»   »  హాస్పటిల్ లో చేరిన హీరో ఆకాష్

హాస్పటిల్ లో చేరిన హీరో ఆకాష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఆనందం చిత్రంతో పరిచయమైన ఆకాష్ రీసెంట్ గా అపోలో హాస్పటిల్ హైదరాబాద్ లో చేరారు. దాంతో పిభ్రవరి 27న విడుదల కావాల్సిన ఆయన తాజా చిత్రం ఆనందం మళ్లీ మొదలైంది రిలీజ్ వాయిదాపడింది. ఆయన విపరీతమైన ఒత్తిడికి లోనవటంతో సడెన్ గా సిక్ అయ్యారని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన్ని ట్రీట్ చేసి,విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు ఇంటికి పంపేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆకాష్ హీరోగా దేవి క్రియేషన్స్ పతాకంపై ఆకాష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆనందం మళ్లీ మొదలైంది.' చిత్రాన్ని ఎన్.జె.రత్నావత్ నిర్మిస్తున్నారు. హీరో ఆకాష్ మాట్లాడుతూ దర్శకుడిగా తనకు తొలి అవకాశాన్నిచ్చిన రత్నావత్‌గారు మళ్లీ తన దర్శకత్వంలో సినిమా నిర్మించడం ఆనందంగా వుందన్నారు. ఇది ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్, నాకు స్టార్‌గా గుర్తింపుతెచ్చిన చిత్రం ఆనందం. అందుకే ఈ చిత్రానికి ‘ఆనందం మళ్లీ మొదలైంది' అనే టైటిల్ పెట్టామని అన్నారు. అనుకున్న దానికంటే తక్కువ బడ్జెట్‌లోనే సినిమా పూర్తి చేశామని, త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామనానరు.

Actor Aakash hospitalized

నిర్మాత రత్నావత్ మాట్లాడుతూ తన బ్యానర్‌లో ఇది రెండో చిత్రమని, ఆకాష్‌గారు మొదటిసారిగా దర్శకత్వం వహించిన ‘స్వీట్ హార్ట్' చిత్రం మంచి సినిమాగా గుర్తింపుపొందిందని, అయినా సరైన కమర్షియల్ విజయం దక్కలేదన్నారు. దాదాపు ఐదు సంవత్సరాలు తర్వాత మళ్లీ ఆయన దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిస్తున్నామని, తప్పకుండా ఇది మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందన్నారు.

సుమన్ జూపూడి మాట్లాడుతూ ఈ సినిమాలో అన్నీ మంచి పాటలే ఉన్నాయని, దర్శకుడు, నిర్మాత ఇద్దరూ ఎంతో సపోర్ట్ అందించారని, విజువల్‌గా కూడా పాటలు అద్భుతంగా వచ్చాయని అన్నారు. ఆకాష్ సరసన ఏంజెల్‌సింగ్, జియాఖాన్, అలేఖ్యలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

English summary
Actor Aakash fell ill and was rushed to the Apollo Hospital in Hyderabad. After undergoing treatment, he is ok now and has been taking rest at his home at present.
Please Wait while comments are loading...