For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైశ్రాయ్ ఘటనలో నిజం ఇదే, అందుకే నేను డ్రాప్... లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చూపింది వేరు: మురళీ మోహన్

|
Actor Murali Mohan About Viceroy Hotel Incident || Filmibeat Telugu

తెలుగు రాజకీయాల్లో, టీడీపీ చరిత్రలో సంచలన అధ్యాయం వైశ్రాయ్ ఘటన. ఎన్టీ రామారావును ముఖ్యమంత్రిగా పదవి నుంచి దించి చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్నారు. ఈ ఘటనపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నటుడు, టీడీపీ నేత మురళీ మోహన్ స్పందించారు.

ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఆయన భార్య చనిపోయారు. తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆయన్ను దగ్గరుండి చూసుకునే మనిషి లేకుండా పోయారు. పిల్లలంతా అప్పుడప్పుడు వచ్చి కలిసేవారు. ఆ సమయంలోనే లక్ష్మిపార్వతి ఆయనకు దగ్గరైంది. పెళ్లి చేసుకున్నారు, ఆ తర్వాత అసలు కథ మొదలైందని మురళీ మోహన్ తెలిపారు.

ఆమె ప్రమేయం పెరిగిపోవడం వల్లే...

ఆమె ప్రమేయం పెరిగిపోవడం వల్లే...

క్రమక్రమంగా తెలుగు దేశం పార్టీ రాజకీయాల్లో లక్ష్మీ పార్వతి ప్రమేయం పెరిగిపోయింది. అది పార్టీలో చాలా మందికి నచ్చలేదు. దీంతో అభిప్రాయ విభేదాలు వచ్చాయి. ఇదే విషయం ఎన్టీఆర్ గారికి చెప్పారు, ఆమెను హౌస్ వైఫ్‌గా ఉండమని చెప్పండి, ఆవిడకు ఇచ్చే గౌరవం మేము ఇస్తాం అన్నారు. దానికి పెద్దాయన ఒప్పుకోలేదు, దీంతో ఎమ్మెల్యేంతా కలిసి ఆయన్ను పదవి నుంచి దించేయాలని ప్లాన్ చేశారని మురళీ మోహన్ తెలిపారు.

కానీ అప్పటికే చాలా లేటయింది

కానీ అప్పటికే చాలా లేటయింది

వైశ్రాయ్ ఘటన జరుగబోయే ముందు రోజు రాత్రి అక్కడ చంద్రబాబుతో ఎమ్మెల్యేలంతా క్యాంపు పెట్టారు. జయప్రకాష్ నారాయణగారు ఆ సమయంలో ఎన్టీ రామారావు వద్ద పీఎస్‌గా ఉండేవారు. ఆయనకు కూడా ఇది నచ్చలేదు. వెంటనే నాకు ఫోన్ చేసి.... మురళీ మోహన్ గారు ఎన్టీరామారావుగారు ప్రెస్ వీరిని పిలిచారు. ఏదో చెబుతానంటున్నాడు. నేను ఆయన్ను ఆపుతాను. మీరు వాళ్లతో మాట్లాడి ఈ విభజన జరుగకుండా చూడండి అన్నారు. నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి వైశ్రాయ్ హోటల్ వద్దకు వెళ్లాను. కానీ అప్పటికే చాలా లేటయింది, నాయకుడిగా చంద్రబాబును ఎన్నుకోవడం జరిగిందని.... మురళీ మోహన్ గుర్తు చేసుకున్నారు.

బాలయ్య వెళ్లి చెప్పే వరకు తెలియదు

బాలయ్య వెళ్లి చెప్పే వరకు తెలియదు

నేను కాదంటే ఇంకొకరు నాయకుడిగా ఉంటారు తప్ప ఇది ఆగదని చంద్రబాబు అన్నారు. మాకు రామారావుగారి మీద వ్యతిరేకత లేదు కానీ ఆవిడ రాజకీయాల్లో వేలు పెట్టకుండా ఉంటాను అంటే వచ్చేస్తాం అన్నారు. ఇదే విషయం నేను లక్ష్మిపార్వతికి చెబితే... వాళ్లు చెప్పేదంతా అబద్దం, కార్యకర్తలను తీసుకొచ్చి ఎమ్మెల్యేలు అంటున్నారు. నమ్మొద్దు అన్నారు. అప్పటికి ఎన్టీ రామారావుగారు పడుకున్నారు. ఆయన్ను నిద్రలేపి ఈ విషయం చెప్పమంటే చెప్పలేదు. ఉదయం బాలయ్య వెళ్లి జరిగిన విషయం చెప్పారు. మధ్నాహ్నం వరకు ఎన్టీరామారావుగారిని దించేశారు... అని మురళీ మోహన్ తెలిపారు.

అందుకే నేను డ్రాప్ అయ్యాను

అందుకే నేను డ్రాప్ అయ్యాను

తర్వాత నేను ఎన్టీ రామారావుగారి ఇంటికి వెళ్లడంతో చైతన్య రథంలో ఎక్కడికో బయల్దేరడానికి సిద్ధమయ్యారు. ఎక్కడికి అని అడిగితే సికింద్రాబాద్ వెళ్లి గాంధీ విగ్రహానికి దండవేసి వచ్చేద్దామన్నారు. అయితే చైతన్య రథం పైన ఎక్కి కూర్చోవడంతో ఆయన ప్రజలను రెచ్చగొట్టడానికి వెళుతున్నారో? మరేం చేయడానికి వెళుతున్నారో అర్థం కాలేదు. ఈ పరిస్థితుల్లో మనం వెళ్లడం కరెక్ట్ కాదని డ్రాప్ అయ్యాను. తర్వాత నేను నేరుగా వైస్రాయ్ వద్దకు వెళ్లిన కొంతసేపటికి ఈ రథం అక్కడికి వచ్చిందని మురళీ మోహన్ వెల్లడించారు.

చెప్పు వేసింది ఎమ్మెల్యేలు కాదు, సినిమాలో చూపింది వేరు

చెప్పు వేసింది ఎమ్మెల్యేలు కాదు, సినిమాలో చూపింది వేరు

‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో వైస్రాయ్ హోటల్‌లో ఉన్నది కార్యకర్తలు అని చూపించి ఉండొచ్చు కానీ... హోటల్‌లో ఉన్నది ఎమ్మెల్యేలే. నేను స్వయంగా హోటల్ లోకి వెళ్లి చూశాను కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే నేను ప్రచారం విభాగం బాధ్యతలు చూశాను, అన్ని ప్రాంతాలు తిరిగాను కాబట్టి ఎవరు ఎమ్మెల్యేలనే విషయం బాగా తెలుసు. వందమందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆసమయంలో జరిగిన గొడవలో ఎవరో ఆకతాయి చెప్పు విసిరారు. అది పెద్దాయనకు తగల్లేదు కానీ అక్కడి వరకు వచ్చి పడిందని... మురళీ మోహన్ గుర్తు చేసుకున్నారు.

English summary
Actor Murali Mohan about Viceroy Hotel Incident. Murali Mohan Maganti is an Indian film actor, producer, politician and business executive from Telugu cinema. In 1973, Murali Mohan debuted in Jagame Maya, produced by Poornachandra Rao Atluri. He gained recognition with the 1974 film Tirupati, directed by Dasari Narayana Rao. He has acted in over 350 feature films.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more