»   » మోడలింగ్ కంటే యాక్టింగ్ లోనే ఆనందాన్ని పోందుతున్నాను..!

మోడలింగ్ కంటే యాక్టింగ్ లోనే ఆనందాన్ని పోందుతున్నాను..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ పోడుగుకాళ్శ సుందరి దీపికాపదుకొనె తనకి మోడలింగ్ రంగం కంటే సినిమారంగం లోనే నేను చాలా ఆనందంగా ఉన్నానని అంటున్నారు. యాక్టింగ్ అనేది చాలా ఛాలెంజింగ్ తోకూడుకున్నదని అన్నారు. అంతేకాకుండా సినిమారంగంలో చాలా రిస్క్ లు ఉంటాయని ఆ రిస్క్ లుఅన్ని సినిమా హిట్ అయితే ఒక్కసారిగా పోతాయన్నారు. అంతేకాకుండా తన రాబోయే సినిమాలగురించి కూడా వివరించారు.

డేవిడ్ ధావన్ కుమారుడు రోహిత్ ధావన్ దర్శకత్వంలో 'దేసి బాయ్స్' అనే పేరుతో సినిమాలో నటించడానికి ఒప్పుకున్నానని అన్నారు. ఈ సినిమాలో 'అక్షయ్ కుమార్' మరియు 'జాన్ అబ్రహాం' హీరోలుగా నటించన్నారని తెలిపారు. తరువాత విశాల్ భరద్వాజ్ సినిమా. ఈసినిమాకి హొమి అదాజానిమా దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాని లవ్ ఆజ్ కల్ సినిమాని ప్రోడ్యూస్ చేసినటువంటి ఇల్లుమైనతి ఫిల్మ్స్ వారు చేస్తున్నారు. ఈసినిమాలో హీరోగా 'ఇమ్రాన్ ఖాన్' నటించనున్నారు. ప్రస్తుతం నవంబర్ చివరి వారంలో 'బ్రేక్ కి బాద్' మరియు డిసెంబర్ మొదటివారంలో 'ఖేలేంగే హామ్ జీ జాన్ సే' విడుదలకు సిధ్దంగా ఉందన్నారు.

'బ్రేక్ కి బాద్' సినిమా మాంటి రోమాంటిక్ లవ్ స్టోరీ అని అన్నారు. ఇందులో ఇమ్రాన్ ఖాన్ తో తెర మీద పండిచిన ప్రేమ చాలా అధ్బుతంగా వచ్చిందన్నారు. ఈ సినిమాకి ధనీష్ అస్లాం దర్శకత్వం వహించారని అన్నారు. ఇక 'ఖేలేంగే హామ్ జీ జాన్ సే' సినిమాని ఆస్కార్ నామినేటెడ్ లగాన్ ఫేమ్ అషుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించడం జరిగిందన్నారు. ఇందులో అభిషేక్ తో నేను పోటీపడి మరీ నటించడం జరిగందన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu