»   » హర్రర్ కామెడీతో తమిళ్‌లోకి అడుగుపెడుతున్నాడు

హర్రర్ కామెడీతో తమిళ్‌లోకి అడుగుపెడుతున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రేమ కావాలి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో ఆది. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసినా కానీ ఆ తర్వాత అనుకున్నంతగా మెప్పించలేకపోయాడు. వరుసగా అపజయలనే అందుకున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక పెద్ద సక్సెస్ అనేది కష్టమే అని అర్థమయినట్టే, శమంతకమణి లాంటి సినిమాతో మల్టీ స్టారర్ కూడా అయ్యాక.. అక్కడా పెద్దగా గుర్తింపులేకపోవటంతో ఇక లాభం లేదనుకొని మనోడు ఈ సారి హార్రర్ కామెడీని మిక్స్ చేసిన నెక్స్ట్ నువ్వే అనే కథతో రాబోతున్నాడు.

అయితే ఆ చిత్రం తర్వాత ఆది తమిళ్ లో కూడా తన సినిమాలను రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నాడు. ఒకేసారి తెలుగు - తమిళ్ లో తెరకెక్కించి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు. మొదట దీకాయ్ అనే యువ దర్శకుడి కథతో రాబోతున్నాడట. ఆ సినిమా కామెడీ అడ్వెంచర్ తరహాలో తెరకెక్కనుంది.

Aadi Sai Kumar to make Tamil debut

అలాగే వరదరాజ్ అనే మరో తమిళ్ దర్శకుడితో ప్రేమ కథను ఒకే చేశాడు. ఈ రెండు సినిమాలను కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ఒకేసారి తెలుగు తమిళ్ లో నిర్మించబోతోందని సమాచారం. మరి ఆది ఆ సినిమాలతో అయినా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. ఇక ప్రస్తుతం నెక్స్ట్ నువ్వే అనే సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ బాగానే ఉంది. నవంబర్ లో ఆ సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నహాలు చేస్తున్నారు.

English summary
It looks like Aadi is ready to explore new arenas. The actor who will soon be seen in Next Nuvve is all set to foray into Kollywood. A source reveals that Aadi has taken on two films to be helmed by Deekay and Vijay Varadaraj.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu