For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఓటీటీలోకి దూసుకువచ్చేసిన రామ్ అసుర్...

  |

  ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ కళతప్పిందని ఫీలవుతున్న సినీ లవర్స్ కళ్లుమూసుకుని ఓటీటీలకు ఓటేసేశారు. ఇంటిల్లపాదీ చక్కగా బుల్లితెరలకు అతుక్కుపోయారు. ఇక ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న కొత్త తరహా సినిమాలకు పట్టం కట్టేస్తున్న సినీ ప్రియులు రామ్ అసుర్ సినిమాపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తోంది. ఏఎస్పీ మీడియా, పై సంయుక్తంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ లోనూ మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది. ఇక ఓటీటీలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోందనే చెప్పాలి.

  ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ అసుర్ ఫస్ట్ లుక్ రిలీజ్ దగ్గర నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కృత్రిమంగా వజ్రాలు తయారు చేయడం అనే అంశమే జనాల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. విభిన్నమైన మార్కెటింగ్ స్ట్రాటజీతో సినిమాపై జనాల్లో అంచనాలు రేకెత్తించిన రామ్ అసుర్ టీమ్, ఆ అంచనాలకు తగ్గట్లుగానే సినిమాలో విభిన్నమైన కథాకథనాలతో ఆకట్టుకుంది.

  Abhinav Sardhar’s Ram Asur ruling OTT

  కొత్తదనం లేకపోతే స్టార్ హీరోల సినిమాలనైనా నిర్మాహమాటంగా పక్కన పెట్టేస్తున్నారు నేటి ఆడియన్స్. ఇలాంటి టైమ్ లో కేవలం ప్రమోషన్స్ తో ఊదరగొట్టేస్తే సరిపోదు అని సినీజనాలకు పూర్తిగా అర్ధమైపోయింది. ఈ విషయంలో రామ్ అసుర్ టీమ్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారనే చెప్పాలి. రామ్ అసుర్ టైటిల్ కు తగ్గట్లే మంచి చెడుల మధ్య మనిషి బ్యాలెన్స్ కోల్పోతే ఏమవుతుందోన్న కోణంలో సినిమాను తెరకెక్కించారు. ఆర్టిఫీషియల్ డైమండ్ తయారీ ఇద్దరి సైంటిస్టుల జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది. తమకు ఎదురైన పరిస్థితుల్లో ఎవరు ఏ విధంగా స్పందించారు అన్నదే సినిమాలో కీలకమైన పాయింట్.

  డైరెక్టర్ సహా సినిమాలో నటించిన వారందరూ దాదాపు కొత్తవారే అయినా తమ పాత్రల పరిథి మేరకు మంచి నటనే కనబరిచారు. ముఖ్యంగా సూరి పాత్రలో నటించిన అభినవ్ సర్దార్ సెకండ్ హాఫ్ ను తన భూజాల మీద నడిపించారు. ఇదే కథకు బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ లేకపోతే ఇది మరో రేంజ్ ప్రాజెక్ట్ అయ్యి ఉండేది అనడంలో సందేహమేలేదు. ఏమైనా ఈ ఫెస్టివల్ వీకెండ్ కు రామ్ అసుర్ బెస్ట్ ఛాయిస్.

  English summary
  Ram Asur movie all set for streaming on Amazon Prime. The movie is getting a huge applause from the viewers. Movie revolves around the manufacturing of a synthetic diamond, which turns the lives of two scientists into a living hell. How they deal with the process forms the rest of the story.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion