twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్నయ్యతో ఎప్పుడూ గొడవే, నా భార్యకు జలస్: కార్తి

    తమిళ నటుడు కార్తి ఇటీవల ఓ తెలుగు ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

    By Bojja Kumar
    |

    Recommended Video

    Karthi Shared His Personal And Professional Matters To Media

    త్వరలో 'ఖాకీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కార్తి ఇటీవల ఆర్కే ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

    తెలుగు ప్రేక్షకులు తనను ఆదరించడం ఆనందంగా ఉందని, మా పక్కింట్లో నూతన ప్రసాద్ గారు ఉండేవారు. వారి ఇంటి నుండి ఎప్పుడూ తెలుగు పదాలు వినేవాడిని. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ సమయంలో కూడా ఎక్కువ తెలుగు వినేవాడిని, ఆ విధంగా తాను తెలుగు త్వరగా నేర్చుకున్నానని కార్తి తెలిపారు.

    అన్నయ్య సూర్యను తాను ఒక సినిమాల విషయంలో తప్ప మరే విషయంలోనూ ఫాలో కాలేదని, తమ ఇద్దరి అభిరుచులు వేరని, విభిన్నమైన క్యారెక్టర్లు అని కార్తి చెప్పుకొచ్చారు. చిన్నతనం నుండి ఇద్దరికీ ఏ విషయంలోనూ అసలు పడేది కాదని కార్తి తెలిపారు.

    ఎప్పుడూ పోట్లాడుకునే వారం

    ఎప్పుడూ పోట్లాడుకునే వారం

    చిన్నప్పటి నుండి ఇద్దరి మధ్య ప్రతి విషయంలో గొడవ జరిగేది. ఇలాంటివి సాధారణంగా అన్నదమ్ముల మధ్య అందరి ఇంట్లోనూ జరిగేవే. అన్నయ్య నేను చెప్పింది చేయ్ అనేవాడు. నేను అసలు వినేవాన్ని కాదు. ఏదైనా షేర్ చేసుకునే విషయంలో కూడా అన్నయ్యకు నాకు మధ్య గొడవ జరిగేది అని కార్తి తెలిపారు.

     అన్నయ్యదే పైచేయి

    అన్నయ్యదే పైచేయి

    చిన్నప్పుడు అన్నయ్య తనను చాలాసార్లు కొట్టాడనీ, ఎప్పుడూ అన్నయ్యదే పైచేయిగా ఉంటుందని ఆనాటి విషయాలను గుర్తుకు తెచ్చుకున్నాడు. నేను అమ్మనాన్న ఏది చెబితే అది చేసే వాడిని. అన్నయ్య అలా కాకుండా పూర్తిగా రివర్స్ చేసేవాడు అని కార్తి చెప్పారు.

    అప్పటి నుండి అన్నయ్య తగ్గాడు

    అప్పటి నుండి అన్నయ్య తగ్గాడు

    11వ తరగతి తర్వాత అన్నయ్య కంటే నేను ఎక్కువ హైట్ పెరిగాను. అపుడు నాతో కలిసి అన్నయ్య కాలేజీలో తిరగడానికి ఇష్టపడేవాడు కాదు. నీకు నాకు 10 ఫీట్ దూరం ఉండాలని చెప్పేవాడు. అప్పటి నుండి అన్నయ్య నా విషయంలో కొంత తగ్గాడు.... అని కార్తి చెప్పుకొచ్చారు.

     ఒక్క అమ్మాయి కూడా నా వైపు చూసేది కాదు

    ఒక్క అమ్మాయి కూడా నా వైపు చూసేది కాదు

    తనను కాలేజీ రోజుల్లో ఒక్క అమ్మాయి కూడా చూసేది కాదనీ, సినిమాలు హిట్ అయ్యాక మాత్రం ‘నన్ను పెళ్లి చేసుకో.. నన్ను పెళ్లి చేసుకో' అంటూ చాలా ప్రపోజల్స్‌ వచ్చేవి. సినీ ఇండస్ట్రీ నుంచి మాత్రం తనకు ఎలాంటి ప్రపోజల్స్ రాలేదని కార్తి తెలిపారు.

    ఆ విషక్ష్ంలో అన్నయ్య మీద కోపం వచ్చేది

    ఆ విషక్ష్ంలో అన్నయ్య మీద కోపం వచ్చేది

    కాలేజీలో చదివేపుడు మామతో ఒక ఛాలెంజ్ చేశాను. మంచి మార్కులు తెచ్చుకోవడంతో నాకు బైక్ కొనిచ్చారు. కానీ ఆ బైక్ నా కంటే అన్నయ్యే ఎక్కువ వాడే వాడు. అన్నయ్యకు తెలియకుండా కీ దాచేవాడిని. అయినా కీ ఎక్కడ ఉందో కనిపెట్టి బలవంతంగా నా బైక్ తీసుకుని వెళ్లేవాడు... అని కార్తి అప్పటి విషయాలను గుర్తు చేసున్నారు.

     యూఎస్ వెళ్లిన తర్వాత అన్నయ్య లోటు తెలిసింది

    యూఎస్ వెళ్లిన తర్వాత అన్నయ్య లోటు తెలిసింది

    నేను పై చదువుల కోసం యూఎస్ఏ వెళ్లిన తర్వాత అన్నయ్య లేని లోటు తెలిసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడింది. ఇప్పటికీ మేముంతా ఉమ్మడి కుటుంబంగానే ఉంటున్నాము. భార్య రంజనీ, వదిన జ్యోతిక మధ్య మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉంటుంది. నా భార్యకు, వదినకు మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉంటుంది. మా బ్రదర్స్ కంటే వారే ఎక్కువ క్లోజ్ గా ఉంటారు అని కార్తి తెలిపారు.

     అన్నయ్య అంటే రెస్పెక్ట్

    అన్నయ్య అంటే రెస్పెక్ట్

    అన్నయ్య సినిమాల్లో ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఆయనంటే నాకు ఎంతో రెస్పెక్ట్. సినిమాల విషయంలో అన్నయ్య దారిలో నడిచాను. ఆయన్ను చూసి చాలా నేర్చుకున్నాను అని కార్తి తెలిపారు.

     తమన్నాతో ఎఫైర్ గురించి

    తమన్నాతో ఎఫైర్ గురించి

    తమన్నాతో ఎఫైర్ అంటూ వచ్చిన వార్తల్లో అసలు నిజం లేదని కార్తి తెలిపారు. ఆ వార్తను తాను ఓ మ్యాగజైన్‌లో చదివాననీ,... టీవీలు, పేపర్లు, వెబ్‌సైట్లు నడవాలంటే అలాంటి స్పైసీ వార్తలు కావాల్సిందే కదా అని కార్తి తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు.

     నా భార్యకు జలస్

    నా భార్యకు జలస్

    ‘లవ్ సీన్స్‌లో హీరోయిన్లను టచ్ చేయకుండా నటించడం కష్టమా..?'.. అని ఇప్పటికీ తన భార్య రంజని అడుగుతుంటుందని తెలిపాడు. ఆ విషయంలో ఆమె కాస్త జలస్ పీలవుతుందని, కానీ ఈ ఫీల్డే అలాంటిది, ఇవి ఇక్కడ మామూలే అని చెబుతుంటాను. నేనేమీ పెద్ద యాక్టర్‌ను కాదు, నీకు ఇబ్బంది అనిపిస్తే నా సినిమాలు చూడకు అంటాను. ఆ స్థానంలో నేను ఉన్నా అలాగే జలస్ ఫీలవుతాను. నా భార్య ఒక వేళ నటి అయుంటే.... అలాంటి లవ్ సీన్లు చూడటానికి నేను కూడా ఇష్టపడను అంటూ కార్తి తన మనసులోని మాట బయట పెట్టారు.

     న్యూస్, పాలిటిక్స్ తెలియదు

    న్యూస్, పాలిటిక్స్ తెలియదు

    తమిళనాట తీవ్ర దుమారం రేపుతున్న మెర్సల్ సినిమా గురించి మాట్లాడటానికి కార్తి ఇష్టపడ లేదు. ఆ వివాదం గురించి తనకు తెలియదని, న్యూస్ ఛానల్స్, పత్రికలు చూసే అలవాటు లేదన్నారు. విజయ్ క్రిస్టియన్ కనుక బీజేపీని వ్యతిరేకిస్తున్నారా అంటే తనకు ఆ విషయం తెలియదని కార్తి సమాధానం ఇచ్చారు.

    English summary
    Actor Karthi said it is the blessings of Telugu people who accepted him. In an interview with RK, the actor has admitted that he is a quick learner which helped him to learn the Telugu language. The actor has revealed how his neighborhood helped him to learn Telugu in a fast manner. Karthi has opened up how his wife takes his films and his involvement with the roles acting with heroines.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X