»   » సడెన్‌ మార్పులు: రంగనాథ్‌కు కన్నీటి వీడ్కోలు (పిక్చర్స్)

సడెన్‌ మార్పులు: రంగనాథ్‌కు కన్నీటి వీడ్కోలు (పిక్చర్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆత్మహత్య చేసుకోవడానికి వారం రోజుల ముందు నుంచి నటుడు రంగనాథ్‌లో అకస్మాత్తుగా మార్పులు కనిపించాయని అంటన్నారు. రోజూవారీ కార్యక్రమాలను తగ్గించుకుని గాంధీనగర్‌లోని తన నివాసంలో కూర్చోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తూ వచ్చారని అంటున్నారు.

దానికితోడు, ప్రార్థనలు చేయడం పెంచారని, నుదుటికి విభూతి రాసుకోవడం ప్రారంభించారని అంటున్నారు. తన మిత్రులు, కుటుంబ సభ్యులతోనే కాకుండా ఓ తెలుగు పత్రికా ప్రతినిధితో మాట్లాడిన తీరును బట్టి ఆయనలో ఆత్మహత్య చేసుకునే దిశగా పయనిస్తున్నారనేది అర్థమవుతోందని అంటున్నారు. అతనిలో వస్తున్న మార్పులను పని మనిషి మీనాక్షి గమనిస్తూ వెళ్లారు.

రంగనాథ్ దేని గురించో ఆందోళన చెందుతున్నట్లు కనిపించినప్పుడు పనిమనిషి మీనాక్షి అడుగుతుండేది. టీవీలో వచ్చిన దుర్వార్త తనను కలవరపెట్టినట్లు చెప్పేవారని ఆమె చెప్పింది. రంగనాథ్ కుమారుడు నరేంద్ర కుమార్ బెంగళూరులో ఐటి ఉద్యోగం చేస్తున్నారు. తాను బెంగుళూర్ రావాలని అడిగితే కూడా తన తండ్రి రంగనాథ్ ఇష్టపడలేదని ఆయన అన్నారు.

రంగనాథ్‌

రంగనాథ్‌

ప్రముఖ నటుడు రంగనాథ్‌కు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు అంతిమ వీడ్కోలు పలికారు. శనివారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడిన రంగనాథ్ అంత్యక్రియలను ఆదివారం సాయంత్రం సికింద్రాబాదులోని బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో నిర్వహించారు.

చితికి నిప్పంటించిన కుమారుడు

చితికి నిప్పంటించిన కుమారుడు

రంగనాథ్ చితికి తనయుడు నాగేంద్ర నిప్పంటించారు. రంగనాథ్‌కు శ్రద్ధాంజలి ఘటించినవారిలో రాష్ట్రమంత్రి శ్రీనివాసయాదవ్, సినీ ప్రముఖులు చిరంజీవి, మురళీమోహన్, జమున, గిరిబాబు, పరుచూరి గోపాలకృష్ణ, ఎస్పీ బాలసుబ్రమణ్యం, రాళ్లపల్లి, తమ్మారెడ్డి భరద్వాజ, శివాజీరాజా, శివకృష్ణ, చలపతిరావు, రాజ్యలక్ష్మి, విజయచందర్, ఝాన్సీ, ముత్యాలసుబ్బయ్య తదితరులున్నారు.

పోస్టుమార్టం తర్వాత...

పోస్టుమార్టం తర్వాత...

రంగనాథ్ మృతదేహానికి గాంధీ దవాఖాన ఫోరెన్సిక్ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి ఆదివారం ఉదయం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆ తర్వాత భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఫిలించాంబర్‌కు తరలించారు. అక్కడ ఆయనకు పలువురు శ్రద్ధాంజలి ఘటించారు.

తర్వాత ఇంటికి...

తర్వాత ఇంటికి...

గాంధీనగర్‌లోని సూర్య రెసిడెన్సీ అపార్టుమెంట్‌లో ఉంటున్న రంగనాథ్ కూతురు నీరజ ఇంటికి భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. ఆయన పార్థివదేహానికి పలువురు నివాళులర్పించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

భారీ సంఖ్యలో అభిమానులు

భారీ సంఖ్యలో అభిమానులు

భారీ సంఖ్యలో అభిమానులు, మిత్రులు, సన్నిహితులు వెంటరాగా భౌతికకాయాన్ని బన్సీలాల్‌పేటలోని శ్మశానవాటికకు తరలించారు. తనయుడు నాగేంద్ర నిప్పంటించి దహన సంస్కారాలను నిర్వహించారు.

నెల రోజుల క్రితం మాట్లాడారు...

నెల రోజుల క్రితం మాట్లాడారు...

కుమారుడు నరేంద్ర కుమార్ నెల రోజుల క్రితం రంగనాథ్‌తో మాట్లాడారు. అయితే, బెంగుళూరుకు రావాలంటే తన తండ్రి రంగనాథ్ నిరాకరించారని ఆయన చెప్పారు

చాలా నిరాకరించారు...

చాలా నిరాకరించారు...

కొద్ది నెలలుగా ఆయన తనకు వచ్చిన ఆఫర్లను తిరస్కరిస్తూ వచ్చారని అంటున్నారు. ఆ విధమైన పాత్రలు చేయడం ఇష్టం లేదంటూ తిరస్కరిస్తూ వచ్చారని అంటున్నారు.

డ్రైవర్ కూడా లేడు...

డ్రైవర్ కూడా లేడు...

రంగనాథ్ ఇంటి ముందు నానో కారు ఆపి ఉండేది. తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ షూటింగులకు, షాపింగ్‌కు వెళ్లేవాడు.

అన్నీ మానేశారు..

అన్నీ మానేశారు..

రంగనాథ్ రెగ్యులర్‌గా టెన్నిస్ ఆడేవారని, నెల రోజుల నుంచి అది మానేశారని, చేతులు నొప్పి పెడుతున్నాయనే కారణం చెప్పేవారని, భోజనం ఆలస్యంగా తీసుకోవడమో.. మానేయడమో చేస్తూ వచ్చారని మీనాక్షి చెప్పారు.

చివరిసారి ఫిబ్రవరిలో...

చివరిసారి ఫిబ్రవరిలో...

తన తండ్రి రంగనాథ్‌ను తాను చివరిసారి ఫిబ్రవరిలో కలిసినట్లు నరేంద్ర కుమార్ చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఏమిలేవని అన్నారు. తమ అమ్మ చనిపోయినప్పటి నుంచి తమ నాన్నకు మీనాక్షి అనే పనిమనిషి సేవలందిస్తున్నారని అన్నారు. కొన్ని సందర్భాల్లో తన నాన్న ఫోన్‌లో అందుబాటులో లేకపోతే అన్ని విషయాలు మీనాక్షి ద్వారా చెప్పేవాళ్లమని అన్నారు. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో అర్థం కావడంలేదుని అన్నారు.

English summary
Sudden changes started appearing in veteran actor Ranganath’s life in the last few weeks before his death. He ended his former routine and sat inside his apartment at Gandhinagar. He also started praying more and applying vibhuti on his forehead.
Please Wait while comments are loading...