»   » అనాధల నడుమ ఆర్తీ అగర్వాల్

అనాధల నడుమ ఆర్తీ అగర్వాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ సినీ నటి ఆర్తి అగర్వాల్‌ తన జన్మదిన వేడుకలను పీర్జాదిగూడలోని అల్పా అనాధ బాలల ఆశ్రమంలో ఘనంగా జరుపుకున్నారు. తండ్రి సిద్దాంత్‌ అగర్వాల్‌ సోదరి అతిథి అగర్వాల్‌ సోదరుడు ఆకాశ్‌ అగర్వాల్‌తో పాటు ఫ్యాన్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బాలుతో కలసి వచ్చిన ఆర్తి అగర్వాల్‌ అనాధ పిల్లల నడుమ బర్త్‌డే కేక్‌ను కట్‌చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె అనాధ బాలలకు బట్టలు పండ్లను పంపిణీ చేయడంతో పాటు ఆశ్రమంలో ఉంటున్న పిల్లలందరికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు ప్రవీణ్‌కుమార్‌తో పాటు అనాధ పిల్లలు పాల్గొన్నారు.

తరుణ్ ను ప్రేమించి ఆర్తి భంగపడిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆమె మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ తర్వాత అమెరికాలో కొంతకాలం ఉంది. ఇప్పుడిప్పుడే ఆమెకు సినిమా అవకాశాలు మళ్ళీ వస్తున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X