాడు. తప్పు చేసినపుడు సారీ చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. పెద్ద మనసు చేసుకుని శివ సారీ చెప్పాడు. తర్వాత ఆ ఫీలింగ్ కొంత క్యారీ అయింది కానీ 70 రోజుల జర్నీలో శివతో నాకు మంచి ఈక్వెషన్ కుదరింది. దీని తర్వాత మా ఈక్వెషన్ కంటిన్యూ చేస్తామని తెలిపారు.

  అందరి మంచి ఫ్రెండ్స్ అయ్యా

  అందరి మంచి ఫ్రెండ్స్ అయ్యా

  70 రోజుల జర్నీలో అందరూ మంచి స్నేహితులయ్యారు. కొన్ని గొడవలు జరిగినా వెంట వెంటనే సాల్వ్ చేసుకుని ముందుకు సాగడం జరిగింది. ఇపుడు అందరితోనూ మంచి ఈక్వెషన్ ఉంది అన్నారు.

  తారక్ వల్లే

  తారక్ వల్లే

  బిగ్ బాస్ అనేది షిప్ అయితే, ఈ షిప్ కేప్టెన్ తారక్ గారు. బిగ్ బాస్ షో కు ఇంత పాపులారిటీ, క్రెడిట్ వచ్చిందంటే దానికి కారణం తారక్. ఫైనల్‌కి 12 కోట్ల ఓట్లు రావడం అనేది మామూలు విషయం కాదు... తారక్ వల్లే ఇది సాధ్యమైంది అన్నారు.

  మంచి హ్యూమన్ బీయింగ్

  మంచి హ్యూమన్ బీయింగ్

  తారక్ ప్రతి వీకెండ్ వచ్చి మమ్మల్ని గైడ్ చేసి ఒక ఫ్రెండ్ లాగా, బ్రదల్ లాగా చాలా ఎంటర్టెనింగ్ గా అటు ఆడియన్స్ ను అలరించి, ఇటు మమ్మల్ని అలరించి ఇంట్లోకి వచ్చి బిర్యానీ వండటం చాలా అద్భుతంగా అనిపించింది. ఆయన మంచి హ్యూమన్ బీయింగ్ అని ఆదర్శ్ చెప్పుకొచ్చారు.

  డిమాండ్ ఉంటే రెమ్యూనరేషన్ పెంచుతా

  డిమాండ్ ఉంటే రెమ్యూనరేషన్ పెంచుతా

  మీరు పాపులర్ అయ్యారు కాబట్టి మీ వద్దకు ఎవరైనా సినిమాలు చేద్దామని వస్తే రెమ్యూనరేషన్ పెంచేస్తారా? అనే ప్రశ్నకు ఆదర్శ్ స్పందిస్తూ... నాకు డిమాండ్ ఎక్కువగా ఉంటే నేను కూడా ఎక్కువ డిమాండ్ చేస్తానన్నారు.

  English summary
  Aadarsh shares over his experience with all other contestants for about 70 days in Bigg Boss house. Aadarsh further said that Bigg Boss is a challenging experience and clarified that there are no misunderstandings and clashes with Actor Prince.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X